Friday, December 15, 2006

తొలి చూపు

తొలి చూపుల చిరు జల్లుకు
వెన్నెల మంటలు రేగేనె
నీ క్షణిక చూపుల శరాలు
యద గదిని తొలచేలె
వెనువెంటనే నీ జంటను కాక్షించితిని
నీ నగవుల సెగలలో
నే స్వాంతన పొందగ
నా కలల కౌగిలిలో
నువ్వు చెంతన చేరగ
కలిగిన వింత భావం ప్రణయమని

నీ కొరకై నా తపన
చింత చిగురింతై విరియగ
నీ రూపం నను వీడక
వింత పులకింతై పుష్పించగ
విరిసిన వలపు పుష్పం ప్రేమని

నా స్వప్నం నిత్య సత్యమని
నిను చేరగ నలు దిక్కులు వెదకితిని
నా డెందపు రవములను
విందువేమోనని అరుదెంచితిని
దవళ కాంతుల దివ్య సుందరి దరి చేరెదనని...

3 comments:

త్రివిక్రమ్ Trivikram said...

ప్రతి పాదంలోను, ప్రతి పదంలోను కవిత్వాన్ని విరబూయించారు. (తొలి చూపు ప్రేమను నేను నమ్మననుకోండి, అది వేరే విషయం.) మీ కవిత మాత్రం అద్భుతం! ఐతే "నిజ సత్యమని" అన్నారేమిటి? ఆమ్రేడితమైపోలేదా?

తెలు'గోడు' unique speck said...

స్వప్నం కాదు నిజమని,అందులో చూసిన సుందరి ఊహ కాదు సత్యమని చెప్దామనుకొన్నాను కాని సరిగా కుదరలేదనుకొంటా..."నిజ సత్యం" బదులు "నిత్య సత్యం" అని మారుస్తే నేననుకొన్న భావం పలుకకపోయినా confusion తొలగిపోతుందనుకొంటా.

రాధిక said...

aaveasa puurita kavitalu raastaaru.bhaava kavitalu raastaaru.remdimtiloa miiku eadi raayadam istam.