Friday, December 15, 2006

ఆశ

నీ చూపుల వలలో చిరుచేపలా చిక్కితిని
నీ అందాల మకరందంలో మత్తుడనై మైమరచితిని!

నా ప్రతి శ్వాస ఒక ఆశై నిత్యం నిను కోరె
నా ప్రతి మాట యదపాటై నీ వలపులన్ తలచె
అనుక్షణం నీ జతకై మనసంతా నీ నగవై
కనురెప్పల కలయికను కఠినతరం చేసెను!

నీ కాలి మువ్వల సరిగమల సవ్వడి వినుటకు
నీ పలుకుల తళుకులలో పరవశించుటకు
జాజిపూల వనంలో జాబిలి ఆగమన వేళ
నీ కనుల వెన్నెల కాంచగ వేచియుందును!

నిశిదివసాలు నిన్నే కోరుతూ నిరీక్షిస్తున్న నన్ను
నీ ప్రేమకు పాత్రుడ్ని చేస్తావని ఆశిస్తున్నాను!

2 comments:

త్రివిక్రమ్ Trivikram said...

మరో చక్కటి కవిత.
మీరు రాసే కవితలు చాలా బాగుంటాయి. :)

raghu ram said...

ఇంత అందంగా రాస్తే, మనుషులే కాదు, పాషాణాలైనా సరే మీ ప్రేమను ఒప్పుకుని తీరాల్సిందే !!