Wednesday, December 27, 2006

నాటి కథ- glimpses of a village's historic chronicle

గువ్వల జంట, గోరింటాకు
మువ్వన్నెల జెండా, మిఠాయి పొట్లం
వెన్నెల చంద్రుడు, పిచుకల గూడు
గల గల పారే అల్లరి వాగు,
చిల్లరకొట్టు శెట్టిగారి చెవిపోగు
గోధూళివేల గొడ్ల అరుపులు
పనస కొమ్మల్లో చేరి పిట్టల పకపకలు
అలికిన వాకిలి, తొలకరి జల్లు
మట్టి వాసన, గడ్డివాము, చుట్టపొగ
తాత దగ్గు, తంగేటి పూలు
కావిడి కుండలు, ఊరవతల బండలు
చిక్కటి చీకటి, చిటారుకొమ్మ
టీ కొట్టు గోడమీద చిరంజీవి బొమ్మ
కారడివి, కొండచిలువ ఈల
కోతుల గుంపు, కుక్కల తొందర
ఆగని ఎంకమ్మ-ఎల్లవ్వ తగాద
కల్లుతాగ ముక్కాళ్ళ అవ్వ పరుగు
ఇవ్వన్ని నేడెమైపొయ్యాయో దేవుడెరుగు!

తను వీడగ...

కంటి నీరైనా కాకపోతిని నీ చెక్కిలి చేరగ ధారగా
శ్వాస వీడక వేగుచుంటిని నీ ఆశ నన్ను వీడగా
మనసు మౌనపు మంటలలో బాసలు మసికావుగా
వయసు చేసిన గాయం రాచపుండై రగిలెనుగా
మిన్ను మన్ను ఏకమైనా మనమెన్నటికీ కలువముగా
తెగువలేని మగువతో ప్రణయం మరణమేగా!

Saturday, December 23, 2006

PV., LK Advani and Laloo

Once PVNR (PV Narasimha Rao), L.K.Advani and Laloo Prasad Yadav were travelling in an autorickshaw. They met with an accident and all three of them died.

Yama Raja was waiting for this moment at the doorstep of death. He asks PVNR and Advani to go to HEAVEN. But, for Laloo, Yama had already decided that he should be sent to HELL. Laloo is not at all happy with this decision. He asks Yama as to why this discrimination is being made. All the three of them had served the public. Similarly, all took bribes, all misused public positions, etc. Then why the
differential treatment? He felt that there should be a formal test or an objective evaluation before a decision is made; and should not be just assessed on opinion or pre-conceived notions.


Yama agrees to this and asks all the three of them to appear for an English test.PVNR is asked to spell "INDIA" and he does it correctly.Advani is asked to spell "ENGLAND" and he too passes. It is Laloo's turn and he is asked to spell "CZECHOSLOVAKIA".Laloo protests that he doesn't know English. He says that this is not fair and that he was given a tough question and thus forced to fail with false intent.


Yama then agrees to conduct a written test in Hindi (to give another chance assuming that Laloo should at least feel that Hindi would provide an equal platform for all three).


PVNR is asked to write "KUTTA BOLA BHOW BHOW". He writes it easily and passes. Advani is asked to write "BILLY BOLI MYAUN MYAUN". He too passes. Laloo is asked to write "BANDAR BOLA GURRRRRR....." Tough one. He fails again.


Laloo is extremely unhappy. Having been a student of history (which the other two weren't), he now requested for all the 3 to be subjected to a test in history Yama says OK but this would be the last chance and that he would not take any more tests.

PVNR is asked: "When did India get Independence?". He replied "1947" and passed. Advani is asked "How many people died during the independence struggle?". He gets nervous. Yama asked him to choose from 3 options: 100,000 or 200,000 or 300,000.Advani catches it and says 200,000 and passes.
It's Laloo's turn now. Yama asks him to give the Name
and Address of each of the 200,000 who died in the struggle. Laloo accepts defeat and agrees to go to HELL.


Moral of the story :
IF YOUR MANAGEMENT HAS DECIDED TO SCREW YOU, THERE IS NO ESCAPE.

(forwarded email)
Friday, December 15, 2006

తొలి చూపు

తొలి చూపుల చిరు జల్లుకు
వెన్నెల మంటలు రేగేనె
నీ క్షణిక చూపుల శరాలు
యద గదిని తొలచేలె
వెనువెంటనే నీ జంటను కాక్షించితిని
నీ నగవుల సెగలలో
నే స్వాంతన పొందగ
నా కలల కౌగిలిలో
నువ్వు చెంతన చేరగ
కలిగిన వింత భావం ప్రణయమని

నీ కొరకై నా తపన
చింత చిగురింతై విరియగ
నీ రూపం నను వీడక
వింత పులకింతై పుష్పించగ
విరిసిన వలపు పుష్పం ప్రేమని

నా స్వప్నం నిత్య సత్యమని
నిను చేరగ నలు దిక్కులు వెదకితిని
నా డెందపు రవములను
విందువేమోనని అరుదెంచితిని
దవళ కాంతుల దివ్య సుందరి దరి చేరెదనని...

ఆశ

నీ చూపుల వలలో చిరుచేపలా చిక్కితిని
నీ అందాల మకరందంలో మత్తుడనై మైమరచితిని!

నా ప్రతి శ్వాస ఒక ఆశై నిత్యం నిను కోరె
నా ప్రతి మాట యదపాటై నీ వలపులన్ తలచె
అనుక్షణం నీ జతకై మనసంతా నీ నగవై
కనురెప్పల కలయికను కఠినతరం చేసెను!

నీ కాలి మువ్వల సరిగమల సవ్వడి వినుటకు
నీ పలుకుల తళుకులలో పరవశించుటకు
జాజిపూల వనంలో జాబిలి ఆగమన వేళ
నీ కనుల వెన్నెల కాంచగ వేచియుందును!

నిశిదివసాలు నిన్నే కోరుతూ నిరీక్షిస్తున్న నన్ను
నీ ప్రేమకు పాత్రుడ్ని చేస్తావని ఆశిస్తున్నాను!

Tuesday, December 12, 2006

పనికత్తెలు-ప్రభుత్వాలు

సద్దికూడు మూటగట్టుకొని మసక చీకట్లో
రోజు కూలీ అడ్డకు బోయె అరుణక్క...
ఇంటింటికి పోయి అంట్లుతోమ బట్టలుతక
ఆరాటంగ బయల్దేరె బక్కచిక్కిన బాయమ్మత్త...
దొరగారి ఎడ్లు మేప దొరసానిలా చేత
ముల్లుగర్ర బట్టుకొని బయటకుపోయె చిన్నమ్మ...
నా సిన్నప్పట్నుండి సూత్తన్న ఈ తతంగం,
జుట్టు నెరస్తన్నా అలసటెరగ్గ పనికి పోతన్రు
ఈ పనికత్తెలు, ఇంటిని నడపగ ఈ తల్లులు!

మోసపోవడం మా మొదటి హక్కని వీరి
నుదిటి మీద రాసుందేమో! ప్రతి ఎదవ
ఎన్నికలప్పుడు అది సేత్తం ఇది సేత్తమని
కల్లబొల్లి కబుర్లు సెప్తరు,చౌరస్తాలో మైకుల్లో
మాయదారి మాటలు సెప్పి మభ్యపెడ్తరు...
చాటుగొచ్చి పచ్చ నోటు చేతిలొబెట్టి
తమకే ఓటెయ్యమని నచ్చజెప్తరు!
ప్రతి ఎన్నికలకి ఇనే రామాయనమేయని
మిన్నకుంటరు పైకం చేతిలో పడ్డాక పనికత్తెలు,
ఇదే ఇంగితమంటరు ఇల్లు గడపగ ఈ తల్లులు!

రెక్కలు ముక్కలయ్యేదాకా పనిచేసి గూడు చేరాక
సందెకాడ చెట్టుకింద గట్టున కూకొని ఉన్నట్టుండి
కిసుక్కున నవుతరు- ప్రభుత్వాలు మారినా
ప్రజల గతి మారెనా?- అని మనసులో అనుకొంటరెమో!

పెందలకడ లేసి ఆలోసిత్తన్న నాకు అరుపినబడ్డది,
"ఒరయ్యో! సక్కదనం సాలుగాని కాంట్రాక్టరు
కనకయ్య బండొచ్చి మొత్తలో నిలబడ్డది,
బండలు కొట్టగ పోవాల నడువ్" అని!


("అంతులేని కథ" కి ప్రసాద్‌గారి వ్యాఖ్యిచ్చిన స్పూర్తితో, ఈనాడు వార్త ప్రేరణతో)

Saturday, December 09, 2006

YOU say it all!- worth reading

Written by Dr. Abdul Kalam

I was in Hyderabad giving this lecture, when a 14 yearold girl asked me for my autograph. I asked her what her goal in life is.She replied: I want to live in a developed India.For her, you and I will have to build this developed India. You must proclaim.India is not an under-developed nation; it is a highlydeveloped nation.

Do you have 10 minutes? Got 10minutes for your country?If yes, then read; otherwise, choice is yours.

YOU say that our government is inefficient.YOU say that our laws are too old.YOU say that the municipality does not pick up the garbage.YOU say that the phones don't work; the railways are a joke, The airline is the worst in the world,mails never reach theirdestination.YOU say that our country has been fed to the dogs and is the absolute pits.YOU say, say and say.What do YOU do about it?
Take a person on his way to Singapore.Give him a name?.........YOURS.Give him a face?...........YOURS.YOU walk out of the airport and you are at yourInternational best. - In Singapore you don't throw cigarette butts on the roadsor eat in the stores.- YOU are as proud of their Underground Links as they are.- You pay $5 (approx. Rs.60) to drive through OrchardRoad (equivalentof Mahim Causeway or Pedder Road) between 5 PM and 8PM.- YOU come back to the parking lot to punch yourparking ticket if youhave over-stayed, identity. In Singapore you don't sayanything, DO YOU?- YOU wouldn't dare to eat in public during Ramadan,in Dubai.- YOU would not dare to go out without your headcovered in Jeddah. -YOU would not dare to buy an employee of the telephone exchange inLondon at 10 pounds (Rs.650) a month to, "see to it that mySTD and ISD calls are billed to someone else."- YOU would not dare to speed beyond 55 mph (88 km/h)in Washington and then tell the traffic cop, "Jaanta hai main kaun hoon(Do you know who I am?). I am so and so's son. Take your two bucks and get lost."- YOU wouldn't chuck an empty coconut shell anywhere other than the garbage pail on the beaches in Australia and NewZealand.Why don't YOU spit Paan on the streets of Tokyo?Why don't YOU use examination jockeys or buy fake certificates inBoston?????We are still talking of the same YOU.YOU can respect and conform to a foreign system in other countries but cannot in your own. You throw papers and cigarettes on the road the moment you touch the Indian ground.If you can be an involved and appreciative citizen in an alien country,why cannot you be the same here in India?

Once in an interview, the famous Ex-municipal Commissioner of Bombay,Mr. Tinaikar, had a point to make."Rich people's dogs are walked on the streets to leave their affluent droppings all over the place," he said. "And then the same people turn around to criticize and blame the authorities for inefficiency and dirty pavements. What do they expect the officers to do?Go down with a broom every time their dog feels the pressure in his bowels? In America or any where else every dog owner has to clean up after his pet has done the job. Will the Indian citizen do that here?" He's right. We go to the polls to choose a government and after that forfeit all responsibility. We sit back wanting to be pampered and expect the government to do everything for us whilst our contribution is totally negative. We expect the government to cleanup but we are not going to stop chucking garbage all over the place nor are we going to stop to pick up a stray piece of paper and throw it in the bin.We expect the railways to provide clean bathrooms but we are not going to learn the proper use of bathrooms.We want Indian Airlines and Air India to provide the best of food and toiletries but we are not going to stop pilfering at the least opportunity. This applies even to the staff that is known not to pass on the service to the public. When it comes to burning social issues like those related to women, dowry, girl child and others, we make loud drawing room protestations and continue to do the reverse at home. Our excuse?"It's the whole system which has to change, how will it matter if I alone fore go my son's rights to a dowry."So who's going to change the system? What does a system consist of? Very conveniently for us it consists of our neighbours,other households, other cities, other communities and the government.Butdefinitely not YOU. When it comes to us, actually making a positive contribution to the system we lock ourselves along with our families into a safe cocoon and look into the distance at countries far away and wait for a Mr.Clean to come along & work miracles for us with a majestic sweep of his hand or we leave the country and run away.- Like lazy cowards hounded by our fears we run toAmerica to bask in their glory and praise their system.- When New York becomes insecure we run to England.- When England experiences unemployment, we take the next flight out to the Gulf.- When the Gulf is war struck, we demand to be rescued and brought home by the Indian government.Everybody is out to abuse and rape the country. Nobody thinks of feeding the system. Our conscience is mortgaged to money.Dear Indians, the article is highly thought inductive,calls for a great deal of introspection and pricks one's conscience too!..I am echoing J.F. Kennedy's words to his fellowAmerican to relate toIndians!"ASK WHAT WE CAN DO FOR INDIA AND DO WHAT HAS TO BE DONE TO MAKE INDIA WHAT AMERICA AND OTHER WESTERN COUNTRIES ARE TODAY"Let's do what India needs from us.

Thank You,
Dr. Abdul Kalaam

(forwarded email)

FAILURE- Check out this guys....very interesting!

Go to http://www.google.com/ and type in the search key "failure" no spaces.
See the first link...(2nd result)

Tuesday, December 05, 2006

అంతులేని కథ

అలచందలచేని పక్కనున్న యేటిలో కొంగ వాలిందట
చూడబోయిన చిన్నోడిని అమ్మ వారించిందట
అలిగేడుస్తున్న వాడికి అంతులేని కథ చెప్పిందట
ప్రజాస్వామ్యమంటే పకపకలని
ప్రజలరాజ్యంకాదు పెద్దలదే రాజ్యమని
ఓటుకి నోటుతో విలువ కట్టొచ్చని
నోటికి నాటుసారాతో తాళంవేయొచ్చని
రౌడీలతో రిగ్గింగు చేయొచ్చని
నేతల మాయ మాటలు నీటిమూటలని
ప్రతి ఎన్నికల తరువాత తెలుసుకొంటాడు ఓటరు!
అయినా ఓటరు మారుతుంది తన తలరాతని
ఆశపడి ఎన్నికలకు ఆయత్తమవుతాడు
అలచందలచేని పక్కనున్న యేటిలో కొంగ వాలిందట
చూడబోయిన చిన్నోడిని అమ్మ వారించిందట
అలిగేడుస్తున్న వాడికి అంతులేని కథ చెప్పిందట
ఓటుకోసం ఇంటింటికి తిరిగుతాడు టోపివోడు
తాటికాయ కబుర్లు చేంతాడంత వాగ్దానాలు విని
కలల లోకంలో తేలుతూ ఇంటిల్లిపాది
అందలమెక్కిస్తారు ఆ ఖరీదైన బిచ్చగాడ్ని
తంతంతా ముగిసాక ఎంతెతికినా కనపడడు
అవసరానికి వెళ్తే ఆకాశమవతల తన విలాసమని
గడపనుండే గెంటేస్తడు ఈ వింత బిచ్చగాడు!
జీవనచక్రంలో ఎన్నడు మారని ఎన్నికల చక్రమిది
ఓటరు ఓటు విలువో నేతల గారడీ చలవో
అంతుబట్టదు ఈ ఎన్నికల చిత్రం
వింతగుంటది భలారే విచిత్రం!!
అలచందలచేని పక్కనున్న యేటిలో కొంగ వాలిందట
చూడబోయిన చిన్నోడిని అమ్మ వారించిందట
అలిగేడుస్తున్న వాడికి అంతులేని కథ చెప్పిందట

Sunday, December 03, 2006

HISTORY AND TRENDS: What they promise?---Death? Desolation??

The following 3 posts are intended for retrospection but not against any race, sect, religion or philosophy. Also if there are any copyright issues regarding the usage of photos please email me at uniquespeck@gmail.comWestern culture(rather, World Culture)- Extreme freedom leading to alcohol,sex and substance(drugs) abuses. Almost anything, everything is abused- now it has become the world culture.....Counter it! save the youth, save yourselves..... SPARE THE ROD SPOIL THE CHILD. CULTURAL FREEDOM in the making of juvenile and young CRIMINALS- its a plague spread all over the world today


HISTORY AND TRENDS: What they promise?---Death? Desolation??

Ethnic conflict-LTTE, the deadly force and Srilanka: Who is right? Atrocities argued on either side


Arab hostility: In the name of Divine Inheritence- who is unjust?(look at the land area of Israel)


Taiwan....flexing its muscles...never ending conflict of/for LAND


Destruction of Babri by Hindu extremists called kar sevaks in the largest Democracy: Dirty politics to the extent of creating religious tensions: god(Rama or whosoever) doesnot dwell in temples but in hearts!Sectarian violence(Shia-Sunni, Catholic-Protestant, Shivas-Vaishnavas and many more): Blasts in Iraq in civilian places targetting Shi-ites

HISTORY AND TRENDS: What they promise?---Death? Desolation??

khmer rouge atrocities(genocide)- Communism's deadliest mistakes


The undeniable holocaust-NAZI arrogance: Racial hatred at its pinnacle- a Russian Jew being burried into a mass grave


World War 2:LITTLE BOY and FAT MAN'S dance on Hiroshima and Nagasaki. America's so-called 'justification' questionable inspite of Tokyo's preparation to surrender even before bombs were dropped

Terrorism in the name of Islam,the religion of peace(it was,is present in all religions-Crusaders of pre-reformation Christianity, feudal and religious extremism in Hindus etc...I am just exemplifying)-: WTC destructionMumbai blasts: Kashmir can shatter the largest democracy:Constitution's failure to address the unity of Indian states thoroughly(inspite of our tall claim that Indian constitution is the bulkiest and advocates unconditional democracy)

Friday, December 01, 2006

TYPICAL INDIAN (strictly on the lighter side)

A family in India was puzzled when the coffin of their dead mother arrived from USA. It was sent by one of the daughters. The corpse was tightly squeezed inside the coffin, with no space left in it! When they opened the lid, they found a letter on top, which read as follows:


Dear brothers and sisters,

I am sending our mother's body to you, since it was her wish that she should be cremated in the compound of our ancestral home in Thanjavur. Sorry, I could not come along, as all of my paid leaves are consumed. You will find inside the coffin, under Amma's body, 12 cans of cheese, 10 packets of chocolates and 5 packets of Badam. Please divide these among all of you. On Amma's feet, you will find a new pair of Reebok shoes (size 10) for Mohan. Also, there are 2 pairs of shoes for Radha's and Lakshmi's sons.Hope the sizes are correct. Amma is wearing 6 AmericanT-Shirts. The large size is for Mohan and the others for my nephews. Just distribute them among yourselves. The 2 new jeans that Amma is wearing are for the boys. The Swiss watch that Rema wanted is on Amma's left wrist. Shanta Aunty, Amma is wearing the necklace, earrings and ring that you asked for. Please take them. The 6 white cotton socks that Amma is wearing must be divided among my teenage nephews. Please distribute all these uniformly and if anything more is required, let me know, since our Appa is also not keeping well nowadays...
:-( :-)

Thursday, November 30, 2006

ఒక వెన్నెల రాత్రి

అంబరవీధిలో సందడి చేయగ పరుగులిడే చంద్రుని తొందర చూసి చుక్కల్లో ఒక చుక్క చేసేదిలేక బిక్కు బిక్కుమంటూ ఈర్షతో కొసరు విరిగి తోకచుక్కలా నేలరాలి వింతకాతులు విరజిమ్మగ, ఆ కొన్ని క్షణాలు రేరాణి లావణ్య ముగ్ధతనుండి ఎందరి దృష్టో మరల్చిన చుక్కను చూసి గర్వంతో మిక్కిలిగా తళుక్కులీనెను కొన్ని చుక్కలు!
ఇంతలో వెన్నెల వలపులో తడిసి ముద్దైన కలువ కమనీయంగా విప్పారి కనులవిందు చేయగ, కుల్లుతో కృష్ణ వర్ణపు మేఘం శశిపుష్పాల ప్రేమభాషకు అడ్డొచ్చె!
అది చూసి మలయమారుతం మండిపడి రివ్వున వీచి మాసిన మబ్బును ముందుకు తరుమగ సంబరంతో అంబరంలో అడ్డుతొలగి తేటగ నవ్వెను చంద్రుడు!
నెలరాజు నవ్వుల వెలుగులో వృక్షపు తరులు పరవశంతో మెల్లగ ఊగగ, వాటి వెన్నెల నీడల గుసగుసలు మసగ చీకటుల మత్తు భలే గమ్మత్తని మనసుకు తెలిపెను!
సంతసంలో వింతగ నవ్వుతూ కలల తీరమున పరవశంలో తేలి ఆడుతూ కలువను కాంచగ కోరిన చంద్రుడు చెంతన కనబడే నన్నాశ్చర్యంలో ముంచుటకు!
అచ్చెరువొందిన నాతో సద్దుగ నిద్దురపోతున్న ఏరు వయ్యారంగా వలయపు విసురుతో, కలువ నెలరాజుల విరహపు వలపును మైమరిపించుటకు తన తేటదనంలో చంద్రుని ప్రతిబింబిచితినని కమ్మని కబురు వివరించెను!

NEWSPAPER EXTRACTS

The following newspaper extracts, headlines, etc. are written in such a way that there is an extra unexpected meaning to the one that was intended- often with amusing results!


1. The death of the Prime Minister was the turning point in his life.

2. FOR SALE: a baby's high chair that can be made into a table, pushchair, potty, rocking horse, vacuum cleaner, fur coat and Elvis Presley CD.

3. The bride was wearing an old lace gown that fell to the floor as she walked down the aisle.

4. Migraines strike twice as many women as do men.

5. MILKDRINKERS ARE TURNING TO POWDER

6. Two cars were reported stolen by the Surrey police yesterday.

7. The patient was referred to a psychiatrist with severe emotional problem.

8. A 30 year-old Copenhagen man was found murdered by his parents in his home last night.

9. KICKING BABY CONSIDERED TO BE HEALTHY

10. That summer I finally got my leg operated on. What a relief! It had been hanging over my head for years.

11. An oil spill was first reported to the Coast Guard by a man who saw oil covered rocks walking along the shore.

12. He ran outside and chased the burglar with a baseball bat in his underwear.

13. Delightful country cottage, 2 bedrooms, large lounge, kitchen, bathroom, coloured suite, toilet 5 miles away from CBD Auckland.

14. Unemployed man seeks work. Completely honest and trustworthy, will take anything.

15. LENIN's BODY MOVED

16. 1929 Rolls-Royce hearse for sale. Original body.

17. I have just heard that we do have film of the astronaut's breakfast, which should be comingup shortly.

18. She has visited the cemetery where her husband was burried on a number of occasions.

19. NEWYORK BAN ON BOXING AFTER DEATH

20. TOILETS OUT OF ORDER, please use platforms 7-8.

Wednesday, November 29, 2006

శిశిరాంతం

ఫాల్గుణుడు పలాయనం చిత్తగించగ...
చైత్రుడు చెంగు చెంగున ఏతెంచగ...
జరిగెనే ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు
మైమరపించే మధుర వీక్షణాలు!

ఉదయకాలపు ఉచ్చ్వాసల నీరెండ ఆవిరి నీడలు
చలికి ఒళ్ళు జల్లుమని నిక్కబొడుచుకునే రోమాలు
పచ్చగడ్డి నేలపై వెండి వెలుగుల వింత కాంతులు
చిగురుటాకు చివరల్లో వ్రేలాడే చిన్ని భూగోళాలు
ప్రతి పూత నాదేనని కోయిలమ్మ కమ్మని కూతలు
మకరందపు విందులుచేయగ త్వరపడే తుమ్మెదలు....

ఫాల్గుణుడు పలాయనం చిత్తగించగ...
చైత్రుడు చెంగు చెంగున ఏతెంచగ...
జరిగెనే ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు
మైమరపించే మధుర వీక్షణాలు!

Tuesday, November 28, 2006

BRILLIANT WAYS GIRLS TURN GUYS DOWN!!

HE: I'm a photographer I've been looking for a face like yours!
SHE: I'm a plastic surgeon. I've been looking for a face like yours!!

HE: May I have the pleasure of this dance?
SHE: No, I'd like to have some pleasure too!!!

HE: How did you get to be so beautiful?
SHE: I must have been given your share!!!

HE: Will you come out with me this Saturday?
SHE: Sorry! I'm having a headache this weekend!!!

HE: Go on, don't be shy. Ask me out!
SHE: Okay, get out!!!

HE: I think I could make you very happy
SHE: Why? Are you leaving?

HE: What would you say if I asked u to marry me?
SHE: Nothing. I can't talk and laugh at the same time!!!

HE: Can I have your name?
SHE: Why, don't you already have one?

HE: Shall we go and see a film?
SHE: I've already seen it!!!

HE: Do you think it was fate that brought us together?
SHE: Nah, it was plain bad luck!!!

HE: Where have you been all my life?
SHE: Hiding from you.

HE: Haven't I seen you someplace before?
SHE: Yes, thats why I don't go there anymore.

HE: Is this seat empty?
SHE: Yes, and this one will be if you sit down.

(email source)

Saturday, November 25, 2006

8 CORPORATE LESSONS

Corporate Lesson 1

A man is getting into the shower just as his wife is finishing up her shower when the doorbell rings. The wife quickly wraps herself in a towel and runs downstairs. When she opens the door, there stands Bob, the next door neighbor. Before she says a word, Bob says, "I'll give you $800 to drop that towel." After thinking for a moment, the woman drops her towel and stands naked in front of Bob. After a few seconds, Bob hands her $800 dollars and leaves. The woman wraps back up in the towel and goes back upstairs. When she gets to the bathroom, her husband asks, "Who was that?" "It was Bob the next door neighbor," she replies. "Great!" the husband says, Did he say anything about the $800 he owes me?"

Moral of the story: - If you share critical information pertaining to credit and risk with your shareholders in time, you may be in a position to prevent avoidable exposure.

---------------------------------------------------------
Corporate Lesson 2

A priest offered a lift to a Nun. She got in and crossed her legs, forcing her gown to reveal a leg.The priest nearly had an accident. After controlling the car, he stealthily slid his hand up her leg. The nun said, "Father, remember Psalm 129?" The priest removed his hand. But,changing gears, he let his hand slide up her leg again. The nun once again said, "Father, remember Psalm 129?" The priest apologized "Sorry sister but the flesh is weak." Arriving at the convent, the nun went on her way. On his arrival at the church, the priest rushed to look up Psalm 129. It said, "Go forth and seek, further up, you will find glory."

Moral of the story: - If you are not well informed in your job, you might miss a great opportunity.

----------------------------------------------------------
Corporate Lesson 3

A sales rep and a administration clerk, and the manager are walking to lunch when they find an antique oil lamp. They rub it and a Genie comes out. The Genie says, "I'll give each of you just one wish." "Me first! Me first!" says the admin. clerk. "I want to be in the Bahamas, driving a speedboat, without a care in the world." Poof! She's gone. "Me next! Me next!" says the sales rep. "I want to be in Hawaii, relaxing on the beach with my personal masseuse, an endless supply of Pina Coladas and the love of my life." Poof! He's gone. "OK, you're up," the Genie says to the manager. The manager says, "I want those two back in the office after lunch."

Moral of the story: - Always let your boss have the first say.

-------------------------------------------------------
Corporate Lesson 4

A crow was sitting on a tree, doing nothing all day. A rabbit asked him, "Can I also sit like you and do nothing all day long?" The crow answered: - "Sure, why not." So, the rabbit sat on the ground below the crow, and rested. A fox jumped on the rabbit and ate it.

Moral of the story: - To be sitting and doing nothing, you must be sitting very high up.

-------------------------------------------------------
Corporate Lesson 5

A turkey was chatting with a bull. "I would love to be able to get to the top of that tree," sighed the turkey, but I haven't got the energy." "Well, why don't you nibble on my droppings?"replied the bull. "They're packed with nutrients." The turkey pecked at a lump of dung and found that it gave him enough strength to reach the lowest branch of the tree. The next day, after eating some more dung, he reached the second branch. Finally after a fourth night, there he was proudly perched at the top of the tree. Soon he was spotted by a farmer, who shot the turkey out of the tree.

Moral of the story: - Bullshit might get you to the top, but it won't keep you there.

---------------------------------------------------------------------

Corporate Lesson 6

A little bird was flying south for the winter. It was so cold the bird froze
and fell to the ground in a large field. While it was lying there, a cow came by and dropped some dung on it. As the frozen bird lay there in the pile of cow dung, it began to realize how warm it was. The dung was actually thawing him out! He lay there all warm and happy, and soon began to sing for joy. A passing cat heard the bird singing and came to investigate.
Following the sound, the cat discovered the bird under the pile of cow
dung, and promptly dug him out and ate him.

Moral of the story:
1) Not everyone who shits on you is your enemy.
2) Not everyone who gets you out of shit is your friend
3) And when you’re in deep shit, it’s best to keep your mouth shut!


---------------------------------------------------------------------

Corporate lesson 7

There were these 4 guys, a Russian, a German, an American and a French, who found this small genie bottle.
When they rubbed the bottle, a genie appeared. Thankful that the 4 guys had released him out of the bottle, he said, "Next to you all are 4 swimming pools, I will give each of you a wish. When you run towards the pool and jump, you shout what you want the pool of water to become, and your wish will come true."

The French wanted to start first. He ran towards the pool, jumped and shouted WINE". The pool immediately changed into a pool of wine. The Frenchman was so happy swimming and drinking from the pool.

Next is the Ru ssian's turn, he did the same and shouted, "VODKA" and immersed himself into a pool of vodka.

The German was next and he jumped and shouted, "BEER". He was so contented with His beer pool.

The last is the American. He was running towards the pool when suddenly he steps on a banana peel. He slipped towards the pool and shouted, "SHIT........."

Moral of the story: Mind your language, you never know what it will Land you in.

-----------------------------------------------------------

Corporate lesson 8

Usually the shop-floor staff of the company play football.
The middle-level managers are more interested in tennis.
The top management usually has a preference for golf.

Finding: As you go up the corporate ladder, the balls reduce in size.
------------------------------------------------------------

(forwarded email)

Thursday, November 16, 2006

సిపాయి చిన్నోడు

"యుద్దం ముగిసిందట.చిన్నోడు ఇంకో నాలుగైదు రోజుల్లో ఇంటికి రావొచ్చు.నీ ఏడుపాపి టివి కవరు కిందున్న ఆ పేపరు ముక్కిలా ఇవ్వు, కోమటి కొట్టుకెళ్ళి ఆ నంబరుకి ఫోన్ చేసొత్తాను.ఈ రోజు చిన్నోడితో తప్పకుండా మాట్లాడ్తా.నిన్న సందె కాడ పద్దు పరుగు పరుగునొచ్చి ఊరటిచ్చే కబురు చెప్పింది, ముగ్గురు చనిపోయారట పాపం, తెలుగోడెవ్వడు లేడులే, ఇంకొ నలుగురికి గాయాలయ్యాయట..." అని రాజయ్య చెప్పడం ముగించేలోపే పద్దు గుమ్మంలో నుంచొని, "నేనూ మీతో వస్తా మావయ్యా! బావతో నేనొక ముక్క మాటాడతా", అని దీనంగా అడిగింది.వొద్దు అని వారిద్దామనుకొంటూనే సరే అన్నాడు రాజయ్య, కొడుకు తిరిగొస్తున్న సంతోషం ఇక ఉండబట్టలేకేమో.
రాజయ్యకి పెళ్ళైనప్పుడు సరిగ్గా పదిహేడేళ్ళు, జయమ్మకి పదిహేనెళ్ళని గురుతు. వాళ్ళమ్మమ్మ అన్న మాటలు ఇంకా మరిచిపోలేదు రాజయ్య, "పిల్లకి పదిహేనేళ్ళొచ్చినై! పెళ్ళి సేయాలన్న గ్యానంలేదేట్రా తాగుబోతు సచ్చినోడా. నా కూతురిని దిగమింగినవ్, ఇప్పుడు దీని బతుకూ ఆగం చేత్తవేంటి. జయమ్మీడు పిల్లలు సంకన చంటోళ్ళతో తిరుగుతన్రు", అని ముసల్ది ఆగకుండ అంటుంటే, తాగుబోతోడు కసిరిండు, పిల్లను చూడ్డానికి పెళ్ళొల్లొత్తన్రు ఈ రోజని. పెళ్ళొలం వొచ్చేసినం కూడా అంటూ గుమ్మంలో కాళ్ళు కడుక్కొంటూ అన్నాడు రాజయ్య తండ్రి.తాగుబోతోడికి తెలియకుండానే పెళ్ళి జరిగిపోయింది.తాగుబోతైనా బరువు బాధ్యత మరువలేదన్న గర్వంతో,ముసల్దాని అంతులేని తిట్లకి ముకుతాడేసాడన్న ఎకసెక్కపు పొగరుతో, కూతురు పెళ్ళి చేస్తున్న సంబరంలో తప్ప తాగి పందిట్లోనే సోయిలేక కూలబడ్డాడు తాగుబోతోడు. అయినా వాడ్ని ఎవరేమనలేదు. జయమ్మ అణకువ చూసి మొగపెళ్ళోళ్ళూ గమ్మునుండి పెళ్ళి ముగించి పిల్లను తీసుకుపోయారు. యేడాది తిరిగేలోపు చిన్నోడు పుట్టాడు. ఆ తర్వాత ఇద్దరు పుట్టినా, ఒకతి పొత్తిళ్ళలోనే పయనం ముగించింది. ఇంకొకడు పద్నాలుగేళ్ళప్పుడు ఈతకనిపోయి అనంతలోకాలు చేరుకొన్నాడు.రాజయ్య దంపతులకి చిన్నోడే సర్వస్వం అయ్యాడు. మొదటోడు చివరోడు, ముసళ్ళోల్లైతే ముందు ముందు మెతుకులు పెట్టేటోడూ, మొత్తం ముగిసాక మన్నులో కలిపేటోడు అన్నీ చిన్నోడే అయినాడు..
"తల్లికి తన పిల్లలందరూ సమానమే" అన్నారుకాని తండ్రికనలేదుగా అన్నట్లు ఇంకొకడున్నప్పుడు కూడా ఎందుకో రాజయ్యకి చిన్నోడి మీదే గురుండేది.అందరితో కలిసి అల్లరి చేసినా, ఆటపాటల్లో చురుగ్గా వున్నా, అప్పుడప్పుడు ఇంటి మీదకి గొడవలు తెచ్చినా చిన్నోడి మీద రాజయ్యకి ఏదో ఒక అర్థంకాని మర్మ నమ్మకం, వాడి తీరే వేరు అనుకొనేవాడు.
"మావయ్యా! యేంటి ఆలోచిస్తున్నారు? చిన్నోడి గురించా?" అని పద్దు అడిగిన ప్రశ్నకి ఉలిక్కిపడి తేరుకొన్నాడు రాజయ్య."అవును తల్లీ,వాడు పట్టిందే పట్టు...వొద్దని ఎంత మొత్తుకొన్నా మిలటరీకే పోతా అన్నాడు. పట్టుదలతో సాధించిండు. ఇలాంటి గొడవలైనప్పుడు భయమేస్తది కాని చిన్నోడి నిర్నయేనికి నలుగురిలో కాకపొయినా మీ అత్త ముందు మీసం మెలేత్తాను".అవును మీ అయ్య సర్కారు నౌక్రి ఉన్నోడితో పెళ్ళి చేస్తా అన్నా కూడా నువ్వు చేసుకొంటే మా సిపాయి చిన్నోడ్నే చేసుకొంటా అని ఎందుకు తెగేసి చెప్పినవ్?" "మావయ్యా! బావ అలాంటిలాంటి సిపాయి కాదు, వాళ్ళ బెటాలియన్ కి కమాండర్! అంటే ఒక గుంపుకి నాయకుడన్నమాట.ఊరోళ్ళనుకొన్నట్లు బావ చదువు వూరికే వ్యర్థం కాలేదు, ఆ చదువుని బట్టి బావ తెగువని బట్టి కమాండర్ అయ్యాడు.యుద్ధానికి ముందు ఎన్ని వ్యూహాలు పన్నినా, ఒకసారి కదన రంగంలోకి కాలు దువ్వాక బావ ఇచ్చే అదేశాలతోనే వాళ్ళ గుంపు పోరాడుతుంది. ఇంక....." అని పద్దు ఎదో చెప్పబోతుంటే, "మాకే తెలియదు, ఇవ్వన్నీ నీకెట్ల తెలుసమ్మా?" అని నవ్వి నవ్వనట్లనిపించే చిన్న గర్వపు నవ్వుతో అడిగాడు రాజయ్య."పొయినసారొచ్చినప్పుడు బావ చెప్పాడు. ఇంకా ఇంటర్మీడియెట్ తో ఆగిన నా చదువు మళ్ళీ మొదలెట్టి డిగ్రీ చేయాలన్నాడు. అప్పుడే పెళ్ళి చేసుకొందాం అన్నాడు" అంది పద్దు. "ఒహో! అందుకేనా మీ అయ్యతో పట్నం పోతా అని ఒకటే గొడవ. చిన్నోడు నా సంటిదానికి ఎదో మందు పెట్టిండు. అది పట్నంపోయి సదువుతా అని మొండిగూకుంది అని తాడిచెట్టు కింద పొద్దుగుంకే దాకా మీ అయ్య సాంబడు వొచ్చిపోయే ప్రతి పనిలేన్నాకొడుకుతో పలికిండట మొన్న" అని చెబుతున్న రాజయ్యకి "ఊ"కొడుతూనే ఆలోచనల్లో మునిగిపొయింది పద్దు.
"సదివెలగబెట్టింది సాలుగాని మంచి పిలగాడ్ని చూసిన! గవర్నమెంట్లో వుజ్జోగం, నిన్ను సూడ్డానికి ఎడ్లొచ్చేఏళొత్తన్రు.చిన్నోడి సంగతి మరిసి గమ్మునొప్పేసుకో!అయినా నీకిదేంపిచ్చే! వాడెప్పుడు సత్తడో తెలవదు. వాడ్వి మనువాడ్తనంటవ్" అన్న సాంబడి మాటలకి సివంగిలా ఎగసిపడి,"చావనైనా చస్తగాని బావనే చేసుకొంట. అయినా అయ్యా! నువ్వు చెప్పిన పిలగాడికి 30 ఏళ్ళు, నాకింకా 18 ఏళ్ళే కదా. అన్యాయమనిపించడంలె నీకు?" అన్న పద్దుకి, "నాకు తెలవని నాయన్నాయాలు ఉన్నాయె? నీతులు సెబుతన్నవ్? మంచోడ్ని ఎతికి తెస్తే ఎదురు సెప్తవ్..." అని ఖయ్యిమటూ బదులిచ్చిండు సాంబడు. ఎన్నరిచినా పద్దు పట్టువీడలేదు.చూపులకి పిలగాడొచ్చేవరకు మౌనంగా ఉంది.ఇంటికొచ్చిన పెళ్ళోళ్ళు ఇంకా సర్దుకొని కూర్చోక ముందే మంచినీళ్ళందిస్తూ పెళ్ళికొడుకు కళ్ళలోకి సూటిగ చూసి చెప్పేసింది నువ్వు నాకు ససేమిరా ఇష్టంలేదని, ఎడ్లమెడల్లో కట్టిన గంటల చప్పుడు సద్దుమణగక ముందే వొచ్చినోళ్ళొచ్చినట్లే తిరుగుదారి పట్టిన్రు సణుగుకొంటూ.సాంబడు చేసేదిలేక బట్టతలమీద చేతులు పెట్టుకొని గోడకానుకొని అట్లే కూలబడ్డడు.పద్దు బిర బిర మంటూ గుమ్మంలోకి చేరి పొక్కిళ్ళ వాకిలిని సుతారంగా ఊడుస్తూ చిన్నోడి గురించి ఆలోచిస్తుంది కాబోలు, ఇంత జరిగినా మొఖంలో నవ్వు!
చెరువు గట్టు మీద సడీచప్పుడులేకుండా అరటి తోటల్లో జరిగొడ్డులా సర్రున పాకుతూ, నడినెత్తి మీద మండుతున్న సూర్యుడ్ని లెక్క చేయకుండా, ఆకులెండిన కుంకుండు చెట్టు చాటుకి చేరే చిన్నొడ్ని పొలంచివరనున్న పాకలోనుండి తదేకంగా చూసేది పద్దు. వాడు గుట్టనానుకొని ఉన్న చెరువు గుంటల్లో నీళ్ళు తాగడానికొచ్చే దుప్పులని చూడ్డానికి ఎన్ని గంటలైనా ఉండేవాడు కాని, పద్దుకి చిరాకు పుట్టి రొండు మూడు సార్లు ఇంటికిపోయొచ్చేది.అయినా పద్దు చిన్నొడికోసం తిరిగొచ్చి ఎదురుచూసేది, దుప్పులని చూసిన చిన్నోడు పరుగు పరుగునొచ్చి పద్దుకి చెప్పెది వినడానికి కాదు గాని వాటిని చూసిన ఆనందంలో వెలుగుతున్న చిన్నోడి కళ్ళని,అన్ని గంటలు ఎండలో నక్కినా తాజాగావున్న వాడి మొఖాన్ని చూడ్డానికి!
నాట్లప్పుడు వరిచేల గట్లెమ్మటి ఇద్దరు తిరిగుతూ చిన్నోడు తాటాకుల ఉచ్చులతో చాకచక్యంగా గట్ల రంద్రాల్లోనుంచి పట్టే ఎండ్రకాయలూ,పొలం పాడుచేసే పిట్టల్ని గురితప్పకుండా కొట్టే చిన్నోడి ఏకాగ్రత, పొలాన్ని రక్షించడానికి పిట్టల్ని చంపే వాడి నిర్దయా...ఇవ్వన్నీ అందరుచేసినా పద్దుకి చిన్నోడు చేస్తుంటే వింతగా వుండేవి, బహుశా వాడికి పట్టుదల, తప్పని గురి, ఏకాగ్రత, సహనంవంటి గుణాలు ఇతరులని మించి వున్నందుకేమో! చిన్నోడితో తిరిగి తిరిగి తనకు తెలియకుండానే వాడిదయిపొయింది పద్దు. చిన్నోడి మాటలకి, వాడు ఎలాగైనా మిలటరీకి పోతానంటే ఎప్పుడూ అడ్డుచెప్పలేదు పద్దు, భయంలేక కాదు, వాడిమీదున్న కొండంత విశ్వామిచ్చిన ధైర్యంతో!
"ముందు నువ్వు మాట్లాడ్తవా నేను మాట్లాడ్నా?" అన్న రాజయ్య మాటలకు ఉలిక్కిపడి గతంలోనుంచి గవిని కొచ్చామని గ్రహించింది పద్దు.జవాబు చెప్పేలొపే రాజయ్య నంబరుకలిపి "హలో, మాచిన్నోడు, అదేనయ్య శ్రీనివాసున్నాడా?" అని వాకబు చేయడం మొదలెట్టాడు.అటునుంచి రాజేష్ అనే వ్యక్తి,"ఓ! మీరు తెలుగువారా! నా పేరు రాజేష్. నేను శీనన్న, అదే మీ చిన్నోడి బెటాలియనే!బోర్డర్లో యుద్ధం భీకరంగా జరిగింది.చిన్నోడి తెలివితేటలవల్ల గెలిచాం.నేను, ఇంకో పంజాబోడు గాయపడితే గుండ్ల వర్షం కురుస్తున్నా చిన్నోడు మెరుపులా ముందుకొచ్చి, ఒకరిని బుజానెసుకొని, ఇంకొకడ్ని ఈడ్చుకొని గబాల్న బంకర్లోకి దూకి మమ్మల్ని కాపాడారు. అందరం క్షేమం...చిన్నోడు కూడా!", "సరే సరే, చిన్నోడికియ్యరా ఫోను" అని ఉండబట్టలేక వెలుగుతున్న అసహనపు మొఖంతో అరుస్తున్న రాజయ్యని చూసి చిన్నోడు క్షేమమే అని గ్రహించి గట్టిగా ఏడుస్తూ నవ్వాలనిపించింది పద్దుకి!"ఒక నిముషం లైన్ లో ఉండండి, అదిగో శ్రీనివాస్(చిన్నోడు) సారొస్తున్నారు" అని బదులిచ్చాడు రాజేష్.రాజయ్య ఫోన్ అలాగే చేతిలో పట్టుకొని కోమటి కొట్టు పైకప్పు లేచేలా, గవిని కూడలిలో జనం చెవులు దద్ధరిల్లేలా,"ఏరా! ఎవడైనా మీ కొడుకుల్ని ఎక్కడో కాశ్మీరుకి యుద్ధానికి పంపార్రా? యెప్పుడు నా ఇల్లు, నా పిల్లలు, నా పొలం, నా పెళ్ళం....ఇదే గోలగాని దెసానికి ఏమన్న సేవ చేద్దాం అన్న ఎధవొక్కడులేడు. నా చిన్నోడ్ని చూడండి! శత్రువుల గుండెలు చీల్చి, తోటోల్లని బుజానేసుకొని పాణాలని లెక్కజేయక రక్షించిండు.." అని విజయ గర్వంతో ఆరుస్తున్న రాజయ్యకి సంతోషంతో కంట తడి పుట్టించాయి అవతల మాటలు,"నాయనా! బాగున్నావా? అమ్మ దిగులు తీరిందని చెప్పు.నేను నా స్నేహితుడొకడు ఇంకో రెండ్రోజుల్లో ఇంటికొస్తం. పాపం యుద్ధంలో వాడి కాలుకి తూటా తగిలి విషమెక్కింది, అందువల్ల కాలు తీసేసారు. వాడికెవరు లేరు, నాతోపాటు రమ్మన్నాను, నేను వాడిని మనతోపాటే జీవితాంతం ఉండమని చెప్పాను, సరిగే చేసాను కదా నాయనా నేను?"అన్న చిన్నోడితో,"జీవితాంతం చక్రాల కుర్సిలో వుండేటోడ్ని ఎలా చూసుకొంటామ్రా? మేము ముసలోళ్ళం అవుతున్నాం, మీ అమ్మ నాకే సాకిరి చేయలేక చస్తంది ఇంక ఆ అవిటోడి బరువెట్ట మోసేది? పద్దు కూడా నీ కోసం కల్లలో వెయ్యొత్తులేసుకొని ఎదురుచూస్తంది. మీ పెళ్ళైతే వాడు మీకూ భారమే. అయినా పభుత్వం చూసుకొంటది కదా అలాంటోల్లని. వాడికి దైర్యంజెప్పి, చేయాల్సిన లెక్కలన్నీ చేసి నువ్వు రా" అంటూ రాజయ్య పద్దుకి ఫోన్ ఇచ్చాడు. అంతా విన్న పద్దు,"బావా! ఇన్నాళ్ళు నీకోసం అందరినీ ఎదిరించి పిచ్చిదానిలా ఎదురుచూసాను, ఇప్పుడు నీతో పాటు ఇంకొక అవిటి వ్యక్తి జీవితాంతం మనతో ఉంటాడంటే ఎందుకో మనసుకి కష్టంగా వుంది. అతను మనతో ఉండకపొయినా ఎవరులేరనే లోటులేకుండా క్రమంతప్పకుండా కలుస్తూవుందాం, అత్తయ్యనడిగినా ఇదే మాటంటుంది. అయినా నేను మాటవరుసకనట్లేదు. నిజంగానే మనం నీ స్నేహితుడ్ని మనింటివాడిగే చూసుకొందాం, కాని మనతో ఎప్పటికీ ఉంచుకోవడం కష్టం కదా బావా! నువ్వే ఆలోచించు!" అంది. "సరే! మీ ఇష్టం" అంటూ అవతల ఫోన్ పెట్టేసాడు చిన్నోడు.
రొండ్రోజుల్లో ఇంటికి రాబోతున్న చిన్నోడ్ని తలచుకొని నిస్తేజంగావున్న జయమ్మకి ప్రాణాలు లేచొచ్చాయి, ఇల్లలికి, తోరణాలు కట్టి, పందిరి గడ్డి మార్చి సంబరంగావున్న రాజయ్య కుటుంబాన్ని చూస్తే పండగ వాతావరణంలావుంది ఊరి జనానికి.చిన్నోడి తెగువ గురించి కోడి కూయక ముందే లేచి పనులకిపోయేవాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెబుతున్న రాజయ్యకి త్వరగా మిలటరీ హాస్పటల్ కి బయలుదేరమని కబురొచ్చింది. ఉన్నపలాన రాజయ్య, జయమ్మ, పద్దు ముగ్గురు బయలుదేరారు. హాస్పటల్ చేరిన వారిని నేరుగా శవాలగదికి తోడుకొనిపోయాడు ఒకాయన. ఆ మూడో నంబరు మంచం మీదున్నది మీ కొడుకేనా చూడండి అని అతడనగానే రాజయ్య మొఖంలో నెత్తుటిచుక్కలేక పాలిపోయింది. కప్పున్న తెల్లటి దుప్పటి లేపి చూసిన రాజయ్య గుండె పగిలింది, నిర్జీవంగా నవ్వుతూ ఒంటికాలుతో నిద్రిస్తున్న చిన్నోడు...జయమ్మ కూలబడిపోయింది, పద్దు దిక్కులు పిక్కుటిల్లేలా ఏడుస్తుంటే చెప్పాడు మిలటరీ ఆఫీసర్," మీవాడు యుద్ధభూమిలో శత్రువులని చీల్చి చండాడాడు, తోటివారిని ప్రాణాలకి తెగించి రక్షిస్తుండగా తొడకి తూటా తగిలింది, కాలు తీసేయ్యాల్సొచ్చింది. దురదుష్టవశాత్తు నిన్న రాత్రి హాస్పటల్ మూడో అంతస్తునుండి అదుపుతప్పి కిందపడి మరణించాడు"..అదుపుతప్పింది సిపాయి చిన్నోడు కాదు, మనుషుల రూపంలో వున్న మృగాల్లాంటి తమ స్వార్థపూరిత మనసులని అనుకొన్నాడు రాజయ్య! పద్దు ఏడుపాగిపొయింది, జయమ్మ స్పృహలోకొచ్చింది!
("A Soldier Comes Home" అనే ఇంగ్లీష్ కథ ఆధారంగా)

Saturday, November 11, 2006

మగువ మత్తు

వెన్నెలే విస్తుబోయె వన్నెల వెలుగులన్ జూడగ
వేకువే వేగిరపడె వనిత వగలన్ వీక్షించగ
హంస నడకలు నిలిచిపోయె కన్య కదలిక కాంచగ
కోయిల కంఠం పాడదాయె మగువ మాటలాడగ
మేని గంధపు మత్తుకి మల్లె వాసన మాసెగా
నీదు నీడ తాకగ ఏటి కలువలు విచ్చెగా
అందమంతా కూడగా నీవు రూపం దాల్చెగా
అన్ని లోకముల వెదకగా మరో మగువ లేదుగా
పరుగున వచ్చితి ఆలసింపక మనసు నిన్ను కోరగా
నమ్మలేకపోతిని నీ జంటగ నన్ను నీవు పిలువగా
ఎదురు చూపె బెదురు చూపాయె మీ అన్న బయటకు రాగా
అల్లరిచేయకు మా చెల్లెని అంటూ నా పాలిట యముడే ఆయెగా!
సరసమే సంకటమాయెనని పరుగులు నే తీయగ
ఈ తుంటరి ఇక ఆమె వెంటపడడని అందరూ అనుకొంటిరిగా!

Thursday, November 09, 2006

కడలి-కన్య

కడలి అందం పడతి చందం
ఊరకుండి ఉల్లసించును
ఉప్పొంగి ఉరికించును
ఇంతిసైతం సంద్రవైనం

వెన్నెలాటకు ఒళ్ళంతా కన్నులై
అలల తెరలతో అందమంతా ఒలకబోసె
విరహవేటుకు రేరాణిని చేరగ
ఆరాటంతో అలలహస్తాలతో ఉవ్వెత్తున ఎగసిపడె

వెండిమంటల వింత వెలుగులకు
కన్య కన్నులు కలువ కాంతులన్ విరజిమ్మె
తన ఒంటరితాపం జంటను కోరగ
కునుకే రాక అసహనంతో కోడెనాగై కస్సుమనె

కడలి అందం పడతి చందం
ఊరకుండి ఉల్లసించును
ఉప్పొంగి ఉరికించును
ఇంతిసైతం సంద్రవైనం

వరదలొస్తే...

ఎవడి గోళ వాడిది. వరదల పుణ్యమా అని దండుకొనే దళారులు...రాజకీయ ఎత్తుగడల రాబందులు...ఏదో కొంత చేజిక్కించుకొనే బలమైన బాధితులు... కొందరికి ప్రమాదం విషాదమైతే, ఇంకొందరికి ప్రమాదం ప్రసాదంలాంటిది. వరదలైనా, వార్ లైన వ్యత్యాసమొక్కటే...బాధితుల సంఖ్య, బలిసినోల్ల సంఖ్య...ఇదంతా ఏదో రాయాలని కాదు, రాయడానికి నాకిష్టం కూడా లేదు...ఒక్కటి మాత్రం నిజం నా జీవిత కాలంలో ఒక్క యదవనాకొడుక్కైనా బుద్ధి చెప్తాను, అది గాందిగిరితో కాని గాడ్సేగిరితో కాని...పని చేయలేని చేయించలేని పనికిరాని మాటలు కావొద్దు మన మాటలు!

(" నీటి బొట్టు పెరిగిపోతె సంద్రమే!" అనే "చదువరి" గారి వ్యాసామందించిన ప్రేరణతో... http://chaduvari.blogspot.com/2006/11/blog-post_04.html)

Wednesday, November 08, 2006

తరాల అంతరాలు

"ఏంటి దిగాలుగా కూర్చున్నావ్? అంతా సవ్యంగానే వుంది కదా? ఒకడేమో అమెరికాలో, ఇంకొకడు ఇంగ్లాండ్ లో, కూతురు గవర్నమెంట్ ఆఫిసర్, అల్లుడు మంచి హోదా వున్నోడే... ఎటువంటి వేధింపులూ లేవు. ఇంకెందుకయ్యా దిగులు?" అందరనే మాటే తన అంతరాత్మ కూడా పదే పదే చెబుతుంటే వెంకటయ్యకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నట్టింట్లో చక్రాల కుర్చీ కిర్రు కిర్రు శబ్దం ఆగిపొయింది, కాని వెంకటయ్య ఆలోచనలు అంతులేకుండా సాగుతున్నాయి. "పదుగురాడు మాట పాడియై ధరజెల్లు" అన్న మాట ప్రతిసారి నిజం కాదేమో అనిపిస్తుంది వెంకటయ్య ముఖం చూస్తుంటే.

రిటైర్మెంట్ అయ్యాక పిల్లలతో ఎక్కువ సమయం గడపొచ్చనుకొన్న వెంకటయ్యకి నిరాశే ఎదురయ్యింది. వెంకటయ్యకి డబ్బు కొరత లేదు. అవసరంలేకపోయినా పుత్రుల పుణ్యమా అని విదేశాలనుండి డబ్బొస్తూనే వుంటుంది . వద్దంటే పిల్లల మనసు నొచ్చుకొంటుందని వొచ్చిన డబ్బు వొచ్చినట్లే పిల్లల పేరు మీదే జమ చేస్తుంటాడు. వెంకటయ్య దంపతులకి ఆయనకొచ్చే పెన్షన్ డబ్బులే అవసరాలకి మించి వస్తుంది. ధాన్యం, కాయగూరలన్ని వెంకటయ్య తండ్రి పుణ్యమా అని తన వాటా పొలన్నుండి వస్తాయి.

వెంకటయ్య స్నేహితుడు శ్రీనివాసరావు కూడా చివరికి అదే మాట,"ఏంట్రా నీ చాదస్తం? నువ్వు వాళ్ళదెగ్గరికి వెళ్ళి ఉండమంటే వారం తిరక్కుండ ఇంటిదారి పట్టావు. ఏడాదికి లేక కనీసం రొండేళ్ళకి ఒక్కసారైనా రావాలని పట్టుబడతావ్. పనిభారంతో వాళ్ళెంత బిజీగా ఉంటారో నీకు తెలుసు. అందుకే వాళ్ళకి వీలునప్పుడే వస్తామన్నారు. అందులో తప్పేముంది?" ఆయనకేంటి పిల్లలు బాగా సెటిలయ్యారు, ఏ చీకూచింతా లేదు అనే ఊరివారి మాటలు అసూయతోనో, మంచితనంగానో లేక తన బాధ తెలిసి ఎగతాళిగానో అర్థంకాదు, అర్థంచేసుకొనే స్థితిలో కూడా లేడు. శ్రీనివాసరావు మాటలకి ఒక కృత్రిమ నవ్వు నవ్వి, కళ్ళజోడు సరిచేసుకొంటూ ఇంటెనక దారిగుండా కోత ముగిసి ఎండకు ఎండిన వరి మోడులతో ఉన్న పొలంలోకి రోజూలాగే వాకింగ్ కి బయలు దేరారు ఇద్దరు.

నాన్న! ఊరికే ఇండియా రావాలంటే కుదరదు. మా భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి కదా. మాకంటూ ఒక ఇల్లు వాకిలి వుండాలి. ఇక్కడ ఇండియాలో లాగా ఇల్లు కట్టడం, కావాల్సినవి సమకూర్చుకోవడం అంత సులభం కాదు. లోన్లో ఇల్లు కొన్నాము, సో కష్టపడితేనేగాని కుదరదు. మీరేమో ఇక్కడ మీరున్నన్నాళ్ళు వుండమంటే వొంటరిగా ఫీల్ అవుతున్నా అంటారు. చూడండి ఎంతో మంది పేరెంట్స్ ఎడ్జెస్ట్ అవుతున్నారు, మీ సమస్యేంటో మాకంతుబట్టడంలేదు.అయినా ఎవరైనా సిటీలో సెటిల్ అవుతారుగాని మీరేమో ఆ పల్లెటూళ్ళో ఇల్లు కట్టారు. అక్కడకొచ్చి మేమేం చెయ్యాలి? ఇంతకంటే మాకు వేరే సొల్యుషన్ తోచడంలేదు...రెస్ట్ ఈజ్ అప్ టు యూ అన్న పిల్లల మాటలు నడుస్తున్న వెంకటయ్యకి గుర్తొచ్చాయి. "నాదే తప్పు రా...ఎందుకో పిల్లల్ని పెంచి పెద్దచేసి ఒకదారికి తేవడం ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అనిపిస్తుంది. నేను జీవం ఉన్న వాటి మీద ఇన్వెస్ట్ చేసాను...నా పిల్లలు తెలివిగా జీవం లేని వాటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు...ఎందుకంటే అవి వాళ్ళెలా కోరుకొంటే అలా వుంటాయి. కాని మనల్నేదో ఉద్దరిస్తారని పిల్లలపై ఆశ....కాదు దురాశ పెంచుకొంటే వాళ్ళూ ఒక జీవంలేని వస్తువుగానే తయారయ్యారు. భవిష్యత్తిచ్చిన వాడ్ని మరిచి భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నారు. కాలానికనుగుణంగా మారడం అంటే ఏంటో అనుకొన్నా....ఈ కాలానికి తగ్గట్టు యాంత్రికంగా మారాలన్నమాట. నా చాదస్తనికి సమాధి కడుతున్నా, రేపట్నుంచి చూడు ఇక నా దిగులు మొఖం మటుమాయం"

దున్నిన పొలాన్నే మేస్తున్న ఎడ్లమందని చూసి శ్రీనివాసరావు ఆలోచనల్లో మునిగాడు. ప్రతి బంధం ఇచ్చి పుచ్చుకొనే బంధమేనా? నిస్వార్థ బంధమేదీ లేదా? చివరకు తల్లిదండ్రులు పిల్లలు, తోబుట్టువులు, భార్యాభర్తలు వగైరా అన్నీ...అన్నీ రిలేషన్స్ ఇచ్చి పుచ్చుకొనేవేనా? దున్నినందుకు ఎద్దు పొలం మేస్తుంది, తప్పేముంది? కన్నందుకు వారినుండి కొంత కల్తీలేని ప్రేమను కోరుకోవడం తప్పా? అయినా సరిపడా డబ్బు పంపుతున్నాం, ఇంతకంటే మంచిగా తల్లిదండ్రులను ఎవరు చూసుకొంటారు అనుకొనే పిల్లల భావాలూ సబబేనా? ఎవరికి వారే సరైతే ఈ దిగులెందుకు? ఈ బాధెందుకు? గత నెల పై చదువులకోసం అమెరికా వెళ్ళిన కొడుకుని తలచుకొని శ్రీనివాసరావు మదిలో అలజడి మొదలయ్యింది. అడుగులు తడబడిన శ్రీనివాసరావుకి బుజాలు తట్టి అసరా ఇచ్చాడు వెంకటయ్య. గడ్డి మేస్తున్న ఎడ్లమంద ఒక్కసారిగా తలలులేపి ఇరువురివైపు చూసాయి బెదురుగా...ఇంకొకడు వెఱ్ఱి తీగ తొక్కాడనుకొన్నాయేమో!

అంతరాత్మ

కరుగుతున్న కాలం చెరగని ముద్ర వేసింది
కదులుతున్న కలం కొందరిని నిద్ర లేపింది
కట్టుకున్న చుట్టుకున్న జీవపు డంబాన్ని కాల్చి చీల్చి
నలుదిక్కులు నింగి నేల నన్ను చూసేలా నగ్నను చేసింది...
చాటునున్న మాటునున్న జీవితాల్ని ముందుంచి చూపించి
కనని కళ్ళకి కాంతినిచ్చి కఠిన హృదయాన్ని మార్చి వేసింది...
మరుగుతున్న రుధిరానికి సమ్యమనం నేర్పింది
రగులుతున్న మనసుకు మంచి మార్గం చూపింది
చింతాక్రాంతుడనై గురిలేని నన్ను నిలదీసి నిందించి
నాలోని స్వార్థపు చీకటులని చెరిపేసి చరమగీతం పాడింది...
ఆశల వ్యసనుడనై అలమటించగ నాకు ఎదురుపడి
జీవితపు పరమార్థాన్ని ప్రేమైశ్వర్యంలో చూపించింది...
నాలో మంచి వికసించగ లోకం వింతగ చూసింది
అయినా మనసు ముందుకు చూస్తూ స్వాంతన చెందిందిPS: ప్రతివొక్కరిని వారి వారి అంతరాత్మలు ప్రశ్నిస్తూనే ఉంటాయి. కొందరు ధైర్యంగా స్పందించి మార్పుకు సుముఖులవుతారు ఇంకొందరు జీవితంతో, జీవితంలో రాజీ పడతారు. ఇక్కడ "నేను" అనేది స్వీయమార్పును స్వీకరించే ప్రతిఒక్కరికీ అన్వయించబడుతుంది.

Friday, October 27, 2006

మనిషి


వెన్నెలకి చీకటికి ఏంటి సంబంధం?
రవికి వేకువకి ఎందుకీ ఎనలేని బంధం?

బురదలోని కలువకి ఎందుకా స్థానం?
మురిపించే గులాబికి ముళ్ళతో సంస్థానం
కమ్మని పాటల కోయిలకెమో వికారరవిందం
కక్కుని తినే కుక్కలెమో మనిషి నేస్తాలైన చందం

నా కంట్లో నలకే లోకమలినమని తోచే నీకు నేస్తం
నీ కంట్లో దూలం కనపడదాయె...అంతా నా చాదస్తం!

మిత్రమా! మనిషంటే మంచీచెడుల సంగమం
ఎవరూకూడా దీనికి అతీతులుకారు ఇది నిజం!

అందుకే,
మనిషిని కాదు కాని వాడిలోని, నీలోని
మలినపు ఆహాన్ని సిలువెసే ప్రయత్నంచేయి నిరంతరం!
PS: It is a response to an anonymous scrap in my Orkut profile about my past deeds and my writings. The content of the scrap is that how can I advocate goodness, peace, love, hope, faith, self-confidence and strive for a personality when my past was evil and thuggish....

Sunday, October 15, 2006

సమన్వయమా? లేక స్వాహా మన వ్యయమా? (విమర్శ)

"బతుకు తెరువు బాకు గుచ్చుకొని
భావుకత గాయపడుతూనే వుంటుంది
అయినా ఆశ చావదు"


అని అన్నాడొక యువకవి. కవుల విషయం ఏమో కాని, భారత క్రికెట్ జట్టుపై అభిమానుల ఆశలూ అంతే. ఆటకి ముందు ఎంతో తపనతో, ప్రార్థనలతో జట్టులోని సభ్యులకంటే అభిమానికే tension ఎక్కువ. అంత ప్రేరణ కలిగించే జట్టు...ఆట ముగిసాక అభిమాని మనసు కకావికలం....

"అలసిన కన్నుల కాంచేదేమిటి?
తొణకిన స్వప్నం,
తొలగిన స్వర్గం!
విసిగిన ప్రాణుల పిలిచేదెవ్వరు?
దుర్హతి, దుర్గతి,
దుర్మరి, దుర్మృతి!"


అనే శ్రీ శ్రీ కవితనద్దం పట్టినట్లు.

అయితే ఇక్కడొక చిన్న contrast వుంది...player కి supporter కి మధ్య-
"తొణకిన స్వప్నం" అభిమానిదే, అలాగే "తొలగిన స్వర్గం" కూడాను. అమాయకుడైన అభిమానికే "దుర్హతి, దుర్గతి", ఇంకా అభిమానం అర్ణవమైతే "దుర్మతి, దుర్మృతి" కూడా అభిమానికే గాని ఆటగానికి కాదు.


బురద పడితే తుడుచుకున్నంత తేలిగ్గా ఓటమిని మరిచే సమన్వయ జట్టు మనది. "సమన్వయం" తో ఉందిప్పుడు భరత జట్టు అనే స్టేట్మెంట్లిచ్చి, అభిమానం అనే మన వ్యయాన్ని ఒక్క మ్యాచ్ తో స్వాహా చేస్తుంది మరి. అదే మన టీం చతురత చరిత్ర!

అయ్యో! చెప్పడం మరిచా! ఇక్కడ రెండు team లు ఉన్నాయి. ఒకటి ప్లేయింగ్ అయితే మరొకటి నాన్ ప్లేయింగ్.... అదేనండి selection కమిటీ లేక తెర వెనుక "పెద్దలు".
ప్లేయింగ్ team లో ఉండాలంటే ఆటకంటే అధిక ప్రమాణాలు కొన్నున్నాయ్....

ట్రిక్కులో, జిమ్మిక్కులో
అనంతమైన అణాలో
లేక అధిక రుణాలో
రాజ'కీ'యమో లేక
రత్నాల పుత్రుడో...


ఇలాంటి పై అర్హతల్లో ఏదో ఒకటుండి అర-కొర ఆటవుంటే చాలు.... నాన్ ప్లేయింగ్ team గ్రీన్ సిగ్నల్ తో ప్లేయింగ్ team లోకి అడుగిడినట్లే!


ఒకరికి ఒకరైన వేళ...

యద మది మాట వినదే
మది యద ఘోష కనదే....

నిశోషస్సుల నడుమ వ్యత్యాసమెరుగక
నాలో నేను లేనే లేని విడ్డూర స్థితి

శీతోష్ణాల ద్వయానికి నిశ్చలంగా నిలిచి
సంగ్రహించలేని సంచలన గతి

గర్జించే మేఘాలు, మంచు బిందు గోళాలు
తుమ్మెదల ఝుంకారాలు, పిచుకల ఇసుక స్నానాలు
వెండి వెన్నెల అందాలు, ఉదయ బానుని కిరణాలు
నింగిన కొంగల వరుసలు, నేలన గోవుల అరుపులు

శ్రవణ వీక్షణాలన్నీ ఇంపే, నాకై తను తనకై నేను
ఒకరికి ఒకరమైన విశేష సమయాన

సకల క్షణాలూ సంబరాలే, నిత్యం నాతో వసించుటకు
చెలి చెంత చేరిన శుభ జీవన యానాన

యద మది మాట వినెనే
మది యద ఘోష కనెనే....

Saturday, September 30, 2006

అందం

మనిషిలో మలినాన్ని మరచి మంచిని తరచి చూసే కళ్ళు
చూపులతో కైపెక్కించే కన్య కలువ కన్నులకంటే ఎంతో మేలు
కరుణ కలగలిసిన కమ్మని మాటల ఊటలుబికే పెదాలు
జుంటి తేనియలొలికే రసరమ్య మధురామృతాధరాలకంటే మెరుగు
అనాధల అర్తనాదాల అరణ్యఘోషే శ్వాసగా ఉన్న ముక్కు
సంపెంగ సైతం సిగ్గుతో చిన్నబోయే చక్కని నాసికానికన్న మిన్న
సంకటాలను విని సంగీతంగా మార్చేదుకు ఉసిగొలిపే చెవులు
పొడుపులపై విడిదిచేసిన పసిడికే పరువాన్నిచే కర్ణాలకంటే గొప్పవి
అన్నార్థులతో ఆకలిని పంచుకొని మానవత్వంతో బక్కచిక్కిన శరీరం
మైమరపించే మెరుపుతీగలాంటి మగువొంటిని మించినది
స్వచ్చమైన మనసులోని ధవళకాంతుల దివ్య సౌందర్యం
చంద్రబింబపు మోముమేనియకన్నా మహదానందాందం

Wednesday, September 27, 2006

అంతులేని వింతాశలు

నింగినంటే శిఖరం అంచున నిలకడగా నిలవాలని
కనుచూపుమేరా నా అస్తిత్వం అణువణువునా తెలపాలని
ఆశయం
ఆల్బెట్రాస్ లా అలలపై ఎడతెరిపిలేకుండా ఎగరాలని
నవ్వుతున్న విప్పారిన పువ్వులా నిత్యం వికసించాలని
సంకల్పం
ఎప్పుడో నడచిన దారుల్లో పదే పదే తిరగాలని
చిరు జ్ఞాపకాల్ని అదేపనిగా గురుతుచేసుకోవాలని
కోరిక
నాలో నేను నవ్వుతూ తుళ్ళుతూ అగమ్యంగా నడవాలని
క్యూలో నడుస్తూ నన్ను చూసి నవ్వే బడిపిల్లల గుంపులో చేరాలని
ఆశ
చిటపట చినుకుల్లో రివ్వున ఉరికి చూరుకిందకు చేరాలని
జల్లె జడివానైతే కేరింతలుకొడుతూ తనివితీరా తడవాలని
ఆరాటం
అతివ అందెల సవ్వడి విని ఎరుగనట్లే నింపాదిగుండాలని
దేవదారు మ్రానుల్లా నిటారుగా నిలువగ తను పలకరించాలని
అసహనం

కష్టాలన్ని కాలంచేసిన ఘోరాలని నేరాలని నిందించాలని
శిథిలమైన కలలు శిలలలా ఎప్పటికీ నిలవాలని
నిరీక్షణ
ఆశల ఊసుల ఉనికిని మనసు అరుల అరల్లో వెదకాలని
శ్వాసల భాషకు సరైన అర్థం సవివరంగా గ్రహించాలని
అన్వేక్షణ

Monday, September 25, 2006

నీకై నిరీక్షణ

ఎడారి యదలో తడికై తపన
విరహపు మదిలో నీకై వేదన
కాలమనే కడలిలో కళాసిగ సాగనా
విధాత విధిలో జతకై వేగనా
నిశీది నింగిలో నెలరాజు వదనా
విరుల విభావరిలో వ్యస్తనై ఉన్నా
ప్రేమ లంకలో నీకై నిరీక్షణ
నాతో నిత్యం వసించవే మైనా

Wednesday, September 20, 2006

తొలి వలపు-తొందరపాటు

తొలివలపే తేనియకంటే తియ్యనిదని
తెలిసింది తను కలిశాక
తన తనువే తనివితీరని తమకమని
తోచింది తనని వలచాక
తనువులేకమైన తొమ్మిది నెలల్లో
తొలితరణమయ్యాక
తమకంలో తొందరపడ్డాననిపించింది
తెలివితక్కువగా తెలియక

స్వప్న సుందరి

కలలలో కవ్వించి కలవరపరిచే రమణీయ రూపం
కవనంలో కనిపించి కరిగించే కమనీయ కావ్యం
కుంచెరంగుల్లో కలిసి సరసించే సొగసరి సోయగం

దివిభువులను క్షళించగ గోచరించని నీ గమనం
నీ కోసం నిరంతర నిర్విరామ నిరీక్షణ తపోమదనం
యదవ్యధను వధించగ వేంచేయవా వయ్యారీ నా కోసం!

Tuesday, September 19, 2006

వర్షం

ఉరిమే మేఘం నన్నరచి పిలువగ
చల్లని పవనం నీ రాకను తెలుపగ
ఝుమ్మని తుమ్మెద రివ్వున ఎగురగ
పిల్లలు అల్లరిగా వీధిన గెంతగ

నింగే నేలను వలువగ కలువగ
వీలుకాక వ్యధతో యదలో విలపించగ
జలజల కురిసే నీరే వర్షం కాగా
మిన్నే మన్నును సలీలంతో సంసర్గించగ

చిటపట చినుకులు నేలను తాకగ
తన్మయత్వంతో తనువే ఊగగ
విరహపు మనసులో అలజడి రేగగ
చెలి అందెల రవళే జ్ఞప్తికి రాగా

కుండపోతతో వెలుగే కందగ
దూరపు క్షితిజం దెగ్గర కాగా
మెరిసె మెరుపులు తలపులు చెరుపగ
తడిసిన తనువే తమకం చెందగ.....

ఒక్కసారిగా జోరు వర్షం వెలిసింది
పిల్లల అల్లరి మరుక్షణం సద్దుమణిగింది
కళ్ళు తెరువగ కమ్మని వీక్షణం కలిగింది
ఎదలో రూపం ఎదురుగ నాకై నిలిచింది

వర్షం వెళ్లిపోయింది విరహం తీరిపోయింది
చెలి చెంత చేరింది జీవితం కురిసే జల్లైయ్యింది

Monday, September 18, 2006

బాల్యం

కల్లలు ఎరుగని కమ్మని బాల్యం
అమ్మ ఒడిలో ఆనంద సమయం
అంతులేని ప్రశ్నల అమాయకపు మనీష
నాన్నకు రోజూ నేనిచ్చె సహనపు పరీక్ష
అల్లరి ఆటపాటలతో అలుపెరుగని వొళ్ళు
కథవినంది కునికేరాని రెప్పవాల్చని కళ్ళు
కోయిల కూతకు పోటీ కూతతో పెరట్లొకి నా పరుగు
పిల్లలకోడికి నేకూర్చొని గింజలువేసిన ఆ అరుగు
ఇరుగుపొరుగు పిల్లలతో గిల్లీకజ్జాలు
చిరుతిండ్లకోసం మారాంచేసిన రోజులు...
పరుగులిడే కాలాన్ని పాతెయ్యాలనిపిన్స్తుంది
బాల్యాన్ని తలచుకొంటే
ఆ కాలమే అక్కునచేర్చుకొన్నట్లుంటుంది
పసివారిని చూస్తుంటే
లౌక్యమెరుగని ఆ తాదాత్మ్యం
వయస్సుతో వచ్చిన వక్రబుద్ధుల్ని
ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుంది
అందుకే నాలో మానవత్వాన్ని
మేలుకొలిపి నిత్యచేతనంగావుంచే
బాల్యాన్ని మనస్సు కోరుతుంది

Saturday, September 16, 2006

శిశిరపు చెట్టుకృష్ణ, కాంతిని తరుమగ
వేగిరపడి వస్తున్నానని
పక్షుల కిలకిల రవములలో
లిఖించి సందేశించిన అరుణ సంధ్యలో...

ఎవరులేని ఒంటరితనం హాయనిపించి
సరస్సును చేరే విసిరిన సరములా
వొంపులు తిరిగిన సన్నని సిమెంటు బాటలో
నింపాదిగా నడుస్తున్న నాతో,
శిశిర సరసానికి రాలి ఎండిన
పండుటాకులు నా కాళ్ళకింద నలుగుతూ
ఎగిరెగిరి పడుతూ గుసగుసలాడి

ముగ్గుల చుక్కలద్దినట్లు
అక్కడక్కడ పసిడిరంగు పండుటాకులతో
అస్తిపంజరంలా విస్తరించిన బోడి కొమ్మలతో
కురులు విరబూసుకొన్నట్లుగావున్న నిన్ను
ఆతృతగా పరిచయం చేసాయి

నీ మోడులావున్న నేను నిన్ను చూస్తూ
ఆగుతూ అడుగులేస్తూ నడుస్తూంటే
ఒక్కో కొమ్మా ఒక్కో జ్ఞాపకాన్ని నిమిరింది

మలయమారుతం మోమును తాకి
తలపుల తాపాన్ని తడిమి తరిమి
సడిచేయక పిల్ల వలయాలతో
నా ప్రతిబింబాన్ని పాడుచేసి
వెక్కిరిస్తున్న సరస్సుని చేరానని చెప్పింది

అయినా నిశ్శబ్దంగా నగ్నంగా ఉన్న నువ్వు
నా జ్ఞాపకాల ఊసుల్ని తడుతూనే ఉన్నావు
వసంతమొచ్చే వరకు వేచివుండమని
పండుటాకులు రాలుస్తూ పలకరిస్తూనేవున్నావు

అభినివేశం

ఇల జనులకు విన్నవించగ
గన్న నరుడు లేడు
కలకందని సుఖముల మరిగి
కబోదియైనాడు
సర్వం అభాసమని బోదింపగ
గ్రహింపకున్నాడు
మరణం దరి చేరకముందే
నశించుచున్నాడు

వీడి మనసు మారేదెప్పుడు?
వికలమైన మనీష స్వస్థపడేదెప్పుడు?

నైరాశ్యం నింగినంటినా
వైరాగ్యం పలుకరించినా
నే రాయక మానను
నా వచనం నా కవనం
నా కథనం నా మదనం
సత్యానికి సన్నిహిత్యమై
లోకుల అసురానికి అతిరీక్తమై
కనువిప్పు కలుగజేసి
స్నిగ్ధ సౌందర్యాన్ని సాధించేదాకా
నిరంతరంగా కొనసాగుతుంది
తుదిశ్వాస విడిచినా నుడికారమై
జిజ్ఞాసుల స్వరనాదమై...

Friday, September 15, 2006

విఫల ప్రేమ

చల్లగా వీచే గాలికేం తెలుసు
విరిగిన నా మనసు వ్యధ
ఎగసిపడే అలలకేం తెలుసు
ఉప్పొంగే నా యదలో బాధ
చేసిన బాసలు నీటిపైన రాతలని
మగువ మత్తులో ఎవరైనా చిత్తేనని
ఇన్నెళ్ళ సహవాసాన్ని ప్రేమ సంబంధాన్ని
ఎరుగనట్టే మైమరచిన ఆమె కళ్ళ వెనుక
కనిపించని కల్మషాన్ని అనిపించని కాఠిన్యాన్ని
క్షణమైనా అణువైనా నేను పసిగట్టలేక
కలల లోకంలో విహరిస్తూ అక్కడే మొహరించాను
ఒంటరినని తృణీకరింపబడితినని గ్రహించాను
తీయని పాటగా వినసొంపుగా వచ్చి
తను మార్చింది నా తలరాత
మానని గాయంచేసి మనసే విరిచి
నవ్వుకుంటూ వెళ్ళిపోయింది తరువాత
విఫలమైంది నా ప్రేమ కథ...

అనుభూతులు, హైకూలు

జడి వాన
గొలుసు తెగి
నేల రాలిన ముత్యాలు
ఓ క్షణ కాలపు సవ్వడి...
******************
నిర్లిప్తత
చిగురు ఎండింది
మనసు మూగవోయింది
గాలిలేని సంధ్య భారంగా...
******************
బాట
పచ్చని పచ్చిక మధ్య
పసుపు పాపిడిలా
ఎండిన గడ్డి గీత
*******************
ఎండాకాలం
కిర్రుమంటూ తిరగలేక తిరుగుతున్న
సీలింగ్ ఫ్యాను గాలికి వొణుకుతున్న సాలె గూడు
ఉక్కపోతలో నవ్వొచ్చింది
********************
వానాకాలం
ఎండావానలకు వెలిసిన
పాత గోడపై పాకురు
పచ్చగా పలుకరించింది
********************
తొలకరి జల్లు
పక్షుల కిలకిలలు విని
కిటికి తెరువగానే
మట్టివాసనను మోసుకొచ్చింది పిల్లగాలి
*********************
గాలివాన
రికామీ గాలి నీళ్ళతో జట్టుకట్టింది
అది చూసి నవ్వాపుకోలేక తుళ్ళుతూ ఊగుతూ
నేలకొరిగాయి కొన్ని వృక్షాలు
**********************
ఎదురు చూపు
ముసురులో ముడుచుకొని కూర్చుంది
మా ఇంటి ముందు కరెంటు తీగపై ఒక గువ్వ
పొద్దుగుంకుతున్నా కదలక
తోడు కోసం ఎదురు చూపేమో..

కలయికశుష్క నయనదారల దారుల
చెరిపి చెక్కిలి తేటదనాన్ని
ఎంగిలి చేయగ...

నా గుండెలపై వాల్చిన నీ
వదనంలోని ప్రశాంతత విలాసం
నా గుండె చప్పుడు కనుగొంది

లలిత మిలిత చలన విలీనమైన
మన అనుబంధాన్ని మన కలయిక
చిక్కుముడిలా బిగించింది

జీవిత లంపటానికి కాసేపు
లంగరు వేసినట్లుగా
నా సంవేదనల సంఘర్షణల
సందేశాల్ని ఆదేశాల్ని
ఆ కొన్ని క్షణాలు సమాధి చేసాను....

ఇంకెన్నడూ నిన్ను వీడి వెళ్ళొద్దని....
ఎప్పుడూ తోడుగా వుండాలని....

వివరణ: చాన్నాళ్ళు దూరంగా వున్న జంట ఒకరికోసం ఒకరు తపిస్తూ విరహం తో వేగిపోయి వేదనపడి ఏడ్చి బాధపడే స్థితిలో, సముద్రాలు దాటి తనని కలవడానికొచ్చిన ప్రియుడు చెలిని ముద్దాడి కౌగిలించుకొన్నప్పుడు అతడి మనసు పలికే భావం ఈ నా చిరు ప్రయత్నం

Tuesday, September 12, 2006

నా వ్రాతలు

జీవంలేని జడత్వమైన
జటిలమైన కుటిలమైన
కుల్లిపోయిన కృశించిన
చచ్చుబడిన మచ్చబడిన
తుచ్ఛమైన నులివెచ్చని
వ్రాతలు నా వ్రాతలు కావొద్దని...
మనసుల తొలిచి మనుషుల గెలిచి
మంచిని పెంచి మలినం తుంచి
మ్రానుని మార్చి మత్తే దించి
మందిని కూర్చి మార్పును తెచ్చేలా
వుండాలి నా వ్రాతలు...
మదించి కదించి
ఖండించి కరుణించి
కరిగించి విరిగించి
చలనం సృష్టించాలని
సృష్టిని స్పృశించాలని
నా మది విధిగా వుసిగొలిపిన వాంఛ
అచంచల విశ్వాస శ్వాసతో
అకాశ విశాలంలో విపంచిలా
విహరిస్తూ వీక్షిస్తూ
తిరుగుతూ తపిస్తూ
తరిస్తూ తర్కిస్తూ
నే విరచించిన
నా వాక్యపు జాడను
బోసినోటి పసి పిల్లల
ముసి ముసి నవ్వులలో
ముదుసలి వదనపు
ముడుతల గీతలలో
స్వతంత్ర భావాల
నవ యువతీయువకుల్లో
జీవితం పరమార్థమయ్యిందనే
మధ్యవయస్కుల సంతృప్త స్వాంతనల్లో
స్థిరమై స్వరమై
శరమై చరమై
పర్వమై పదమై
ఆశై అనుకరణై
ఆదై అంతమై
అనుసంధానమై ఆనందమై
అఖిలమై సకలమై
అంబరమై అవనై
విశ్వమై శ్వాసై
శాస్వతమై అమరమవ్వగ
నే చూడాలి
అప్పుడే... తనువు వీడాలి!

Saturday, September 09, 2006

అగాదం-ఆశయం

ఆకాశ హర్మ్యాల అంచుల అరణ్య రోదనలు
తాటాకు గుడిసెల ముంగిట కారుణ్య వితరనలు
అచ్చటా ఇచ్చటా ఎచ్చటైనా వాడే
ఏమిలేని చేతగాని పేదవాడే

కలిలో ఆకలి రగులుతున్నా కలిని పంచేవాడు
నిండుకున్నా వండుకున్నదిచ్చేవాడు
తరచిచూడ యిల ఇటువంటి నరుడొక్కడులేడు

విరుల పాదమ్మోపి గరుకనే సుకుమారులు

ద్రవ్యాన్ని ద్రవ్యంగ్రోల ద్రవ్యంలా పారించే మత్తులు
ఎప్పుడూ ఎందుకూ ఎన్నడూ వాడే
అన్నీవున్న అంధుడైన కుభేరుడే

కలిమిలో లేమంటూ దిగులుపడే డబ్బున్న దరిద్రుడు
వెక్కసమైనా సిరి చాలదు చాలదనేవాడు
నలుదిక్కుల తారసపడేను ఈ మనుష్యుడు

ఈ లోతెరుగని అగాదం
మన లోకపు విషాదం
కసిని నింగినంటించే ఈ వీక్షణం
కొలిమి నిప్పుతో కడగాలని, ఈ క్షణం
ఆశయమాగదు ఆగినా నా ప్రయాణం
వచ్చేవరకూ ఆ మజిలీ... మరణం
కలం ఖడ్గంతో నే పోరాడే ఈ రణం
సమాంతరం దృష్టించేవరకు సాగాలి నిరంతరం!


వివరణ: ఎత్తైన భవంతులు కట్టినా పేదోడి బాధలు పట్టించుకొనేవారు లేరుపేదొడికి పేదోడి మాటల ఓదార్పే అండ అదే వారొకరికొకరిచ్చుకొనే వితరన. ఎక్కడ చూసిన ఇటువంటి నిరుపేదలు లెక్కకు మించి వున్నారు.
ఈ కలియుగంలో ఆకలితో రగులుతుంటే కనీసం గంజిని పంచుకొనేవాడు,ఇంట్లో ఏమీలేకపోయినా ఒక్క పూటకి వండుకున్నది అడిగినవాడికిచ్చే ఉత్తమ ఉదారతగలిగినోడు, ఈ ప్రపంచంలో ఒక్కడు కూదా లేడు.
పూలపై నడుస్తూకూడా పాదాలు కందుతున్నాయనేవారువిపరీతంగా తిని తాగుతూ పార్టీలకని పబ్బులకని నీళ్ళలా డబ్బు కర్చుచేసేవారు ఈ కాలంలో ఎంతోమంది ఉన్నారు.
డబ్బున్నా సంతృప్తి లేక జీవించేవారు, దాహం తీరక ఇంకా ఇంకా సంపాదించేవారు చాలామందుంటారు.
ధనిక పేద వర్గాల మధ్య పూడ్చలేని పెద్ద అగాదం వుంది, ఎంతో వ్యత్యాసం వుంది. ఇది చాలా చింతించవలసిన విషయం. ఈ వ్యత్యాసాన్ని రూపుమాపాలని సమానత్వం తేవాలని, సమాజాన్ని ప్రక్షాళన చెయ్యాలని అవేశంతో కవితలు రాసి ఒక్కరినైనిన ఆలోచింపచేయాలని ఎప్పుడూ రగిలిపోతుంటాను. నేను మరణించినా నా రాతలు యువతలో స్పూర్తిని నింపి సమానపు నవ సమాజం నిర్మించబడేవరకు కొనసాగాలి!

Friday, September 08, 2006

కొవ్వొత్తి

కరుగుతున్న కొవ్వొత్తిని చూసి
కరెంటు పోయి గంటలు గడిచినా
తెలియకుండానే కళ్ళు మూతలు పడ్డాయి.
కరిగిన ఊసులని జరిగిన కాలాన్ని
మిణుకు మిణుకు మంటూ
కొవ్వొత్తి కాంతి కళ్ళముందుంచింది.

చెలి వలపులు తలచి చిలిపి ఆలోచనలతో
కైపెక్కే అల్లరి మనన్సు...
యదలో అలజడి ఇక తట్టుకోలేక
అసందర్భంగా హసిస్తున్న అదరాలలో
బయటపడే ఆ కమ్మని ఊసులు...
పందిరి మంచం చుట్టూ తచ్చాడుతూ
మాటి మాటికి పక్క సరిచేస్తూ
మసక చీకట్లు ఎప్పుడు చిక్కపడతాయా అని
సాయం సంధ్యవేళలో రవి మునకలో
అసహనంగా ఎదురుచూస్తూ
యుగాల్లా తోచే ఆ భారమైన మధుర గడియలు...

దిగ్గున లేచా! మూసిన కనురెప్పలపై
భల్లున పడ్డ లైటు కాంతి ఎరుపెక్కించగ,
కరెంటు వచ్చిందని గ్రహించి...

ఊటి కుండ

పతిదినం కుండలమైన మమ్మల్ని
చెరో దిక్కు కావెడగట్టుకొని ఊరవతలకి
నడిసిపోయి కారడివిల బండల సందుల
ఒర్రెలనుండి పారే సొచ్చమైన యేటి నీళ్ళు
కుండలమైన మాలో నింపుకొని
నీ బక్కకండలుబక మమ్మల్ని మోస్తూ
యజమాని తొట్లో, కూజాల్లో నింపగ పోయేవు.


నీ కట్టంజూసి వూటికుండనైన నాకు
గుండె గతుక్కుమంటాది.
అయ్యో! ఎప్పుడు నిండుగ నీల్లు తోడుకరాలేదని
యమ దుఃఖమైతాది.


యిల్లు చేరేసరికి సగమింకిపోయే
నర్రబడ్డ నల్ల కుండను నన్నెందుకు ఉంచినవని,
ఇసిరి బండకేసి కొట్టక పోతివేమని
ఇరక్తి పుడతది.
గా పక్క నిండుకుండని జూస్తే నా బతుకు
"తూ దీనియమ్మ యెందుక"నిపిస్తది.


యెందుకయ్యా మాటాడవు నువ్వు?
సడిజెయ్యక గమ్ముగుంటవు?
యెందుకుంచినవ్ ఇంక నన్ను?


చెప్త ఇను- నువ్వు మర్రపడ్డా నాకు నచ్చినవ్...
కావిడదుపుదప్పి నా బుజం కందినా
నువ్వుజేసే మేలెరిగి నిన్నుంచిన
నీ నర్రలనుండి కారే నీటిబొట్లు
మట్టిలగల్సిన గా బాటొంక
ఒక్కతరి దిగులుమాని తొంగి సూడు
అగపడ్డాయ ఇరబూసిన బంతి చెండ్లు
ఇంపుగ ఆసనొత్తన్న చామంతి పూలు?


ఆ బాటెంట నాటిన పూలగింజలు
నీ తడికి మొగ్గతొడిగి ఇచ్చుకొన్నై
ఆటిని రోజు అయ్యగారి బల్లమీద కుండీల పెడ్తే
పొద్దున్నెయ్ పూజకొరకు అమ్మగారికిత్తే
బల్లమీద పూలు పెద్దాయన మనసు మురిపిస్తన్నయ్
అమ్మగారి మనసులో బత్తి కురిపిస్తన్నయ్
ఆ ఇంటిని మొత్తం సంతోషంతో నింపుతన్నయ్


ఏదో లోపముందని ఎన్నడు చింతపడకు
లొపమేమి శాపం కాదు
ఆలోసిత్తే లోపాన్ని కూడా
లాభంగ మార్చొచ్చు
లోకానికి మంచి చెయ్యొచ్చు!

("cracked pot" అనే ఇంగ్లీష్ కథ ఆధారంగా)

Wednesday, September 06, 2006

నాస్తికుడు

పశులదొడ్డిలో పెంట పేరుకుపోయినట్లు
మనిషి మదిలో మత్సరాలు పేరుకొన్నయ్
ఇగోతో మనసు మార్చుకోలేక
దెప్పిపొడుస్తున్న సత్యాన్ని
విజ్ఞానంధకారంలో పొగరుతో
మొండిచేయాలనుకొంటున్నాడు

తనకు తెలిసిందే తర్కమని
మిగతాదంతా సుద్దవ్యర్థమని
చేదనిపించే నిజాన్ని దిగమింగలేక
రుచిగావుండే "ఇజాల్ని" జీర్ణించుకొంటున్నాడు

పాపం వాడికి తెలీదు కాబోలు
ఆ దేవుని మూర్ఖత్వం
మనుషుల విజ్ఞానంకంటే
ఎన్నో రెట్లు గొప్పదనీ
వారి మస్తిష్కానికి అందదని...

ఇలా జాలిపడేవారిని
పిచ్చోల్లనుకొంటాడు నాస్తికుడు
వాడి కర్మ...

PS: These stanzas reflect the mind of an atheist. Go and ask any psychologist, without hesitation, he will say that all most all atheists are egoists.

Any atheist before asking me any question, first let me know

1. Where did life come from?

and your answer will be: Life originated millions of years ago by RANDOM CHANCE because of REMARKABLE REACTIONS which JUST HAPPEN in the MATTER.

My response to your answer is: Don't you feel shame and doesn't it look ridiculous to use words like 'random chance', 'remarkable reactions', 'just happen' and 'matter' without any External Influence?

You people use funny words like 'random', 'remarkable' etc for things you can't explain, for things externally influenced by none other than God. You replace God by the words 'remarkable' and 'random'.

Rather denying Him deny yourselves. Better late than never! It is impossible to prove that there is no God than to prove that there is God!

How funny it sounds that I am here on the earth by a random chance because of some bloody remarkable reactions in matter which just happen....ahaa!
చక్కని చుక్క

నా చూపుకి నచ్చిన
చక్కని చుక్కవు నువ్వే
అని నీ వెంటపడితే
ఏం చెప్పకుండా నన్ను
నీ చుట్టూ తిప్పుకొంటావని
తుళ్ళుతూ నవ్వుతూ
నన్ను మాయ చేసి
నా జేబులో డబ్బులు
కొల్లగొడతావని
నువ్వు దక్కవని
చివరికి నాకే బొక్కని
నాకు తెలుసు!
అయినా వినదుగా
ఈ పాడు మనసు!!

మూగ ప్రేమ-కన్న పేగు

నిను చూసిన క్షణం నుండి
నాలో ఏదో తెలియని మధుర భావం
ఏం మాయ చేసావోగాని
అంతరంగంలో అలలెత్తింది కలలసంద్రం

కనులు రెప రెపలాడిస్తూ
చూసి చూడనట్టు నీ చూపుల గమ్మత్తు
నన్ను బిత్తర పరిచి దిక్కులు చూసేట్లు
చేయగ దారిన పోయేవారు
దిగలేదు వీడికి మందు మత్తు అనుకొన్నారు

నాలో నేను లేనే లేకుండా
నీ తలపులతో చిలిపిగ నవ్వుతుంటే
చాటుగ వుండి చూసిన అమ్మ అనుకొంది
"వీడికి ప్రేమ పిచ్చి ముదిరింది" అని

ఒళ్ళు మరిచి నీ ఊసులతో
రోడ్డుపై నడిచి పోతుంటే
దారి విడచి మధ్యేదారిలో నేను
కీచుమని బస్సు బ్రేకువేసిన
సడికి తేరుకొన్న నాకు
"చూసుకొని నడువ్! లేకపొతే చస్తావ్!!"
అన్న డ్రైవరు మాటలుకూడా నవ్వు తెప్పించాయి

ఇంటికొచ్చిన నాకు అనుకోని దర్శనం!
గుమ్మంలో అమ్మ వెనుక నిల్చొని నువ్వు
తలదించుకొని చేతిని మూతికడ్డం పెట్టుకొని
చిరుమందహాసంతో సిగ్గులొలుకుతున్న నీ వదనం

పిరికివాడి మూగ ప్రేమను అర్థంచేసుకొని
"ఎలాగైనా నా కొడుకు ప్రేమను గెలిపించాలని"
కన్న పేగు పడిన ఆరాటమెరిగి కల్లు చమర్చాయి
ఆ భూలోక దేవతను చూసి నొట మాట రాక
గొంతుపెగిలేట్లు గట్టిగా ఏడవాలనిపించింది

నిన్నొప్పించడానికి అమ్మ ఎన్ని పాట్లు పడిందో అని తలచుకొని....
"అమ్మా" అని పరుగెత్తి కౌగలించుకోవాలనిపించింది
ఎందుకో ఆ క్షణం నిన్ను "చీ పో!" అందామనిపించింది!!

విరహం

ఆలోచనలు నిరంతర ప్రవాహంలా
అనంతంగా కొనసాగుతూ
నన్నునేను మరిచి
చేతిలోని పూరెమ్మలు తెంచుతూ
ఏటిగట్టుపై అడుగులో ఆడుగువేసి
నింపాదిగా నడుస్తూంటే
నన్ను చూసి నీటిలో దూకిన
కప్పల అలజడికి ఉలిక్కిపడి
అటు చూడగా....
విప్పారిన తామరలో
గోచరించింది నీ రూపం
మండూక సందడికి రేగిన వలయాలు
విరహాన్ని తలపించాయి

అందుకే వలయం తామర ఉన్న
స్థానానికి చేరుతుంటే
నాలో ఏదో తెలియని
విపరీతమైన ఉత్కంఠత
వలయం తామరను దాటి
జరిగిపోతూ చివరికి కనుమరుగైతే
అచేతనంగా అసహనంగా
నీరు నిలిచిపోవాలని దృఢవాంఛ

అవునుమరి! అలానే అనిపిస్తుంది!!
వలయంలాంటి నా ప్రయాణం
తామరలో దాగిన నీ రూపంలా
దూరంగా ఉన్న నిన్ను చేరాలని....

Tuesday, September 05, 2006

ఓ సాయంత్రం

పండ్లు కొందామని శ్రీమతితో జంటగా పళ్ళ షాపుకు వెళ్ళాను
చక్కగా కుప్పగా పేర్చిన నారింజ పళ్ళను చూసి
ముచ్చటపడిన నా శ్రీమతి కుతూహలంగా ముందుకెళ్ళి
పెద్దగా ముద్దుగా మెరుస్తూ నోరూరిస్తున్న నారింజను
మధ్యవరుసలొనుండి చటుక్కున తీసింది
కూర్పు చెడి పండ్ల కుప్ప కూలింది
చేసిన తాత్సారం చాలక గాబరాగా
వాటిని కిందపడకుండా ఆపాలనే తొందరలొ
చేతులాడించి మరో కుప్పను కదిలించి కృంగించింది

షాపువాడు ఎక్కడ కస్సుమంటాడో అని
టక్కున వచ్చి నా చాటున చేరింది
వాడికి రగిలిపోయినా బయటపడక
శివుడు గరళాన్ని గొంతులో ఉంచుకొన్నట్లు
కోపాన్ని పంటికింద బిగబట్టాడనుకొంటా
శివుని కంఠం నీలం సంతరించుకొన్నట్లు
వాడి మొహం ఎర్రబారింది కళ్ళు నిప్పులు చెరిగాయి..

పాపం! కింద పడిన పండ్లను ఎత్తుతున్న వాడిని చూసి
అనుకొన్నదానికంటే రొండింతలు ఎక్కువ కొన్నాను
.....వాడు చెప్పిన ధరకే!!
ఇంతజరిగినా వెనుకనుండి మా ఆవిడ గిల్లుడు ఆగలేదు
-బేరమాడమని ధర తగ్గించమని అడగండి అనే సైగగా
నాకేమో చిరాకుతో ప్రేమతో నవ్వొచ్చింది!
మరో సాయంత్రం గడిచింది!!

Monday, September 04, 2006

మల్లె పువ్వు

సందర్భం: నా చిన్నప్పుడు మా పెరట్లో పెద్ద మల్లె తీగ పందిరి కట్టి వుండేది. మా ఇంటి చుట్టుపక్కలవాళ్ళు మా దెగ్గర మల్లెపూలు కొనేవారు.మల్లెల కోసం వచ్చేవాళ్ళు వాటిని గెలికి మరి చూసి మొగ్గలు ఇవ్వమంటే అన్నీ విచ్చుకొన్నై ఇస్తారేంటి....పొద్దునకల్ల వాడిపోవా అని మొహం ఎబ్బెట్టుగా పెట్టేవారు. అందుకే మా అమ్మ జాగ్రత్తగా చూసి ఒక మాదిరిగా వున్న మొగ్గలే తెంచమని చెప్పేది.....ఆ సందర్భాన్ని గుర్తుచేసుకొని రాసింది......సాధారణంగా మనం మల్లె మొగ్గల్ని కూడా వాడుకగా పూలే అంటాం. కాని ఇక్కడ నేను రెంటికి మధ్య వ్యత్యాసాన్ని స్పృశించాను...

స్కూలునుండి వచ్చి వరండాలో సైకిల్ స్టాండు వెసినంతలో
ఆ శబ్దం విని కాబోలు...."ఒరే చిన్నా! పెరట్లోకెల్లి
దోసెడు మల్లె మొగ్గలు తెంచు.." అని అమ్మ కెకేసింది...
నేను రివ్వున వెల్లి మా పెరటి మల్లె తీగ పందిరి దగ్గరకు పోయి
కాసేపు చుట్టు తిరిగుతూ, ఒకోసారి కిందకు చేరి
మొగ్గలకోసం వెతుకుతూ అందినవాటిని తెంచుతున్నాను....
మధ్యలొ వికసించిన పువ్వులను చూసి చిరాకు,
మొగ్గలు తెంచుతుంటే ఇవ్వొకటి అడ్డు అని
ఆ చిరాకులో అప్పుడప్పుడు కొన్ని పువ్వులను కూడా
నిర్లక్షంగా తెంచి కింద పారేస్తున్నా,ఎలాగు పనికిరావుకదా అని

కాని ఎందుకో, సాయంకాలపు పొగ వెలుతురులో
నల్లని నేలపై నేను విసిరిపారేసిన నిండుగ విచ్చిన
ఒక మల్లె పువ్వు తెల్లగా నా వైపే చూస్తూ వెక్కిరిస్తూ
ఎగతాళిగా నవ్వుతున్నట్లనిపించింది
మొగ్గలు తెంచుతున్న నేను కాసేపు అలా
దాన్నే చూస్తూ అచేతనంగా నిలచిపోయా
మొగ్గలు తెంచడమాపి మెల్లగా నేలనున్న
పువ్వు వైపు రొండడుగులేసి దాన్నే
పరికిస్తూ పరిశీలిస్తూ కిందగు వంగా

పండిన ఆ విచ్చిన పువ్వు సువాసనలు భారంగా
నా ముక్కుపుటాలను తాకి నా మీద ఇలా కసిరాయి
"మీ మనుషులింతే! మొగ్గగావున్నప్పుడు మరచి
విచ్చుకున్న మమ్మల్ని వద్దంటూ దూరంగా విసిరేసి
కళ్ళే తెరువని మొగ్గల్ని కోసుకుపోతారు
పువ్వులెందుకు పూటలో పాడైపోతాయి
మొగ్గలే మేలనుకొంటారు
కాని మేము ఒకప్పుడు మొగ్గలమే!
అవునులే మీగురించి ఎవ్వరికి తెలియదని ,
అన్నీ తెలిసిన వాటిని వద్దని ఏమీ తెలియనిదాంట్లో
ఏదో మర్మం వుందని వ్యర్ధమైనవాటి కోసం వెంపర్లాడతారు"

ఇంతలో అమ్మ మళ్ళీ కెకేసింది,
"చిన్నా త్వరగా కానివ్వు, దోసెడు మొగ్గలు చాలు
మసకబారుతుంది స్నానం చేసి
ట్యూషన్ టైమవుతుంది రెడీ అవ్వు" అని
ఉలిక్కిపడి నేను లేచి అవునుకదా అనుకొంటూ
ట్యూషన్ కు వచ్చే అందమైన నాకు నచ్చిన
నేను సైటు కొట్టే పిల్ల గురించి ఆలొచిస్తూ
ఏమి ఎరుగనట్లు పువ్వును తొక్కేసాను
తొందరగా మొగ్గలు తెంచడంలో పడిపోయాను

ఇప్పుడనిపిస్తొంది...జ్ఞానాన్ని నిజాన్ని విస్మరించి
బంధాల చట్రంలో చిక్కుకొని రాజీ పడిపొయానని
మల్లెపువ్వు తల్లోకి పనికిరాకపోవచ్చు...
కానీ మొగ్గగా వున్నప్పుడు దాన్ని తెంచకపోవడం
నాదే తప్పేమో అనిపిస్తోంది!

కొంచం వివరంగా: అసలు మొగ్గ-పువ్వు కి నిజం-రాజీ అనే పదాలతో ఏం సంబంధం? వీడి analogy ఏంట్రా బాబూ బొత్తిగా విడ్డూరంగా అర్థంకాకుండా వుంది అని మీరనుకోవడంలో తప్పు లేదు. కాని నన్ను కొంచెం వివరంగా చెప్పనీయండి! simpleగా చెప్పాలంటే మనం ఏ టైం లో చేయాల్సిన పనులు ఆ టైంలో చేసెయ్యాలి.దీనివల్ల మనకి ఫలితం వుంటుంది or atleast పనికి సార్థకత దక్కుతుంది. Let me explain it with a real life example- మా classmates తో ఒక e-group వుంది. అక్కడ మేమందరం touchలో వుండొచ్చన్న ముఖ్యోద్దేశంతో మొదలెట్టాము. Ofcourse నేనందులో activeవె కాదులేండి. ఎందుకంటే college రోజుల్లో మన image అంత చండాలంగా వుండేది. అయితే ఒకసారి మొన్నీమధ్య సునామి వల్ల సంభవించినా నష్టానికి చలించిన మిత్రులు మా e-group ద్వార classmates అందరికీ email చేసి బాధితుల సహాయార్దమై funds collect చేద్దాం అని ఒక మంచి ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు. రోజులు గడిచినా నేనైతే ఎటువంటి ప్రతిస్పందన చూడలేదు. మరి నేనెందుకు స్పందించలేదు అని మీరడగొచ్చు. ఇంతకముందు చెప్పినట్టు నేనసలు ఆ groupలో activeవే కాదు. ఇలా అని ఏమి సమర్థించుకోవట్లేదు. ఇక ఎప్పుడూ చలాకీగా వుండేవారు కూడా స్తబ్దంగా వున్నారు. అయితే వారు మరొ రకంగా సహాయ నిధి పంపివుండొచ్చు...లేక కొంత కాలానికి ఇచ్చివుండొచ్చు. కాని అవసరానికి సమయానికి వెంటేనే పంపే పైకం కొంచెమైనా సరిగ్గ ఉపయొగపడేదేమో. అంతా సద్దుమణిగాక ఎం చేసినా ఏం లాభం? దళారుల పాలవడం తప్పితే....
నేనిక్కడ నా classmates కొందరినో లేక మాకుమ్మడిగా అందరినో విమర్శించడానికి ఈ విషయాని ఉదహరించలేదు, అయ్యో అలా ఎలా ముభావంగా చలనంలేకుండా వున్నారండి అని మీ reaction వినడానికి కాదు ఈ ప్రస్తావన. ఆకలిగొన్నప్పుడు అన్నం పెడితే పుణ్యం అంతేగాని బిచ్చగాడినైనా ఆకలి లేనప్పుడు పిలిచి బిరియాని ఇచ్చినా తీసుకొని వాడి వెనక తిరిగే ఊర కుక్కకి పడేస్తాడు. మన స్పందన సమయానుచితంగ ఉండకపొతే అది వ్యర్థం. బూడిదెలో పోసిన పన్నీటితో సమానం. అందుకే మనం పలికే వాటికి చేసేపనులకు పొంతనవుందో లేదో ఆత్మ విమర్శ చేసుకొందాం.
ఇక నా మొగ్గ-పువ్వు:నిజం-రాజీ analogy కి వద్దాం.మల్లె మొగ్గగా వున్నప్పుడు తెంచితే సరిగ్గా వాటి అవసరసమయానికి కొంచం విచ్చి విచ్చుకోనట్లుగా సరైన స్థితిలో వుంటాయి. మొగ్గ పరిపక్వ సంపూర్ణ రూపమైన పువ్వు మనకి కావాల్సిన సమయానికి వాడిపోతుంది, కాని పరిపక్వత లేని మొగ్గే ఉపయోగపడుతుంది. అయితే ఇందులో పువ్వుదేమి తప్పులేదు. తప్పంతా మనదే. దాన్ని మొగ్గగా వున్నప్పుడే తుంచేబదులు మన మన పనులకి preference and priority ఇచ్చి అది వ్యర్థమయ్యేలా చేస్తాం. నిజం తెలిసినా రాజీ పడతాం.

Don't procrastinate things thinking them minute and of less significance. And also don't be overconfident of your abilities and intelligence. Time can fail you in anything and everything, it surpasses all human knowledge.