Thursday, July 05, 2007

C'mmon! You Can Read It!

I cdnoul't bvleiee taht I cluod aulaclty uesdnatnrd waht I was rdanieg. The phaonmneal pweor of hmuan mnid! Aoccdrnig to rscheearch at Cmabrigde Uinervtisy, it dsnoe't mttaer in waht oderr the lteerts in a wrod are, the olny intmoprat tihng is taht the frist and lsat ltteer be in the rghit pclae. The rset can be a ttoal mses and you can siltl raed it wotiuht a pebrlom. Tihs is bcuseae the hmaun mnid deos not raed eervy ltteer by isltef, but the wrod as a wlohe. Aznamig huh! Yaeh and I awlyas thuhgot slnpileg was ipatnomrt!

Wednesday, July 04, 2007

మరుపెరుగని మనసు

మనసు మార్గంలో మౌనంగా నడుస్తొంటే ఎదురుగా నీవు!

నేను జ్ఞాపకమున్నానా? అని నీ ప్రశ్న రెండచుల ఖడ్గమయ్యింది

యదను చిద్రం చేసింది, కన్నీరు ఘోషించింది...

నిను మరువలేని మదికి జ్ఞాపకానికర్థం తెలియదని...

తలపు

సౌఖ్యపు సమయాల్ని జ్ఞాపకాల అరల్లో పొందుపరిచాను...
నా శ్వాసకు బాసటగా!
ఆశలకి హద్దుగా నీ ఊసులతో నా మది నింపుకొన్నాను...
నీ తలపే ఊపిరిగా!

Saturday, June 30, 2007

నస

రెండ్రోజులుగా ఎడతెరిపిలేని వాన! ముసురు అనేంత సన్నటి తుంపర్లు కాదు...కుండపోతా కాదు...ఆకాశానికి జల్లెడ బొట్లు పడ్డాయేమో అన్నట్లు ఒకమాదిరిగా జల్లు కురుస్తూనే వుంది.కిటికీలోనుంచి బయటకు చూస్తూ..అలా ఎంతసేపయిందో తెలియదు...నీటి చుక్కల సవ్వడే నాకు జోలపాటయ్యింది.నా నిద్ర కూడా అంతే...ఈ వర్షం లా! గాఢ నిద్రా కాదు,అలా అని మగతా కాదు!"రేడియో తరనా"లో, కల్ కా రాత్ ఏ మహినే మే సబ్‌సే టండీ రాత్ హై,ఆజ్‌భీ వహీ టండ్ హై! తో అయిసి మోసం మే ఆప్ కా ఫర్మాయిష్...ఏ గీత్‌కా మజా లీజియె... అద్నాన్ సమి కా యె బీగి బీగి రాతోమె...అనే వ్యాఖ్యానం లీలగా వినపడుతూనే వుంది.అతడి మాటలు విని అప్పుడే రాత్రయ్యిందా అని ఆశ్చర్యం వేసి బద్దకంగా కళ్ళు తెరిచి చూసా! బయట మసక చీకటి,కీ ఇచ్చిన బొమ్మలా మెల్లగా తలతిప్పి గడియారం వంక చూసా...ఇంకా నాలుగుంబావే అయ్యింది.ఇక్కడ వర్షం పడితే జనాలకు ఎంత విసుకో నాకు తెలుసు.అదీ వీకెండ్లో అయితే మరీనూ!నేనైతే లోకంతో పనిలేనట్లుగా, ఇంకా నాలుగేగా అయ్యింది అనుకొంటూ కిటికీ పక్కన ముడుచుక్కూర్చున్నాను. ఆ తర్వాత కూడా చేసేదేమీ లేదు, తిని తొంగోటం తప్పితే!నాతో ఏకిభవించినట్లు చల్లని గాలి నా తల నిమిరింది.నాలాగే బద్దకంగా తిరుగుతుందనుకొంటా, తోడు దొరికానని కప్పుకొన్న దుప్పటిపై వీచి కదిపి నాతో దోబూచులాడుతొంది.ఆ తెమ్మెరేంచేసిందో ఏమో బద్దకం వదిలి బయటకెల్దామనిపించింది.గమ్యం తెలియదు..అలా డ్రైవ్ చేస్తూ యాధృచ్చికంగా ఇంటి దెగ్గరున్న లాండ్‌స్కేప్‌వైపు తిప్పాను.నింపాదిగా వెళ్తూంటే గత వేసవి గుర్తొచ్చింది.

వేసవిలో అంతా ఇంతా హంగామా కాదు...బార్బిక్యూ పార్టీలని,క్యాంపింగని ఇంకా ఎన్నో ఆట విడుపులు.ఇక్కడ వేసవి అంటే మన భారతావనిలా భగభగ మండుటెండలు కావు.ఒకమాదిరిగా, అంటే 20-25°c ఉష్ణోగ్రత ఉండి ఏదేను వనమంటే ఇదేనేమో అన్నట్లుగా చెట్టుచేమలతో ఆహ్లాదకరంగా ఉంటుంది.క్యాంపింగ్‌లో చేసే ముఖ్యమైన విశేషం "బుష్ వాక్"-అంటే చెట్లూ పుట్టలెమ్మటి అలిసిపోయెదాకా తిరగడం. ఇంతకి ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే గత వేసవిలో ఇలాంటి క్యాంపింగ్ నేను డ్రైవ్ చేస్తూ వచ్చిన లాండ్‌స్కేప్‌లోనే జరిగింది...బుష్‌వాక్ నేనెంతో ఎంజాయ్ చేసాను.అలోచనలను భగ్నం చేస్తూ రాళ్ళు పేర్చిన పాకురు గోడపైనుండి పావురాల పలకరింపు!కారు దిగి ఆ దారిలో నడవాలనిపించింది...చినుకుల దాటికి చిత్తడిగా మారి నివురుగప్పిన నిప్పులా,ఆరగించి కదలక మెదలక సేదదీరుతున్న కొండచిలువలా హాయిగా నిద్దురపోతున్నట్లుంది ఆ మార్గం!దానికిరువైపులా కలియపడడానికి సిద్ధంగావున్న రొమ్మువిరిచి ఎదురెదురుగా నిలిచిన సైనికుల్లా నిటారు వృక్షాలు!తెమ్మరల తాకిడికి లయబద్దంగా కలిసికట్టుగా నాట్యంచేస్తున్న గడ్డిపోచలు...నీటిగుంటల్లో వలయాలు విచ్చి వినాశనమవుతూ నన్ను మైమరిపించాయి.

ఎందుకో కలసివున్నట్లున్నా విడివిడిగా నిలచిన చెట్ల మధ్య వ్యత్యాసం ఆకట్టుకొంది. కలీల్ జిబ్రాన్ అన్నట్లు "కలిసిమెలసి ఆనందంగా అందరితో ఆడిపాడు....కాని నీవు నీవు గా ఉండు ఒంటరిగా...కలసి నిలువు దెగ్గరగా గుడి స్తంభాల్లా, కాని దరిలో నీ ప్రత్యేకత నిలుపుకో". ఇంత ముభావపు సమయంలో,మసగ చీకట్ల దెప్పిపొడుపుల్లో, పావురాల వెక్కిరింతల్లో, నిండు చంద్రుని బిత్తర చూపుల్లో నా ఒంటరితనమే తోడనిపించింది...ఏ లోటూ లేదనిపించింది! వర్షం నన్ను ఇంట కట్టి పడేసినా మనసు పంజరాన్ని విప్పింది...అందుకే చిత్తడి నేలైనా ఇస్టంగా నడవాలనిపించింది ఆ సాయంత్రం... వర్షంలో బురదలో వీడి నడకేంటి వెఱ్ఱి కాకపోతే...అన్నట్లుగా చాశాడు నిండుగా రెయిన్‌కోట్‌వేసుకొని అటుగా వెళ్తున్న ముదుసలి!

Friday, June 29, 2007

ఊసులు

అలుపెరుగని అలల తాకిడికి
అణువైన స్పందించని శిలలా
-ఆమె హృదయం
******************
విరబూసిన పూతలు
కోయిల కూతలు
రవి ఛవి కాంతులు
చెలి సంగతులు
ఎన్నో వింతలు
తీయని చింతలు....
-వసంతం
********************
మనసు విరిగిన మనిషికి
నిట్టూర్పే స్వాంతనగా
చెక్కిలి నిమిరిన నీటిబొట్టు
-కన్నీరు
********************
గొంతెండిన కుసుమాలపై
జాలిపడిన గగన సంచారి,
కార్చెనే కన్నీరు!
-వర్షం  
******************** 

Monday, March 26, 2007

మిలియనీర్

Mrs.Lavish:నన్ను పెళ్ళి చేసుకొన్నాకే మా ఆయన మిలియనీరయ్యాడు

చెలికత్తె:ఒహో! ఇంతకుముందు మీ ఆయనేంటి?

Mrs.Lavish:బిలియనీర్!

Wednesday, March 21, 2007

సెంచరీ-వంద తెలుగు టపాలు పూర్తి

క్రికెట్టైనా,టపాలైనా సెంచరీ అయితై ఎవరికానందముండదు చెప్పండి!సరదాగా మొదలెట్టిన బ్లాగు తెలుగులో వంద టపాలు పూర్తి చేసుకొంటుందని అనుకోలేదు.మీ విమర్శలు,అభినందనలే నన్ను రాయడానికి ప్రొత్సహించాయనటంలో సందేహం లేదు.ఇంతకాలం ఓపిగ్గా నా బ్లాగు వాగుడ్ని భరించినందుకు కృతజ్ఞతలు.చిన్నప్పటినుండీ ఆంగ్లమాధ్యమంలోనే విద్యాభ్యాసం చేసినా(అలా అని ఇంగ్లీషులో పెద్ద తోపును కాదులేండి!) తెలుగు భాషపై నాకున్న ఆశ నన్ను తెలుగులో వ్రాసేలా చేసింది.మున్ముందు ఇంత విరివిగా వ్రాస్తానో లేదో తెలియదు కాని వ్రాయడమైతే మానను గాక మానను.బ్రతుకు తెరువు బాకు గుచ్చుకొని భావుకత గాయపడుతూనే ఉంటుంది, అయినా ఆశ చావదు అని ఒక అనామక కవి ఎందుకన్నాడో ఇప్పుడిప్పుడే అర్థమవుతొంది.అవును తెలుగు భాష తీయదనం అలాంటిదే మరి.తెలుగు మత్తు పట్టుకొంటే ఒక పట్టాన వదలదు...ఇదొక తియ్యని వ్యసనం,తీరని దాహం!మరోసారి మీ అందరికీ "వంద"నములు!

మగవాడి అబద్ధం

కట్టెలు కొట్టువాడు కట్టెలు కొట్టుచుండగా వాని గొడ్డలి జారి ప్రక్కనే వున్న నదిలో పడిపోయెను. తన జీవనాధారమైన గొడ్డలి పోయినదని అతడు వల వల ఏడ్చుచూ నది ఒడ్డున కూర్చుండెను.
అతని దు:ఖమును చూచి ఆ నది దేవత ప్రత్యక్షమై ఏమి జరిగినదని అడిగి తెలుసుకొని నది దేవత వెంటనే నదిలోకి మునిగి, ఒక బంగారు గొడ్డలి తెచ్చిచూపెను. ఇది నాదికాదనెను. దేవత తిరిగి వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చెను. వాడు అది చూచి అదియు నాదికాదనెను. దేవత మరల వెళ్ళి ఇనుప గొడ్డలి తెచ్చెను. ఆ అదియే నాది అని కట్టెలవాడు దానిని సంతోషంతో తీసుకొనెను. నది దేవత వాని నిజాయితీకి మెచ్చుకొని ఇనుప గొడ్దలితో పాటు బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా బహుమతిగా ఇచ్చెను.

ఒకరోజు వాడు అదే నది ఒడ్డున తన భార్యతో నడుస్తూంటే,ఆమె అనుకోకుండా కాలుజారి ఆ నదిలో పడిపోయింది.తన భార్య కోసం విలపిస్తున్న అతని చూసి మళ్ళీ నది దేవత ప్రత్యక్షమై నీటిలోనుండి సినితార స్నేహను తెచ్చి ఈమె నీ భార్యా? అని అడగగానే అతడు వెంటనే అవునననగా,నది దేవతకు ఒళ్ళుమండి,దూర్తుడా...మంచివాడివనుకొంటే ఇంత సంకుచిత బుద్ధా నీకు? ఎందుకు అబద్ధమాడావో చెప్పు అంది.దానికి వాడు,నేను నిజం చెబితే తరువాత మీరు,ఏ శ్రియనో,హన్సికనో తీసుకొస్తారు.నేను మళ్ళీ నిజం చెబితే చివరకు నా భార్యతో పాటు వీరిని బహుమానంగా ఇస్తావు.నీవిచ్చిన ధనరాశులతో ఒక్క భార్యను పోషించడమే కష్టమవుతుంటే ఇక ఇద్దరితో వేగేదెట్లా అని ఆలోచించి, మీరు ముందు స్నేహను చూపించగానే కమిటైపోయాను అని సమాధానమిచ్చాడు!

నీతి:మగవాడు ఎన్నబద్ధాలాడినా దానికి ఎదో ఒక మంచి కారణం ఉంటుంది :)

Wednesday, March 14, 2007

సర్వే

గొప్ప పరిశ్రమ స్థాపించాలని ఉవ్విళ్ళూరుతున్న ఒక సంపన్న యువకుడు ముందుగా ఇతర పరిశ్రమలు,సంస్థల గురించి తెలుసుకోవడం మంచిది అని అలోచించి ఒక సర్వే చేయాలనుకొంటాడు.ముందుగా హైటెక్ సిటీకి వెళ్లి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో, మీ కంపెనీలో ఎంతమంది పనిచేస్తారు అని అడిగాడు, దానికి సదరు ఉద్యోగి, సుమారు ఒక 300 మంది అని చెప్పాడు.అతని దెగ్గర ఇతర వివరాలు తీసుకొని అమీర్‌పేట్‌లో ఉన్న ఒక కాల్ సెంటర్ ఉద్యోగిని పిలిచి మీ సంస్థలో ఎంతమంది పని చేస్తారు అని అడగ్గా,200మంది మూడు షిఫ్ట్లలో పనిచేస్తారు అని చెప్పాడు.పనిలోపని ఒక ప్రభుత్వ సంస్థ గురించి కూడా వివరాలు తెలుసుకొంటే మంచిదనుకొని దెగ్గరలో ఉన్న హూడా కాంప్లెక్స్‌కి వెళ్లి అక్కడ బయట కాంటీన్‌లో తీరిగ్గా కూర్చొన్న హూడా ఉద్యొగిని, మీ సంస్థలో ఎంతమంది పని చేస్తారు అని అడిగాడు...దానికతడు తాపీగా సుమారు మూడోవంతు మంది అన్నాడు!

అమెరికన్ల అతితెలివి

నాసా అంతరిక్ష యాత్రలు చేస్తున్న తొలినాళ్ళలో గురుత్వాకర్షణ లేని చోట బాల్ పాయింట్ పెన్ పనిచేయదని కనుగొని సుమారు 12 బిలియన్ డాలర్లు ఖర్చుచేసి దశాబ్దం పాటు పరిశోధనలు చేసి మొత్తానికి గురుత్వాకర్షణలేని చోట,నీటిలోనూ,తలక్రిందులుగా,గాజుతో సహా ఎటువంటి ఉపరితలంపైనైనా,అతిశీతల ఉష్ణోగ్రతలనుండి సుమారు 300 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ ఇలా అన్నీ ప్రతికూల పరిస్థితుల్లో వ్రాయగలిగే మహత్తరమైన పెన్నును కనిపెట్టారు!

ఇంతాచేసి రష్యన్లు ఏం వాడతారో అని అరా తీయగ పెన్సిల్ వాడతారని తెలిసింది :)

Tuesday, March 13, 2007

కోతల రాయుళ్ళు

చాన్నాళ్ళకు కలుసుకొన్న ఇద్దరు కోతలరాయుళ్ళు తమ తండ్రుల గొప్పతనం గురించి కోతలు కోయసాగారు...ఒకడు,"నాగార్జునసాగర్ డాం మా నాన్నే కట్టాడు" అన్నాడు.అందుకు రెండోవాడు,"ఓస్ అంతేనా! మృతసముద్రం తెలుసా నీకు? దాన్ని చంపింది మా నాన్నే" అన్నాడు!
కరిగిన కలలే బీజంగా
చిగురించిన కోరికలు...
పొద్దు పొడుపు!
---------------------------------
 
తల ఎప్పుడు నెరిసిందో తెలియలేదు
తన్మయత్వంగా తననే చూస్తూ...
ప్రేమా?
---------------------------------
ఆకులు రాలిన చెట్టు కొమ్మకు
చిక్కుకొన్న గాలిపటం
చల్లని గాలిగి రెపరెపలాడిది...
బద్దకపు నిశ్శబ్ద నిశిపై విసుగ్గా!
హేమంతం!
----------------------------------
ఒంటరితనపు వెన్నెలమంటల్లో
నడిరేయిలో నిదురరాక
చంద్రుణ్ని, చెలి ఛాయాచిత్రాన్ని
మార్చి మార్చి చూస్తూ...
కార్తీక మాసం!  
--------------------------------- 
 

సంకెళ్ళు


నిన్నే చూస్తూ కదలక నిలిచిన నన్ను చూసి

విసుగెత్తి కసురుకొంటూ కరిగిపోయింది కాలం... నను మరచి!

అయినా నీ కళ్ళు నా కళ్ళకేసిన చూపుల సంకెళ్ళు

నాకూరటనిచ్చాయి,నీ రూపం నాలో నిత్యం పదిలమని!

కసాయి లోకం

అలల లాస్యం ఆలరించగ
కలల తీరం కానరాగ
కరువైన విరామం
కొంతైనా దొరుకునని
క్షుద్బాధను శాంతిపగ
సంద్రమును నమ్ముకొని 
కడలి సుడులకు హడలిపోక
పడవ కడకు అడుగులేయగ
పథమెరుగని పాదములకు
తీరమే స్థిర నివాసమై
భారమైన బతుకులకు
సారము సముద్రుడై
సుఖముగ సాగిపోతున్న
తీరవాసుల సంసారముపై
పంచభూతములు పగబట్టెనో?
పుడమి పగలగ అగ్ని జిమ్మగ
జోరున హోరుగాలి చెలరేగగ
ఎగసిపడిన సంద్రుడు సునామై
ఎందరినో కడదేర్చెను!
తమ బతుకునావలకు
లంగరు నీవని నమ్మిన సంద్రం
నిండా ముంచగ కార్చిన కన్నీటితో
పగిలిన ఓడలవలె
చెదరిన బతుకులకు
మరమత్తు కావాలని
జనసంద్రాన్ని అర్థించగ
ఒరిగిన సాయం శూన్యం!
కలి లోగిలో కసాయి పెద్దలు
విచ్చలవిడిగా పాగావేయగ
కడవెడు కలికైనా నోచుకోని
చిన్నారుల ఆకలి కేకలో
ఇంటిని ఆదుకొనగ ఆక్రందనలో
దిక్కు తోచని అభాగ్యులెందర్నో
బలిసిన కసాయి మృగాలకు
మక్కువైన ప్రాణమునిలుపుటకు
తమ కిడ్నీలకు వెలకట్టి
పీక్కుతినే రాబందులకీయగ
సజీవ శవాలుగ మార్చాయి
యజ్ఞ హవిస్సుని జేసాయి!

 
(తమను మింగిన సాగరానికంటే కూడా ప్రమాదకమమైన మనుషుల మృగ వాంఛలకి,ప్రభుత్వ నిర్లక్ష్యానికి,అవినీతి అధికారుల ధన దాహానికి క్షణ క్షణం మరణిస్తున్న సునామీ బాధితుల దీనావస్థను గూర్చిన ఈ వార్త చదివి మండిన గుండెలో ఉప్పొంగుతున్న ఆవేదన ఇది)  

Thursday, March 08, 2007

జ్యోతిష్కుడు

ఒకతను ఏం పనిలేక అటుగా వస్తున్న జ్యోతిష్కుడ్ని చూసి ఆట పట్టిద్దామని అతన్ని పిలిచి, నా గురించి ఎదైనా ఒక్క విషయం సరిగ్గా చెబితే నీకొక వెయ్యి రూపాయలిస్తా...లేకపోతే నువ్వు నాకు వందివ్వు చాలు..ఎమంటావు? అన్నాడు.జ్యోతిష్కుడికి పౌరుషం తన్నుకొచ్చి సరే అన్నాడు.తరువాత ఎదో ఒక పటం తీసి దాని మీద గవ్వలు విసిరి,ఆ గవ్వలను చూస్తూ,మీరు ఇద్దరు పిల్లలకి తండ్రి అన్నాడు.వెంటనే సదరు వ్యక్తి ఎగతాళిగా నవ్వి,వంద నోటిచ్చుకో,నాకు ముగ్గురు సంతానం అన్నాడు.వెంటనే జ్యోతిష్కుడు పకపకా నవ్వి ముందు నువ్వు నాకు వెయ్యి రూపాయలివ్వు,నీక్కాదు, నీ భార్యకు ముగ్గురు సంతానం,కాని నువ్విద్దరికి తండ్రివి అన్నాడు!

Tuesday, March 06, 2007

హెయిర్-కట్

ఒకతను పిల్లాడితో హెయిర్-కట్ సెలూన్‌లోకి ప్రవేశించాడు.తను హెయిర్ కట్,ఫేస్ వాష్,మసాజ్,షేవింగ్ అన్నీ చేయించుకొన్న తరువాత పిల్లాడ్ని కూడా కటింగ్ చేయించుకోమని చెప్పి,నీ స్కూల్ డ్రెస్ టై చిరిగిపోయిందన్నావ్ కదా, నీ హెయిర్ కట్ పూర్తయ్యేలోగా నేనెళ్లి కొత్తది కొనుకొస్తాను అని చెప్పి బయటకెళ్లాడు.పిల్లాడి కటింగ్ పూర్తైనా కూడా ఎంతసేపటికి అతను రాకపోయేసరికి,షాపువాడు, మీ నాన్న నీ సంగతి మర్చిపోయినట్లున్నాడు అని పిల్లాడితో అనగానే,పిల్లాడు,వాడు మా నాన్నేంటి...ఎదో ఫ్రీ హెయిర్ కట్ చేయిస్తాను,నా స్కూల్ టై కొనిపెడతాను అంటే సరే అని వాడితో వొచ్చా, అన్నాడు! 

"జై కిసాన్" అంటే ఆల్బెట్రాస్‌ని చంపకూడదు అన్నంత సత్యం!


"ఆల్‌బెట్రాస్"నేమి చేయరు,దాన్ని చంపితే అపశకునం అని కళాసులనుకొంటుంటే నిజమే అనుకొన్నా!నేనే కళాసినై సంద్రంపై పోగా తెలిసింది వాటి వేట ఒక సరదా ఆటని...అయినా ఎందుకో ఆ నమ్మకాలు!చంపినోల్లే చెబుతరు వాటికి హాని జేస్తే కీడని...విన్నప్పుడల్లా నవ్వొస్తది ఏడుపు కళ్ళకి తోడుగా!ఇంకేదో గుర్తుకొస్తది...

చిన్నప్పుడు పల్లెకు పోయి ఎండలో గట్లెమ్మటి పల్లె సోదరుల్తో తిరుగుతూ కంచెపై ఎండిన బీరకాయల్ని తెంపి గొడ్లని గెదమడానికి వాటిని విసిరికొడుతూ దుమ్ము లేసేలా కాళ్ళీడుస్తూ తాటిచేట్లను చేరంగనే పల్లెలుండే అత్త కొడుకరిసిండు మా పట్నం బాబుకి ముంజలు కొట్టండ్రా అని...నెత్తినెక్కిన సూరిడిని అందుకోడానికన్నట్టు తాడుకట్టి రైయ్యన పోటీ పడి పాకిన్రు చెట్లపైకి ఇద్దరు పోరండ్లు!కొడవలి దెబ్బకు కాడి కుండ పగిలినట్లు దడేల్న కిందపడ్డై గెళ్లు.అత్తకొడుకు కొడవలితో లాఘవంగ ఒలిసిచ్చిన ముంజలు ఆత్రంగా అందుకొని నొటికి కర్సుకొంటే యమ చేదనిపించినై....అత్తకొడుకు మార్చి మార్చి ఎన్ని ముంజలిచ్చినా అదే ఎగటు...అన్నీ చేదైనై!పక్కనున్న పొట్టి పోరడు గొల్లున నవ్వి కంచెపైన చేదెక్కిన బీరకాయల్ని పట్టుకొంటే చేతులెట్ల సక్కగుంటై అన్నడు.పొట్టోడి బుర్రని మొత్తుతు అందరు నవ్విన్రు...అత్తకొడుకు తన చేత్తో ముంజలు నోటికందించిండు.
పీకలదాకా ముంజలు మెక్కి రొప్పుతూ ఏటిని చేరి హాయిగ బండలపై కూచొంటే నసపిట్టసైతం నోరెల్లబెట్టేట్టు వాగే పొట్టోడు ఏటి పుట్టుక చెప్పిండు.ఊరవతల చిట్టడివిల కుహరంలో పుట్టింది ఈ తేట నీళ్ళ ఏరని...వాడి కత కంప్లీటు కాకముందే అందరం ఏట్లొకి దుమికినం!మన్ను పట్టిన ఒడలతో ఏటి సింగారానికి మట్టి రంగులద్దినం! ఎండలో చల్లగ ఎంత హాయిగుందో అనిపించింది...ఒకరిపై ఒకరం నీళ్ళిసురుతొంటే అత్తకొడుకు గమ్మునున్నడు...తడిసిన మొఖంలో తళుకు లేదు..మనిషిక్కడేగాని మనసెక్కడోలాగుంది.గుంతలు పడ్డ కళ్ళలో బాధేదో గూడుకట్టుకొంది,గుప్పెడు గుండెలో అగ్నిగుండమేదో రగులుతొంది...మండే సూరిడు దడుసుకొనేలా పిడికిలి నీటిపై గుద్దిండు...నసపెట్టే పొట్టోడు ఉలిక్కిపడి మాటలు నములుతొంటే అత్తకొడుకు చెప్పిండు-ఏటికవతలున్న మాబోటి పేదల భూములి ఎప్పటికీ మాయే అని ఒట్టేసి నొక్కిజెప్పిన గవర్నమెంటోళ్ళు రేపో మాపో నాలుగు రొక్కాలు చేతిలో పెట్టి ఆ భూమిలో ఎదో పెద్ద బిల్డింగు కడతరట...సిటీకి దెగ్గర మా ఊరు కాబట్టి చాలా లాభముంటదట...ఏం ఢోకా లేదు, మాకందరికి సక్కటి జీతాల్తో పనులు దొరుకుతయ్యట...భూమి గుంజుకొని బువ్వ దొరుకుతదంటరు..ఏమోమరి! ఎందుకో గుండెలో దడ..

భూములు పోయె,బతుకులూ తెల్లారే!నగరాభివృద్ధిలో నామరూపాల్లేకుండా కొట్టుకుపోయిన బతుకులెన్నో!కాలంతో పరుగులిడటం అంటే కంఠాలని కోయడమని,మెగా సిటీ,మెట్రో సిటీ,మాళ్ళు,మహళ్ళు,బహుళజాతి సంస్థలు,అంతర్జాతీయ విమానాశ్రయాలు...ప్రజల అవసరాలు తీర్చే వీటన్నిటికి చోటియ్యోద్దా?అని తెగ అమాయకపు ప్రశ్నలడిగే ప్రజల ప్రభుత్వానికి ఈ ప్రశ్నలెందుకు తట్టవో ఎంటో...భలే విడ్డూరం!గుంజుకొన్న ఆస్తులకి విలువ కట్టిచ్చే నష్ట పరిహారాలు బతికినంతకాలం ఒంటిపొద్దు గంజికి సరిపోతాయా?పేదరికానికన్నా పేదల్ని నిర్మూలించడమే ఈజీ అనేదే పెద్దోళ్ళ ఎజెండానా?రైతే ఈ దేశానికి వెన్నెముక అని,"జై జవాన్!జై కిసాన్" అని నినదించిన దేశంలో కిసాను సైతానయ్యాడా?అంతులేని ప్రశ్నల అలజడిలో అల్లరి మానలేదు పొట్టోడు,చెట్టుకింద నోరెల్లబెట్టి ఊగుతున్నాడు,వాడు మాట్లాడకపోయినా ఉరేసుకొని చచ్చిన వాడి చుట్టూ చేరిన రాబందులు గోల పెడుతున్నాయి-అన్నీ పోయినోడు బతికుండి ఏం చేస్తాడని వాటి గోలేమో!

"గోల్డ్ కోస్ట్" బీచ్‌లో నడుస్తొన్న నాకు,"ఆల్బెట్రాస్"ని చంపితే కీడు అని చిన్న పిల్లలకి కథలు చెబుతొన్న కళాసిని చూసి నవ్వోచ్చింది!

Saturday, March 03, 2007

ఆశావాదం


అద్దంలా అంబరం రోజంతా తేట తెల్లని వెలుగులీనగ
అక్షయ లోకపు అందమంతా వెల్లివిరిసిన పచ్చికలో
ఆశగా నడిచిన అడుగడుగు మదిలో ఆహ్లాదం నింపగ
తరుల గిరిపై నిత్యం వసించిన ఎంత మేలని తలచితి
మసగబారు వెలుగు అసుర సంధ్య ఆగమనమని,
నను అవరోహణమవమని ఆగాదముకు తోసివేయగ
నేలను దిగిన ఆ ఆనందం నశించునెందుకో నాలో
మలినం నాలోనో లేక ఇలలోనో అవగతమవక
ఒంటరిగా గడిపిన ఆ గడియలు నను పెనవేసుకొంటే
నాలోని ఆ గొఱ్ఱెపిల్లల స్వచ్చత నా ప్రాణమైతై...
అత్యాశేమో,స్వార్థమేమో,కపటమేమో ఈ తలంపు
అని నాలో మరో పార్శ్వం నను ప్రశ్నించింది
ఆశావాదానికి ఎల్లలు గ్రహించే పరిపక్వత నాలో లేదేమో!
కానీ ఎల్లలులేని "నిద్ర"లోకి జారుకొన్న నన్ను చూపిస్తూ
కాలం సమాధానం చెప్పింది నెమ్మదిలేని గాలితో...

Wednesday, February 28, 2007

సంధి

ఎగసిపడుతూ తమవైపు దృష్టి సారించమని
హోరున పోరు పెడుతున్న అలలను విస్మరించి
నిలకడగానున్న ఇసుకతిన్నెల గర్వమును చూసి
కరిగిన నెలవంక తన వెన్నెలతో హత్తుకొంది

ఆ వెండివెలుగుల వెన్నెల్లో తడిసి
రెట్టించిన అందంతోనున్న ఇసుకతిన్నెలు
గాలికెగసిన కొన్ని రేణువులను
తీరమున నిలిచిన నా చెలి పాదముల చెంతకు
కలవరపడుతూ సంధికి పంపాయి!
ఇంతిని చూసి నెలవంక తమనింక చూడడేమోనని
వెన్నెల ప్రేమను తమపై ఒలకబోయడేమోనని...

వీరి పీడ విరగడైపోను....

టీవీ చూస్తొన్న ముసల్దానికేమర్థమయ్యిందో కాని, ఇరాక్‌లో రగులుతున్న కొలిమిని చూసి,శవాల కుప్పలని చూసి,అమెరికా సంకీర్ణ సేనల్ని చూసి వీరి పీడ విరగడైపోను అని అమెరికన్లను నానా శాపనార్థాలను పెడుతొంది.అంతా గమనిస్తున్న ఆమె కొడుకు రవి పేపరు చదువుతూ తనలో తనే నవ్వుకొన్నాడు...ముసల్దానిలాగానే ఒకానొకప్పుడు...అంటే సుమారు ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఇందిరాగాంధి ప్రభుత్వాన్నుద్దేశించి తాను అలానే,"దీని పీడ విరగడైపోను" అనుకొన్నాడు.ముసల్ది జరుగుతున్న మారణకాండను,వినాశనాన్ని కేవలం చూసి శాపనార్థాలు పెడుతొంది కాని తను అప్పట్లో ఒక బాధితునిగా మండిపడ్డాడు.అప్పుడతనికి ముప్పై ఏళ్ళు...చిన్నపట్నుంచే రాజకీయాలంటే చాలా ఆసక్తి..తనలో ఒక గాంధియన్ సోషలిస్టు ఉన్నాడని తెలుసుకోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు....ఆ గాంధియన్ సోషలిస్టు కాస్తా కలకత్తాలో చదువుకొన్నప్పుడు పరిచయమైన ముకర్జీ చలవతో కమ్యూనిస్టు భావజాలంతో నిండిపోయాడు.దాని పుణ్యమా అని ఎమర్జెన్సీ సమయంలో పడిన తంటాలు అంతా ఇంతా కాదు.పెళ్ళాం పిల్లల్ని వొదిలి సందుల్లో గొందుల్లో పడి సుమారు రెండేళ్ళు పోలీసోళ్ళకి చిక్కకుండా ఎప్పుడో ఒకసారి కుటుంబాన్ని కలుసుకోవడం,ఒక్క కమ్యూనిస్టులే కాదు, ప్రభుత్వ వ్యతిరేక భావజాలం ఉన్న సంఘ్‌లు కూడా బాధితులే!ఎదేమయితనేమి....ఎమర్జెన్సీ ముగియటం ఇందిర ప్రభుత్వం పడిపోవడం తరువాతొచ్చిన ప్రభుత్వం కసితో పగబట్టి మరీ ఇందిరను, తోటి ఎమర్జెన్సీ మోనోపొలి గాళ్ళను(సంజై గాంధి అండ్ కొ.,) సాధించడానికి చేసిన ప్రయత్నాలు తనను ముక్కున వేలేసుకొనేట్లు చేసాయి.ఎందుకో తన నరనరాల్లో జీర్ణించుకుపోయిందనుకొన్న కమ్యూనిస్టు భావజాలం సరిగా జీర్ణం కాలేదేమో అనిపించింది...ఆ తరువాత తనలో చిన్నగా గూడుకట్టుకొంటున్న వైరాగ్యం అనే మహమ్మారి భావజాలం వలననుకొంటా అప్పట్లో యమ ఊపు మీదున్న ఆబ్జెక్టివిసం,ఆల్‌ట్రూయిసం వంటివి ఎన్నెన్నో పరస్పర విరుద్ధ భావజాలాలు నానా సమయాల్లో తనపై ప్రభావం చూపాయి.ఒకసారి తిక్కరేగి తన గురించి తనే ఆలోచించాడు.ఏంటి నేనింత చపలచిత్తుడినా?నాకంటూ ఒక ఒరిజినాలిటీ లేదా?ఒకసారి మంచిగనిపించింది ఇంకోసారి నచ్చదెందుకు?అందరూ నాలాగే ఉంటారా?కొందరు వారు నమ్మిందే జీవితాంతం వరకు పాటిస్తారుగా...ఆ బహుశా వాళ్ళు ఇగోయిస్టుగాళ్ళేమో!లేకపోతే దిన దినాభివృద్ధిలా భావజాలంలో కూడా శ్రేష్ఠమైనవి వస్తూనే ఉంటాయిగా...నేను కరేక్టే...ఎడాప్టవ్వడం నేర్చుకొన్నా...నచ్చిన దాన్ని అక్కున చేర్చుకొంటున్నా,నచ్చని దాన్ని వదిలించుకొంటున్నా..అని తను చేసుకొన్న తీర్మానాలు తలచుకొని కాసేపు నవ్వుకొన్నాడు రవి!ఈ మధ్య తన పాత భావజాలంతో ఉన్న వ్యక్తులు అమెరికాను తూర్పారబడుతూ రాస్తున్న కవితలు,వ్యాసాలు కూడా నవ్వు తెప్పించాయి.ఎందుకంటే అవిచదివినప్పుడల్లా గజదొంగల కథ గుర్తొచ్చేది.ఒక ఊరినిండా గజదొంగలుండేవారు...అందులో ఒక చిన్న గజదొంగకి అనుకోకుండా గొప్ప ఖజానా దొరికింది.దాన్ని సొంతం చేసుకోడానికి బలమైన గజదొంగలు నానా రకాల పదకాలు వేసారు.కానీ అందులో బలమైనవాడు తెగించి చిన్న గజదొంగ ఇంటిల్లిపాదిని చంపి,బతికున్నోళ్ళని లొంగదీసుకొని ఆ ఖజానా సొంతం చేసుకొంటుంటే మిగిలిన గజదొంగలు బలమైన గజదొంగకి ఎట్లా గండీ కొట్టాలా అని నానా హైరానా పడసాగారు.ఒకరేమో నువ్వు చేస్తొంది తప్పు.ఇన్నాళ్ళు దోచుకొన్న దాంతో తృప్తిగా ఉండొచ్చుగా అన్నాడు.ఇంకొకడు అంతా నీ ఇష్టం వొచ్చినట్లు చేస్తే ఊర్కోం అని నానా గగ్గోలు పెట్టాడు(మాక్కూడా వాటా ఇస్తే ఊర్కొంటాం అని వాడర్థం).ఇంకో గజదొంగ మేమసలు దొంగలమే కాము ఇలాంటి దొంగతనాల్ని, మారణకాండను సహించం అని చెప్పుకొచ్చాడు...ఇలా పెద్ద గజదొంగ చేసిన తప్పిదాన్ని మిగతా గజదొంగలందరూ నానా రకాలుగా విమర్శించారు....అనుకోకుండా పెద్ద గజదొంగ బలహీనుడైపోయాడు...ఇదే అదనుగా గతంలో నీతులు చెప్పి బలం పుంజుకొన్న మరో గజదొంగ తన నీతి తప్పి ఇంతకుముందు గజదొంగ కంటే పెద్ద మారణకాండే చేయసాగాడు....ఇలా ప్రతి ఒక్కడూ అవకాశవాదులే....ఈ రోజు అమెరికా,అది క్షీణించాక ఏ చైనానో, రష్యానో సూపర్‌పవర్ అయితే అంతా సజావుగానే ఉంటుందనుకోవడం హాస్యాస్పదం....మనిషి బుద్ధే అంత!అయినా మనుగడ తప్పదు...మనుగడ సాగుతొంది!ఎందుకంటే మనుషుల్లో భావజాలలు మార్చుకొనే ఇగో లేనోళ్ళు అక్కడక్కడా ఉన్నారు...ఒకవేళ అటువంటి వారు లేకపోయినా కాళ్ళు గుంజడానికి తోటి గజదొంగలు ఉండనే ఉన్నారు!

మొనాలిసా హావభావాలు

ఈ లింకుకి వెళ్ళి http://www.cite-sciences.fr/english/ala_cite/expo/explora/image/mona/en.php#మీ cursorను ఫోటో కుడి పక్కనున్న"with disdain,dissappointed etc...",expressions పై ఉంచి మొనాలిసా ముఖ కవలికలు చూడండి!

Tuesday, February 27, 2007

నొకియా ఫోన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు...

కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ ఎంత ఉపయోగకరమో చూడండి...

1.ప్రపంచవ్యాప్తంగా "మొబైల్" ఎమర్జెన్సీ నంబరు- 112.మీరు కవరేజ్ ఏరియాలో లేనప్పుడు ఎమైనా ప్రమాదకర లేక అత్యవసర పరిస్థితి ఏర్పడినపుడు 112ని డయల్ చేయండి.అప్పుడు అందుబాటులో ఉన్న ఏ నెట్‌వర్క్‌నుంచైనా ఎమర్జెన్సీ నంబరును మీకు సూచిస్తుంది.ఆసక్తికరమైన విషయమేమిటంటే మీ కీప్యాడ్ లాక్‌చేసి ఉన్నా కూడా మీరు 112 డయల్ చేయవొచ్చు! ప్రయత్నించి చూడండి!

2.మీ కార్ కీస్ లోపలే ఉండిపోయి కార్ లాక్ అయిపోయిందా? మీ కార్‌కు రిమోట్ కీస్ ఉన్నాయా?ఒకవేళ అలా కీస్ లోపలే ఉండి లాక్ అయిపోతే కంగారుపడకండి...మీ దెగ్గర మొబైల్ ఫోనుంటే ఇలా చేసి చూడండి...మీ ఇంట్లో మీ కార్ స్పేర్ రిమోట్ ఉంటే వెంటనే ఇంట్లో ఉన్నవారి మోబైల్‌కి మీ మొబైల్‌తో ఫోన్ చేయండి.ఇప్పుడు మీ ఫోన్‌ను కార్‌కు సుమారు ఒక అడుగు దూరంలో ఉంచి అవతలివారిని వారి ఫోన్ దెగ్గరగా రిమోట్ నొక్కమనండి...ఆశ్చర్యం! మీ కార్ అన్‌లాక్ అవుతుంది.అవతలివారు కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నా పనిచేస్తొంది....దీనికి దూరంతో సంబంధం లేదు!

3.మీ ఫోన్‌లో చార్జింగ్ చాలా తక్కువగా వుందనుకోండి.మీరొక ముఖ్యమైన కాల్ కోసం ఎదురుచూస్తున్నారు..చార్జర్ అందుబాటులో లేకపోతే ఏం చేస్తారు?
సింపుల్! నొకియా ఫోన్లు రిసర్వ్ చార్జ్‌తో ఉంటాయి(N-సీరీస్ మినహాయిస్తే).మీరు చేయవల్సిందల్ల *3370# డయల్ చేయటమే...ఇప్పుడు మీ ఫోన్ కనీసం సగం చార్జింగ్ చూపిస్తుంది!

YOU ARE AN INDIAN IF......?(on the lighter side)

1. Everything you eat is savored in garlic, onion and tomatoes.

2.You try and reuse gift wrappers, gift boxes, and of course aluminium foil.

3. You try to eject food particles from between your teeth by pressing your tongue against them and making a peculiar noise like,tshick,tshick, tschick, tschick.

4. You are standing next to the two largest size suitcases at the Airport.

5. You arrive one or two hours late to a party - and think it's normal.

6. You peel the stamps off letters that the Postal Service missed to mark up.

7. You recycle Wedding Gifts.

8. You name your children in rhythms (example, Sita & Gita, Ram & Shyam)

9. All your children have pet names, which sound nowhere close to their real names.

10. You take Indian snacks anywhere it says "No Food Allowed"

11. You talk for an hour at the front door when leaving someone's house.

12. You load up the family car with as many people as possible.

13. You use plastic to cover anything new in your house whether it's the remote control, VCR, carpet or new couch.

14. Your parents tell you not to care what your friends think, but they won't let you do certain things because of what the other "Uncles and Aunties" will think.

15. You buy and display crockery, which is for special occasions,which never happen.

16. You have a vinyl tablecloth on your kitchen table.

17. You use grocery bags to hold garbage.

18. You keep leftover food in your fridge in as many numbers of bowls as possible.

19. Your kitchen shelf is full of jam jars,varieties of bowls and plastic utensils (got free with somehousehold items).

20. You carry a stash of your own food whenever you travel (and travel means any car ride longer than 15 minutes).

21. You own a rice cooker or a pressure cooker.

22. You fight over who pays the dinner bill.

23. You live with your parents and you are 40 years old.(And they prefer it that way).

24. You don't use measuring cups when cooking.

25. You never learnt how to stand in a queue.

26. You can only travel if there are 5 persons at least to see you off or receive you whether you are travelling by bus, train or plane.

27. If she is NOT your daughter, you always take interest in knowing whose daughter has run with whose son and feel proud to spread it at the velocity of more than the speed of light.

28. You only make long distance calls after 11 p.m.

29. If you don't live at home, when your parents call, they ask if you've eaten, even if it's midnight.

30.You call an older person you never met before "uncle."

31. When your parents meet strangers and talk for a few minutes, you discover you're talking to a distant cousin.

32. Your parents don't realize phone connections to foreign countries have improved in the last two decades, and still scream at the top of their lungs when making foreign calls.

33. You have bed sheets on your sofas so as to keep them from getting dirty.

34. It's embarrassing if your wedding has less than 600 people.

35. All your Tupperware is stained with food color.

36. You have drinking glasses made of steel.

37. You have mastered the art of bargaining in shopping.

38. You have really enjoyed reading this post

(forwared email)

Saturday, February 24, 2007

అంగ్రేజీ తెలుగు తల్లి-కంఫర్టింగ్ ఏంజెల్

నేను ఆక్లాండ్ వచ్చిన కొత్తలో ఒక మిత్రుని ఇంట్లో చిన్న "గెట్టూగెదర్"(get-together) జరిగింది.మనలా తిండి,మర్యాదల విషయంలో "అతిథిదేవో భవ" టైప్ కాదనిపించింది ఈ గోరేగాళ్ళు.దానర్థం అతిథుల్ని గౌరవించరని కాదు గాని పెళ్ళి,చావులు విడిచిపెట్టి సుమారుగా మిగిలిన చిన్న చితకా గెట్టూగెదర్లన్నిట్లో "పాట్లక్"(potluck) లంచులు,డిన్నర్లే.ఈ పాట్లక్‌కి నా నలభీమపాకమూ తీసుకెళ్లాను.బాచిలర్ లైఫ్ పుణ్యమా అని గరిటె తిప్పడంలో చాలానే ప్రగతి సాధించాను.ఇక మన చికెన్ ఫ్రైడ్ రైస్ తిని గోరాలు,గోరీలు చాలా మంది లొట్టలేసుకొంటూ భుజం తట్టారు...ఆ గుంపులో ఒకరిద్దరు దేశీలు ఉన్నారు...వారు నావైపు చూసి చూడనట్లు అంజాన్ కొడుతున్నారు.ఎందుకొచ్చిన గొడవ అని నేనే వెళ్లి పరిచయం చేసుకొన్నాను...మాటల్లో తెలిసింది ఒకమ్మాయిది మన రాష్ట్రమే అని,ఇంకొకరు తమిళ తంబి,మరొకరిది దేశరాజధాని.వెంటనే నేను,అమ్మా తెలుగుతల్లీ! మీకు తెలుగొచ్చా అని (ఆంగ్లంలో)అడగటం పూర్తవకముందే,నాహ్! ఐ డోంట్ హావ్ ఎ క్లూ, బై ద వె, యువర్ డిష్ ఈజ్ టూ స్పైసీ టు ఈట్ అంది...చిన్నఫ్ఫుడు షర్ట్ తీయించి క్లాస్‌రూం బయట నిలబెట్టినంత అవమానమనిపించింది నాకు! ఇదంతా గమినిస్తున్న "కంఫర్టింగ్ ఏంజెల్"లా పక్కనున్న చక్కని తెల్ల పిల్ల నేను హర్టయ్యానని గమనించి,మన అంగ్రేజీ తెలుగు తల్లి పక్కకెళ్లాక నాతో,సం ఇండియన్స్ ఆర్ మోర్ బ్రిటీష్ దెన్ ద బ్రిటీష్...డోంట్ మైండ్ హర్ కామెంట్స్, ఇండీడ్ ఐ ఎంజాయ్డ్ యువర్ రిసైప్ అంది...అప్పటినుంచి నేను ఈ అమ్మాయిని కంఫర్టింగ్ ఏంజెల్ అని పిలవడం మొదలెట్టాను...ఆమె స్వాంతన మాటలకంటే ఖాళీ అయినా నేను తెచ్చిన బొచ్చ నాకు తృప్తినిచ్చింది...ఇంతకిందంతా ఎందుకు చెప్పానంటే వేరే ఏ విషయాల్లోనైనా ఎన్ని మాటలన్నా పర్వాలేదు కాని కష్టపడి చేసిన వంటకి వంకలు పెడితే యమా మండుద్ది-జ్యోతిగారినడగండి కావాలంటే! లేకపోతే మీ ఇంట్లో మీ అమ్మలను,అర్థాంగులను అడగండి.ఇక రెండో విషయం, వెన్ ఇన్ రోం,డు యాస్ రోమన్స్ డు అన్నంతమాత్రాన మన సాంప్రదాయాల్ని తుంగలో తొక్కాలని అర్థం కాదు.మూడోది, మంచి స్నేహాలకు సంస్కృతులు,అలవాట్లూ అడ్డు రావు!-మరి మీరేమంటారు?

పెద్దోళ్ళ ప్రతిష్ట

"నీతులు చెప్పటానికే బాగుంటాయి ...అవును నీతులు చెప్పటానికే పాటించమంటే ఎట్టా మనుగడ సాధించేది?ఎవరికైనా తెలిస్తే ఇరవైయయిదేళ్ళ నా రాజకీయ జీవితం ముగిసినట్లే.అడుక్కోడానికి చిప్పక్కూడా గతుండదు.ఈసారి మంత్రివర్గ విస్తరణలో నా పేరే ముందుంది.సీయంకి నమ్మిన బంటుగా ఉన్నా.ఈ విషయం బయటకి పొక్కితే గోవిందా గోవిందా...నా సంగతి సరే పార్టీనే గల్లంతవ్వొచ్చు.అయినా ఇప్పుడేమయిందని?మందులు సరిగా వాడితే కొన్నేళ్ళవరకు ఏ సమస్యా ఉండదు.మన పరువు ముఖ్యం.ఈ ఎదవనాకొడుక్కి ఇన్ని షోకులున్నాయని తెలిస్తే మీసం మొలవకముందే పెళ్ళి చేసేవాడ్ని.మన కర్మ ఇట్లా తగలడింది.ఏ కారు కిందో పడి చచ్చినా బాగుండేది...నాక్కొంచెం సింపతీ వొచ్చేది,మినిస్టర్ పొసిషన్‌కి మన అభ్యర్థిత్వం ఇంకా బలపడేది.ఈ కుక్కకి పెళ్ళి చేయాల్సిందే ఇప్పుడు.సడెన్‌గా పెళ్ళి రద్దైతే లేనిపోని పుకార్లు పుట్టుకొస్తాయి.దానికితోడు నేను మినిస్టర్ అవడానికి వియ్యంకుడి డబ్బూ చాలా ఖర్చు చేసాను.పెళ్ళి ఫిక్స్ అయ్యేవరకు నిమ్మకు నీరెత్తినట్లుండి ఇప్పుడు పేల్చాడు బాంబు.వీడు నాకు పుట్టకపోయినా బాగుండేది.ఒక్కగానొక్కడు ఎందుకూ కాకుండా పోయాడు",కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నా కఠినంగా అరుస్తున్నాడు యంయల్ఏ గుర్నాధం..."పెళ్ళి ఆపేయాల్సిందే కదా,చూస్తూ చూస్తూ ఆ పిల్ల బ్రతుకు అన్యాయం చేయలేం"అని ఏ పుష్కరానికో కొంచెం ధైర్యం తెచ్చుకొని మాట్లాడే భార్యకు సమాధానంగా!అదీ రెండు గంటల రాత్రప్పుడు...గుర్నాధం, అతని కొడుకూ, భార్యా మాత్రమే అక్కడున్నారు...ఎదో బ్రహ్మ రహస్యం అయినట్లు ఎవరైనా వింటున్నారేమో అని ప్రతి నిముషం కిటికీలోనుంచి బయటకి చూస్తున్నాడు గుర్నాధం.వచ్చే వారం ప్రసిద్ధ పారిశ్రామికవేత్త రామ్మోహన్‌గారి అమ్మాయితో తన సుపుత్రుడి పెళ్ళి.ఆ మరుసటి రోజే మంత్రివర్గ విస్తరణ.దాదాపు గుర్నాధం పేరు కరారైపోయింది.అన్నీ శుభాలే ఈ ఏడాదనుకొంటే గుర్నాధం కొడుకు తీరని శోకం మిగిల్చాడు...శోకంకన్నా గుర్నాధం పొసిషన్‌కి ఫుల్‌స్టాప్ పెట్టే ఘనకార్యం చేశాడు.ఆ మరుసటి రోజు ఒక ప్రభుత్వ పాటశాలలో మధ్యాహ్న భోజన పదకం ఆరంభించడానికి వెళ్ళాడు గుర్నాధం.ఐదు నిమిషాల ముందే చేరుకొన్న గుర్నాధం ప్రిన్సిపాల్ రూంలో కూర్చొన్నాడు .పక్కనే ఉన్న తరగతి గదిలో నుంచి ఒక పిల్లాడు పద్యం చదువుతున్నాడు,
"చదువది ఎంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు,గుణ సమ్యుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
బదునుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్యా భాస్కరా!"
అది విన్న గుర్నాధంకి చెంప పగలగొట్టించుకొన్నట్లనిపించింది.కొడుక్కోసం చేయాల్సిందంతా చేసాడు.అమెరికాలో చదివించాడు,ఖరీదైన కార్లు,తనతోపాటు అప్పుడప్పుడు ఒక పెగ్గు స్కాచ్,తన రేంజికి తగ్గ స్నేహాలే చెయ్యాలని సూచనలు,ఇంకా ఎన్నో విషయాల్లో దిద్దుబాట్లు...ఎదేమైన గుర్నాధం కొడుకుని కొడుకులా కాకుండా తన ఆస్తికి,స్టేటస్‌కి,రాజకీయ జీవితానికి వారసుడిగానే చూసాడు,దానికి తగినట్లు పెంచాడు.అది కొడుక్కీ అర్థమయ్యింది, అందుకే వాడికి అందరి పిల్లల్లా అబ్బాల్సిన మంచి బుద్ధులకంటే వక్ర బుద్ధులే ఎక్కువ అలవడ్డాయి.డబ్బూదస్కం ఉంటే ఎదైనా సాధ్యమే అన్న సూత్రం వాడి మనసులో బలంగా నాటుకొంది..దానికి కారణం గుర్నాధమే..ఇప్పటి వాడి పరిస్థితికీ గుర్నాధమే కారణం.ఈ దురాశలన్నీ నేర్పిన లౌక్యమనుకొంటా, విన్న పద్యాన్ని వెంటనే మర్చిపోయాడు..ప్రాయశ్చిత్తానికన్నా తనదైనశైలిలో పరిష్కారాలు ఆలోచిస్తున్నాడు గుర్నాధం, ఒక్క గండం గట్టెక్కాలి...పెళ్ళికి ముందు ఏదో ఫార్మాలిటీగా జరగాల్సిన వైద్య పరీక్షలు! ఈ మధ్య డబ్బున్నోళ్ళ పెళ్ళిలలో ఇది తప్పనిసరి అయ్యింది.ఏం ఫార్మాలిటీనో గాని గుర్నాధం మెడకి గుదిబండై కూర్చొంది.ఎదావిధిగా తమ సంరక్షణ్ హాస్పటల్కి ఈ పని అప్పగించాడు. పేరుకి తగ్గట్లుగానే సంరక్షణ్ హాస్పటల్ డబ్బున్నోల్లందరినీ సంరక్షిస్తుంటుంది.ఉదాహరణకి ఎవరైనా సెలబ్రిటీ లేక రాజకీయనాయకుడో ఎదైనా వివాదంలో ఇరుక్కొని చేయిదాటిపోయి ఇక బద్దకించిన చట్టానికి పని కలిపించినప్పుడు ఈ సంరక్షణ హాస్పటల్ ఆపన్న హస్తాన్ని అందిస్తొంది...సదరు ప్రముఖుడు సడెన్‌గా అనారోగ్యం పాలై ఈ హాస్పటల్లోనే చేర్తాడు, సంరక్షణ్ హాస్పటల్ వారు తమ హైలీ సొఫెస్టికేటెడ్ ఎక్విప్‌మెంట్‌తో సాధారణంగా రెండు మూడు రోజులు పట్టే పరీక్షలన్నీ తమదైన శైలిలో ఒకే ఒక గంటలో పూర్తి చేసి సదరు ఖరీదైన రోగి తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు,ఎవరూ కలవడానికి వీల్లేదు,ముఖ్యంగా పోలీసోళ్ళు అసలు ఆ ఛాయలకి కూడా రావటానికి వీల్లేదని,తమ పేషంటు కోలుకోవడానికి కనీసం పక్షం రోజులు పట్టొచ్చని రాత్రికి రాత్రే సర్టిఫై చేసేస్తారు!
పక్షం రోజులు కాదు కదా వారం తిరగ్గ ముందే ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య సదరు ప్రముఖుడు అమాయకుడు అని ఒక వార్తొస్తుంది, తరువాత బకాసురిడికన్నా పెద్ద నోరున్న మీడియా మూతి మూసుకొంటుంది, ఔరా! అనుకొన్న ప్రజలూ బిజీ అయిపోతారు!ఇంతటి ఘనచరిత్రున్న...సారి! ఘనసిత్రాలు జరిగే హాస్పటల్ అయితేనే తన కొడుకు పెళ్ళి నిరాటంకంగా అవుంతుంది అని అనుకొన్నదే తడవుగా సంరక్షణ్ యజమానికి(సంరక్షకుడు) ఎప్పుడూ ఫండు తీసుకొనే గుర్నాధం కోటి విలువచేసే కాగితపు బండిల్లిచ్చాడు.మెడికల్ రిపోర్టులు రావడం, అందులో గుర్నాధం కొడుక్కి లివరు సరిగా పనిచేయడంలేదని పేర్కొనడం గుర్నాధాన్ని నిప్పు తొక్కిన కోతిని చేసాయి.వెంటనే సంరక్షకునికి ఫోన్‌చేసి ఏమిటయ్యా నీ నిర్వాకం? మావాడి లివరుకేమయ్యిందని?అసలు రోగం విడిచి కొత్త రోగం అంటిచ్చావేంటి? అనికసురుకొన్నాడు.వెంటనే సంరక్షకుడు, మీరు రాజకీయ నాయకుడెట్టా అయ్యారండి?ఈ మాత్రం అర్థం చేసుకోలేకపోయారు.ఈ రిపోర్ట్ చూసి మీ వియ్యంకులవారెం చేస్తారు? నాకే ఫోన్ చేస్తాడు...సమస్య తీవ్రమైందా కాదా అని అడుగుతాడు...నేను, కొంచెం ప్రోబ్లమాటిక్కే! అయినా పర్వాలేదు...క్యూర్ అయిపోతుంది, అవసరమైతే ఆపరేషన్ చేయ్యొచ్చు...కాని అవసరం లేదు అని డబ్బుగుంజి మరీ భరోసా ఇస్తాను...అప్పుడతడు అసలనుమానించడానికి తావేలేదు..ఎలా ఉంది ఆలోచన?కాకపోతే మీరింకొన్ని పచ్చ నోట్లు పంపండి, పనులవే జరిగిపోతాయ్!,అని అన్నాడు .వోరి నీ తెలివి పాడుగాను, నువ్వు నోరు తెరవాలంటే ముందు చేతులు తడవాల్సిందే, అన్నాడు గుర్నాధం!భలేవారండీ మీరు...మీలాంటివారు ఫండిస్తేనే కదా మేము మెరుగైన సేవలందించేది...పోయినేడాది మీ సీయంగారు మేం పేదలకు చేసే ఉచిత సేవను దృష్టిలో పెట్టుకొని మా పనులు విస్తరింపజేసుకొమని భూమిచ్చారు.మేమూ దానికి స్పందించి ఎంతో మంది పేదలకి ఉచిత వైద్యం చేసి వారి బాధలనుండి విముక్తుల్ని చేస్తున్నాం! సగానికి సగం మందిని పార్ట్లు పీకి పైకి పంపుతొన్నాం...ఎప్పుడో ఒకసారి ఉచితంగా నికార్సైన ఆపరేషన్ చేసి విస్తృత మీడియా ప్రచారం కల్పించి మా దయాగుణాన్ని చాటుకొంటున్నాం..మరియ్యన్నీ చేయాలంటే మీలాంటోళ్ళు చేదోడువాదోడుగా ఉండాలికదా! ఎమంటారు? అన్నాడు సంరక్షకుడు ..అవుననక చస్తానా వీడి శాడిజానికి అని మనసులో అనుకొన్నాడు గుర్నాధం!అనుకొన్న ప్రకారమే వియ్యంకుడు రామ్మోహన్‌గారు ఫోన్ చేయడం,గుర్నాధం ఆయన కూతిరి వివరాలేమి అడక్కపోవడంతో అపోహలన్ని తొలగిపోయి, పెళ్ళి సజావుగా జరిగింది,గుర్నాధం మినిస్టర్‌గా అందలమెక్కాడు...కానీ మనసులో ఒక ఆలోచన రగులుతూనే వుంది,ఎయిడ్సొచ్చిన కొడుక్కి పెళ్ళైతే చేసాడు, ఇంకో పదేళ్ళలోనో,పదిహేనేళ్ళలోనో వాడు పోవడం కాయం!తనకి ఇంకో వారసుడెట్లా అని ఇంకో "మాంచి" ప్రణాళిక రూపొదించే ప్రయత్నంలో పడ్డాడు!

Friday, February 23, 2007

దేశాల పోకడలు

సంయుక్త రాష్ట్రాలు(యునైటెడ్ స్టేట్స్): బుష్షాయనమః-ఐ గెట్ వాట్ ఐ వాంట్ వెన్ ఐ వాంట్(నా గొంతెమ్మ కోర్కెలు తీర్చుకోవడానికి ఎమైనా చేస్తాను)

రష్యా:ప్రచ్ఛన్న యుద్ధం పునఃప్రారంభమా?

బ్రిటన్:చేతులు కాలాక ఆకులు పట్టుకొంటే ఏం లాభం?(ఇరాక్ నుంచి సైన్యం ఉపసంహరించే మీమాంసలో...)

ఇ.యు:గోతి కాడ నక్క

సౌదీ,ఈజిప్ట్,కువైట్:కడుపులో మంట

ఇరాక్,ఆఫ్గాన్:మంటలు ఆరేది ఎప్పుడంటా?

ఇరాన్:దమ్ముంటే కాస్కో!(మేకపోతు గాంభీర్యం)

ఇశ్రాయేల్:ఎవడి మాటా వినను (ఎవడైతే నాకేంటి?)

భారత్:కాశ్మీర్ "తల"నొప్పి-ఒంట్లో కులమత నొప్పి!

పాకిస్తాన్: "ఉగ్ర"వాదమా?-అన్నీ "ఉగ్ర"చేతలే (పెద్దన్నతో చెట్టాపట్టాల్ లేకపోతే పడాలి తంటాల్)

ఆస్ట్రేలియా: "బుష్"మానియా

చైనా:చూసి ఆనందించడంలో ఉన్న తృప్తే వేరు!(పాక్‌తో భారత్‌కు చెక్)

Thursday, February 22, 2007

ఆక్లాండ్‌లో భూకంపం!

కొంతసేపటి క్రితం (సుమారు రాత్రి 8 గం.లకు) స్నేహితుల ఆహ్వానంపై భోజనానికి వెళ్ళాను...నా ఫ్రెండ్ రూబేన్ బైలీ-కుక్ అతని భార్య రేచల్ పోటీ పడి వండారనుకొంటా.నన్నెప్పుడు పిలిచినా అలానే చేస్తారు-నా మీద వాళ్ళ వంటల ప్రయోగాల పుణ్యమా అని తెల్లోళ్ళ తిండి వేరైటీలన్నీ రుచిచూసాను.అదృష్టంకొద్ది ఇద్దరూ మంచి వొంటగాళ్ళే ఇంటి పేరుకి తగ్గట్టుగా!ఇక ఈ రాత్రి మెను-vichyssoise,roast chicken and veges,french lamb steaks,chops in parcel,salzburger nockerlin.....

ఇంక అసలు విషయం నేను తినే ప్లేట్‌లో నుంచి ఫోర్క్ కిందపడిది. వెంటనే రూబేన్ నవ్వుతూ మా వంటలు తినడమే కాదు ఎలా తినాలో కూడా నేర్చుకోవాలి అని వెటకారంగా అన్నాడు(మా మధ్య ఎప్పుడూ సరదాగా వాదాలు జరుగుతూనే ఉంటాయి).నా టైం రాకపోతుందా అని అలోచిస్తున్నంతలో మనోడి చేతిలోనుండి ప్లేటే పడిపోయింది...అందరం నవ్వెంతలో ఇల్లంతా ఒక రెండు మూడు క్షణాలు కుదిపేసినట్లయింది(9pm)...ముగ్గురం షాక్ తిన్నాం! ఏమయిందో అర్థమయ్యిది. తేరుకొని tv లో న్యూస్ చూసి చిన్న tremor అని confirm చేసుకొని పిచ్చాపాటి మాటల్లో మునిగిపోయాం! కష్టం మీద ముచ్చట్లు ముగించి ఇంటిదారి పట్టాను.ఒకవేళ పెద్ద భూకంపం వస్తే ఎం చేస్తామని రేచల్ వేసిన ప్రశ్న drive చేస్తున్న నన్ను అలోచనలో పడేసింది..మళ్ళీ కారు ఒకవైపు బలంగా గుంజినట్లనిపించి ఈ లోకంలోకొచ్చాను...ఇంటికొచ్చాక తెలిసింది కారు పక్కకి గుంజటంకాదు,11.25pm కి ఇంకోసారి కంపించిందని!ఎందుకైనా మంచిదని పడక గది మార్చాను ఎందుకంటే నేనున్న రూం అటకపైన చాలా బరువైన సామాన్లునాయి,ఒకవేళ పెద్ద భూకంపమేవొచ్చి ఇల్లు కూలి మీద పడితే ఎక్కడ చస్తానో అని ఒక క్షణం భయం వేసింది.భూకంపం అంటే ఎలా ఉంటుందా అని ఎప్పుడూ అనుకొనేవాడిని...చిన్నదో పెద్దదో ఈ రోజు ఆ అనుభవం కూడా అయ్యింది!బ్రతికుంటే మళ్ళీ రేపు బ్లాగుతాను...

నీ దరి చేరలేని బిడియంలో
నేనాలపించిన మౌనరాగం ప్రేమంటావా?
మన మధ్య ఈ దూరం
తెలియని అభిమానానికి కొలమానమంటావా?

Tuesday, February 20, 2007

నిరీక్షణ


ఆమనికై ఎదురు చూసే కోయిల,
ఐదు ఋతువులు ఆగలేనని ముందే కూయునా?
నెలరాజుకై నిరీక్షించే కలువ,
ఆమవాస్యాంతం వరకు వేగలేనని విరియునా?
వసంతమును మరచి కోయిల కూసినా
వెన్నెలను కాదని కలువలు విచ్చినా
నీ తోడుకై నేను యుగయుగాలు వేచియుంటా!
నీ మౌనమే నా శ్వాసగా అనుక్షణం ఎదురుచూస్తా!

కూటి కోసం....


















కూటి కోసం కోటి విద్యలంటే ఇదేనేమో!:ఆఫ్రికా అడవుల్లో "అనకొండా"ను పడుతున్న వేటగాళ్ళు.










surprising link

If you are used to copy PASSWORDS / Cr. Card #s / IMP Info in clip-board please read this carefully... This information might be shocking:

Just follow these steps here:-

1) Copy any text

2) Click the Link: http://www.friendlycanadian.com/applications/clipboard.htm

3) You will be able to see the text you copied on the Screen.

NOTE: Please do not keep sensitive data in the clipboard while surfing the web. It is a single line code to extract the text stored in the clipboard to steal your sensitive information.


(forwarded email)

Monday, February 19, 2007

వృద్ద దంపతుల సంభాషణ- జోక్

భర్త: నీకంటే ముందు నేను చనిపోతే ఏం చేస్తావ్?
భార్య:ఇద్దరు ముగ్గురు విదవరాళ్ళతో కలిసి ఒక ఇల్లద్దెకు తీసుకొని ఉంటాను.ఒకవేళ మీకంటే ముందు నేను చనిపోతే ఏం చేస్తారు?
భర్త:నేనూ అదే పని చేస్తాను!

బతుకు బండి

ఎన్నో ఆశలు మరెన్నో ఊసులు...
కాల చక్రంలో కరిగిపోయాయి
మనసొక విశ్వంలా
అనంతమైన ఆలోచనలతో-
ఫలించేవి కొన్నయితే
మరికొన్ని విఫలం!
అయినా ఆగదుగా బ్రతుకు బండి!
రాళ్ళు-రప్పలు నున్నని దారులు
ముళ్ళపొదలు పూల బాటలు
అన్నీ దాటుకొంటూ వెళ్ళాల్సిందే!
అన్నీ ఉన్నా అందరు ఉన్నా
ఒంటరితనం వెంటాడిన రోజులు...
ఊహలన్ని కరిగి ఎడారిలా వెక్కిరిస్తుంటే
ఎండిన బావిలా కన్నీరింకిన కళ్ళలో
ఇంకా ఎదో మిగిలింది...
చీకటి కమ్మిన రేపటిపై చావని ఆశ!
ఎన్నో తరాలకు అర్థంకాని "స్పింక్స్" మర్మం,
ఎవ్వరూ చేరలేని "మారియానా" అగాదం,
నాలోనే ఉన్నాయేమో!
తలకు మించినవాటిని చేదించాలని
మానవజాతికుండే అపేక్ష నాలోనూ ఉంది...
అందుకే అట్టడుగు నుంచి లేచి వొస్తాను
ఎన్నో ఆశలు మరెన్నో ఊసులు
కాలచక్రంలో కొత్తగ పుట్టగ!

Friday, February 16, 2007

ఆశ

పువ్వుల పరిమళమును పసిగట్టి
మకరందమును గ్రోల పరుగులిడే తూనీగలా...

పెళ్ళి

ఎడారిలో కూడా పూలు పూస్తాయని తెలిసింది...
నా జీవితంలోకి నువ్వొచాక!

శిశిరాంతం

ఈదురుగాలికి యాడనుంచో ఎగురుకుంటూ వొచ్చి
నా మోమును తాకింది,
సగమెండిన ఒక పండుటాకు!

నీ తోడుకై

గరళమును సహితం సరళంగ గ్రోలెద
మరణమును నా ఆభరణముగ కోరెద
మరు జన్మకైనా నా తోడుగనుందువా?

సాయం సంధ్య

మెల్ల మెల్లగా మాయమవుతున్న నీ చిరునవ్వులా
ముంగిట్లో సద్దుమణుగుతున్న చిన్నారుల అల్లరిలా
నింగిలో కనుమరుగవుతున్న కొంగల వరుసల్లా

Thursday, February 15, 2007

ప్రాణసఖి

నాకై నా ప్రాణసఖి ఉనికి నిర్వ్యాజ్యమా?
నా సర్వం నీవేయని నేనాధారపడే తను ఉందా?
తను అరుణోదయాంశువులలా
నా జీవితంలో ఉదయించునా?
ప్రేమనుగన్నదానిలా నా స్నేహమే మిన్నగా
నాకై తపించే తను ఉందా?
కలలో జనించే తన నవ్వుల సవ్వడులే
నాలో పదిలంగా నిలువగ
విరిసిన నా హాసంలో ఉన్న వెలుగు
తన అస్థిత్వంలోనే సంపూర్ణమవునని
నేనెరిగి రగిలే జ్వాలావేశములా నాలో ప్రేమ
తనకై విశ్వాంతరాలలో గోచరించగ,
ఉనికేలేని ఊహలకే నాలో ఇంత ప్రేమాయని
ననుచూసి వెక్కిరించిన చుక్కలు-
ఎన్నో ఒడిదొడుకుల జీవనయానంలో
నను వలచిన తోడకరుంటే
ముసిరిన నిస్తేజాంధకారములను
రేపటి ఆశల వెలుగులను గుప్పెటపట్టి తరిమెదననని,
నడిసంద్రమున నావకు చుకానిలా తనుంటే
ఎగిసిపడే అలలలో సహితం అదుపుతప్పనని,
కనిన కలలు నాలో నింపింపిన నమ్మకపు జాడలు
నా నిరీక్షణలో చూసి నివ్వేరపోయాయి!
తనను కాంచువరకు వెలుగులీను సిద్దెలా
ప్రేమ కలశము నిండుకొనగా వేచియుందును!
తను వస్తుంది...ప్రాణ సఖి! నా ప్రాణసఖి!
విశ్వమంతా కలగలిసినా వెలకట్టలేని ప్రేమతో....

Friday, February 09, 2007

ఆ కల!

ఎన్నో నూతన క్షితిజ రేకలు!
ఇన్ని దిశలా?, అని మనసు అబ్బురపడేలా!
రవ్వలహారం తెగి చెల్లాచెదురుగా పడిన
వజ్రాల తళుక్కుల్లా మిణుకు మిణుకు మంటూ
వెండివెలుగులీనుతున్న తారలు!
ఆశల తలుపు తెరుచుకొనగ ఆకసమును తేరి చూస్తూ
గతించిన స్వప్నానికై కలువరిస్తుంటే
అదురుతున్న కనురెప్పలు నింపాదిగ కలిశాయి
నయనాలలో నాట్యమాడుతున్న ఆ కలను బంధించాయి
కొత్త ఆశలు రేపుతున్న మరిచిన ఆ పాత కలకై
నాలో కడలి అలలలా ఒకింత కలువరింత!
అయినా జ్ఞప్తికి రాదెంతకీ ఊరించే ఆ కల
చెలి ఊసుల చిలిపి సందేశాలా?
కన్నవారి మమతానురాగాలా?
జలములకవతలనుండి నా క్షేమం కోరే
శ్రేయోభిలాషుల ప్రార్థనలా?
నా స్నేహకుసుమాల సువాసనలా?\
ఆనాటి వీడ్కోలులోని ప్రేమ కన్నీళ్ళా?
తిరిగిరాని బాల్యపు మధుర గడియలా?
నన్నూరించే ఊసులేవో దాగెను ఆ కలలో
ఉల్లసింపజేసెను నను ఆనాటి విభావరిలో
ఆ సాయంసంధ్యలో నింగిలో పరుచుకున్న ప్రశాంతతలో
ఎన్నో ఆలోచనలతో కలకలం రేపెను ఆ కల నా మదిలో!

తెలుగు బ్లాగర్లు

మన తెలుగు బ్లాగర్లు వివిధ రకాలు
జ్ఞానపు ఊటలు కొందరి బ్లాగులు
విజ్ఞానం బ్లాగ్జల్లే కొందరు బాబులు
ఆవేశం,అలోచన సమపాళ్ళలో జోడిస్తారు
అక్షరవిన్యాసం చేసి హాస్యం పండిస్తారు
వ్యాసాలు రాసి మది గెలిచేవారు
వీడియో డౌన్‌లోడ్‌లు అందించేవారు
కొదవేమీకాదు 'చిత్ర' విచిత్రకారులు
వార్తల నిస్పక్షపాత విశ్లేషకులు
ఒకరు ఎలా చేయాలో వివరిస్తారు
నోరూరుంచే రుచికరమైన వంటకాలు
మరొకరు కురిపిస్తారు కవితల చిరుజల్లు
మనసును హత్తుకొనే కథకులు కొందరు
ప్రగతిని కోరే ఎన్నో చర్చలు చేస్తారు
సంస్కారవంతులు మన తెలుగు బ్లాగర్లు
ఎన్నెన్నో సువాసనలు మన తెలుగు బ్లాగులు వెదజల్లు
అన్నీటినీ మేఖల్లా కూడలి,తేనెగూడు అందించే హరివిళ్ళు!
వైవిధ్యం,విషయపుష్టి వీరి సొంతం...జోహార్లు!
ఇక బ్లాగారంభశూరులు మరి ఎందరు?
బద్దకమొదిలి బ్లాగండి మీరందరూ!!
బ్లాగుటకు లేఖిని,క్విల్‌పాడ్‌లు ఉన్నాయి బ్రదరు!!!

Thursday, February 08, 2007

లాటరీ-జోకు

భర్త: ఓయె డార్లింగ్! వింటున్నావా! త్వరగా సామాన్లు సర్దుకో, నాకు పది కోట్ల లాటరీ తగిలింది!
భార్య: ఎక్కడికెల్దాం? స్విట్జర్లాండా లేక ఆఫ్రికన్ సఫారినా లేక వరల్డ్ టూరా?
భర్త: చాల్లే తమాషా! నాకెం తెలుసు? నీ ఇష్టమొచ్చిన చోటికి పో!

Amazing 3D Sidewalk Art Photos

These unbelievable photos are chalk drawings done by Julian Beever and Kurt Wenner. Both Julian and Kurt have different styles to create an amazing 3D illusion.



who is real?


coke- enough for life!

can't escape from batman!



తుఫాను

అలల ఆటుపోట్లకు ఆశలు సన్నగిల్లి
నావలు తీరంవైపు తిప్పుకొని లంగర్లువేసి
ఒట్టి చేతుల్తో తమ పూరిళ్ళు చేరారు బెస్తలు
దివి బద్దలయ్యిందేమో అన్నట్లుగా కుండపోత
ఉరుములు మెరుపులతో గగనం గర్జిస్తుంటే
నాతో తగవా నీకు అన్నట్లు సముద్రుని ఘోష
కురుస్తున్న పాక కింద మూలకి కూర్చొని
ఎదురుగున్న గుంటలో బిర బిర ఈదులాడుతున్న
బాతుల గుంపుని తదేకంగా చూస్తొంది అవ్వ!
కొంగు కప్పుకొని చినుకులనుండి తల పదిలమైంది..
కాని రగులుతున్న ఆకలిని ఎట్ల చల్లార్చేది,
సమర్తాడిన పిల్లని ఒకింటిదాన్ని ఎప్పుడుచేసేది,
కడలి పగబట్టిందేమో,దాని మీద పడి
బతుకుతున్నమని మేమంటే తెగ అలుసేమో..
ఆ బాతుకున్న స్వేచ్చ తమ బతుకులకెప్పుడో..
అని ఆలోచనల తుఫానులో అతలాకుతలమవుతుంది!

Wednesday, February 07, 2007

ఇది నిజమైతే...


తేది: మార్చ్ 2015
భాగ్యనగరంలో ఒక కిరాణా సరుకుల షాపు యజమాని ఇంట్లో జరిగిన చిన్న సంభాషణ


"ఎంట్రా గోల? త్వరగా రెడీ అవ్వు,ఏడు గంట్ల కల్ల షాపు తెరవాలి" అని విసురుగా అరుస్తున్న వెంకట రావ్‌కి, "నాన్న! నా ఫ్రెండ్ చాలా కష్టాల్లో ఉన్నాడు. పదిహేనేళ్ళనుండి వారి సొంత పెట్రోల్ పంప్‌లో ఎకౌంట్స్ చూసుకొంటున్నాడు.చాలా తెలివైనవాడు. కాని ఈ మధ్యే వాళ్ళ నాన్న అప్పుల్లో కూరుకుపోయి, పెట్రోలు పంపుకి కూడా కనీస భేరం రాక ఆత్మహత్య చేసుకొన్నారు. అదే! సుమారు ఒక పది పన్నెండేళ్ళ క్రితం చంద్రబాబు, వైయస్‌ల పాలనలో దిక్కులేక ఆత్మహత్యలు చేసుకొన్న రైతులు, గీత కార్మికుల్లాంటి పరిస్థితి. మన దెగ్గర ఎదైనా చిన్న గుమస్తా ఉద్యోగం ఇవ్వమని ప్రాధేయపడుతున్నాడు" వినయంగా వివరించాడు కొడుకు. సరే తప్పుతుందా అని,"ఈ ప్రభుత్వాలు ఎప్పుడూ అంతే, కష్టాల్లో ఉన్న ఏ పరిశ్రమనీ ఆదుకోవు. కాని ఎన్నికలముందు మాత్రం ఆల్లాద్దిన్ భూతంలా అన్నీ సమకూరుస్తామని వాగ్దానాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తారు.కుంచించిన గాలి ఇంధనంవొచ్చాక ఈ పెట్రోల్‌బంకుల యజమానుల పరిస్థితి దయనీయంగా తయారయ్యింది. పదేళ్ళక్రితం కుభేరులు నేడు వీరి గోడు వినేవాడు లేడు. ఓడలు బళ్ళవుతాయి బళ్ళు ఓడలవుతాయంటే ఇదేనేమో!" తనలో తను గొణుకొన్నాడు.


(రైతుల ఆత్మహత్యలను, మరింకెవరినైనాకాని కించపరిచే ఉద్దేశము ఏమాత్రం లేదు. కేవలం ఈనాడులో వొచ్చిన వార్తతో కలిగిన ఆలోచన-http://www.eenadu.net/story.asp?qry1=3&reccount=28)

వెదవ- క్లాస్ రూం జోకు

టీచర్: ఈ గదిలో ఎవరైనా వెదవలుంటే లేచి నిలబడండి

చాలాసేపటికి ఎప్పుడూ మొహమాటపడే రవి లేచి నిల్చొన్నాడు
టీచర్: నువ్వెందుకు వెదవ్వనుకొంటున్నావో చెప్పు?

రవి: నేను కాదు టీచర్, ఆ ప్రశ్న అడిగినప్పటినుంచి మీరే నిల్చొనుంటే బాగుండదని ఎదో మీకు తోడుగా...

భారత్ వెలుగుతొందా?

రాజు: ఏరా సుబ్బు! ఏంటి చైనా విశేషాలు?
సుబ్బు: nothing much...what 'bout you?

రాజు: బోడి నాలుగేళ్ళు చైనాలో ఉండి ఎదవింగ్లీషొకటి.తిన్నగా తెలుగులో మాట్లాడు. ఇంక నయం ఏ USAనో, UKనో వెళ్ళుంటే తెలుగుని కూడా సినిమా హీరోయిన్లలా వచ్చి రానట్లు కులుకుతూ మాట్లాడేవాడివేమో!
సుబ్బు: సారీరా మామా! చైనావోళ్ళమీద ఎమైనా కొంచెం చలాయించాలంటే ఇదొక్కటే ఆయుధం. ఇంకెందులోనూ వాళ్ళతో సరితూగలేము.

రాజు: అదేంట్రా? "India shining" అని ఆ రోజుల్లో NDA ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసింది. అంతే కాదు మన దేశం ప్రగతి పధంలో దూసుకుపోతుందనడానికి ఎన్నో ఋజువులూ చూపింది- పెరిగిన GDP, ఉరకలేస్తున్న share market, వందల బిలియన్లలో విదేశీ మారక నిలువలు ఇలా ఇంకెన్నో! భారతదేశం ఒక ఆర్థిక, రాజకీయ, సైనిక శక్తిగా ప్రపంచంలో తన ప్రాభల్యాన్ని పెంచుకొనే రోజు ఎంతో దూరంలో లేదు అని ఎందరో మేధావులు వక్కానించి చెబుతున్నారు. చైనాతో దీటుగా పరుగు తీస్తున్నాం. చైనా కమ్యూనిస్టు దేశమవడం వల్ల మున్ముందు మనకే ఎక్కువవకాశాలున్నట్లు చెబుతున్నారు. నువ్వేంట్రా మనం వాళ్ళతో సాటిరామంటున్నావ్?
సుబ్బు: నువ్వన్నవి నిజాలే కాని పూర్తిగా కాదు. అభివృద్ది ఉంది కాని ఢంకా భజాయించినంత కాదు. అలాగే చైనాతో పోటి సంగతి దేవుడెరుగు, వారు సాధించిన సాధిస్తున్న అభివృద్దిలో నాలుగోవంతు కూడా లేదు. మన ఆర్థిక విశ్లేషకులందరు (economic pundits) సరిగానే విశ్లేషిస్తున్నారంటే పొరబాటు. "అంతా బావుంది" అదే "feel good factor" అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి- విశ్లేషించువాడు రాజకీయవేత్త, కేవలం అది తెలిపెడివాడు మాత్రమే ఈ ఆర్థిక విశ్లేషకుడు. ఇలా అని అందరినీ blame చెయ్యట్లేదు.అంతా బావుంది అనేవారు ప్రభుత్వ రంగాల్లోనుండి ప్రైవేటు రంగాలవరకు అన్నీట్లో పేరుకుపోయిన అవినీతి, high inflation, infirm infrastructure, బలహీనమైన చట్టాలు,మనుషుల మధ్య తరగని అగాదంలా పెరిగిపోతున్న ఆర్థిక స్థితిగతులు ఇవ్వన్నీ పరిగణలోకి తీసుకోరు.ఇంకొన్నాళ్ళైతే "గరీబి హటావో" కాదు "గరీబొంకొ హటావో" అని నినాదం పుట్టుకొచ్చినా పుట్టుకురావొచ్చు.

రాజు: గరీబి అంటే గుర్తొచ్చింది. నువ్వన్నట్లు భారతదేశం కాదు రా, భారతదేశాలు అనాలి- ఒకటి "భారత్ వెలుగుతోంది" అనే దేశం, ఇంకొకటి-ఈ వెలుగు నినాదం పుట్టిన ఏడాదే ఉన్న పరిస్థితులు- 12.5 లక్షల ముక్కుపచ్చలారని సంవత్సరం వయసులోపు పిల్లలు నిండు నూరేళ్ళూ ముగించారు, 5 కోట్లమంది పిల్లలు బడి మానేసారు, సుమారు సగం మంది భావి భారత పౌరులు పౌష్టికాహారలోపం ఉన్నవారే- అని తేలిపే ఆకలి,నిస్పృహ,నిరాశల భారతావని.

సుబ్బు: కాని స్వతంత్రంలో కుతంత్రం ఏమిటంటే, ప్రచారం వెలిగిపోయే భారత దేశానికి, గ్రహచారం పేద భారత దేశానికి.
రాజు: దీనికి పరిష్కారమెలా రా?

సుబ్బు:సమస్యకి పరిష్కారం ఎమంత కష్టతరమైంది కాదు.ఒక ఇంగ్లీష్ వాక్యంతో సుళువు గా చెబుతా!"the problem should be addressed at the grassroots",grassroots అంటే literalగా grassroots‌యే- అట్టడుగు స్థాయి సమస్యలు పరిష్కరించాలి.అంటే పేదల కొరకు ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి ప్రణాళిక వారికి 100శాతం చేరేటట్లు చూడాలి. దీనికి కావల్సింది fancy captions కాదు, చిత్తశుద్ధి! సంస్కృతి గురించి గొప్పలు చెప్పడం కాదు, ఎదుటి మనిషికి చేయూతనిచ్చే సంస్కారాన్ని అలవర్చుకోవాలి.

రాజు: ఇంగ్లీషులో చెప్పినా బాగా చెప్పావురా!

Tuesday, February 06, 2007

అనుభూతి

ముసురు

చూరు క్రిందకు చేరిన పిల్లల కోడి
రెక్కల మాటున పిల్లల అల్లరి
నీటి చినుకులకు పోటీగా..

మరణం

చదరంగపు గడులనుంచి తీసివేయబడ్డాక
అన్ని పావులూ సమానమే!

పట్టు

గడ్డిపరక చివరన వాలేందుకు ఒక తుమ్మెద నిర్విరామ ప్రయత్నం
దాని అగచాట్లు చూడలేకఅస్తమించిన సూర్యుడు!

తుఫానుకి ముందు

కొండ అంచున ఒంటరి వృక్షం
దానిపై బద్దకంగా తేలుతూనల్లని మేఘాలు!
నా శ్వాసలు వినపడేంత నిశ్శబ్దం!

శీతాకాలం

రాత్రి కురిసిన మంచు నా అద్దపు కిటికీపై చేరి
ఉదయభానుని కిరణాలను అడ్డుకునే ప్రయత్నంలో
నీరుగారుతుంది!

చెదరిన కలలు

ఎండాకాలంలోని గడ్డిపరకల్లా
పసిపాప నవ్వులో తెలియని అర్థంలా...

Monday, February 05, 2007

చురకలు-చురకత్తులు

పెరుగుతున్న "పాపు"లేషన్
అంతే వేగంగా డిఫారెస్టేషన్
మరెందుకుండదు స్టార్వేషన్?
----------------------

కొందరి రాతలు,కోతలు ఘనం
చేతలు శూన్యం!
----------------------

ఆవేశానికన్నా
ఆలోచన మిన్న!
----------------------

ఆశించావా అశాంతి!
త్యజించావా శాంతి!!
చాలనుకొన్నావా మనఃశ్శాంతి!!!
-----------------------

కొందరు వెండితెరపై, వేదికలపై హీరోలు
నిజ జీవితాల్లో జీరోలు
-----------------------

రేపు రేపు అంటూ వాయిదా వేసావా
చివరకు ఏ ఫయిదా ఉండదు
------------------------

జీవితం ఒక పరుగుపందెం!
ఫస్టొచ్చావా లేదా అనేది ముఖ్యంకాదు
నీ శక్తియుక్తులన్నీ పెట్టి
పరుగు తుదముట్టించావో లేదో ముఖ్యం!
-------------------------

చుక్కల్లే లక్షంగా సాగు
కనీసం నింగిన నిలుస్తావు!
------------------------

చేతగానివాడికి సవాలక్ష కారణాలు
చేసుకుపోయేవాడికి ఒకే ఒక్క కారణం
------------------------

చెప్పేదాన్ని పాటించడంకంటే
పాటించేదాన్ని చెప్పు!
------------------------

నాలుక రొండచుల ఖడ్గమంటిది
నివురుగప్పిన నిప్పులాంటిది
నిర్లక్ష్యంగా వినియోగించకు
-----------------------

నీలో సత్తా వుంది
నీదొక రోజొస్తుంది
నమ్మకమనే విత్తనాన్ని
నిరాశనే తెగులుతో
పాడుచేసుకోకు
నిరీక్షణ నీరుపోసి
పట్టుదల ఎరువుతో
నిత్యం కృషిచేయి
నీలో సత్తా వుంది
నీదొక రోజొస్తుంది!
---------------------

Saturday, February 03, 2007

జ్ఞాపకం


రవి తొలి ఛవి స్పృశించగ,
ప్రభాతమున విపినమున నసివారుచుండగ
ప్రభాతాంశువంటి నీ జ్ఞాపకము,
మన యడబాటు నయన ద్వయ
విప్రయోగమంటిదని యదనసి దూసిన
విధంబున నను బాధించగ
నుప్పొంగిన ఆశ్రువులు ఇరుదారలై
హనువులబారి ఏకమయి
ఊర్ద్వమునకెగయుచున్న తుషారమువలె
మదికుపశమనమునిచ్చెన్...
ఏలయనగా ఏకమైన ఆశ్రువులవలె
నీ జ్ఞాపకము నాలో,నే నీ జ్ఞాపకములో
నిత్యమిమిడిపోతిమని వివరించెన్!

(కొంచం సరళంగా)
సూర్యుని తొలి కిరణం నను తాకగ,
వేకువనే అడవిలో నింపాదిగా నడుస్తూంటే
ఉదయకాంతివంటి నీ జ్ఞాపకము,
రొండుకళ్ళూ ఏవిధంగా ఎన్నటికీ కలువవో
అలాంటిది మన ఎడబాటని తెలుపగ
హృదయములో కత్తి దూసినంత బాధ కలిగి
ఉబికిన కన్నీరు చెక్కిళ్ళపై రెండు దారలుగాపారి
ఏకమయి పైకెగస్తున్న పొగమంచులా
మనసునకు నెమ్మదినిచ్చెను.....
ఎలాగనగా ఏకమైన కన్నీటివలె
నీ జ్ఞాపకములో నేను, నాలో నీ జ్ఞాపకము
ఎప్పటికీ కలిసిపోయామని తెలిపినవి!

Friday, February 02, 2007

ఆలకాపరి

నల్ల రేగడి నేల సెగల్లు చిమ్ముతుంటే
ఎండిన అలచందల బరికెనందుకొని
వేగంగా విసురుతున్న ఆలకాపరి అదిలింపేమో...
బరికనుండొస్తున్న జివ్వుమనే ఈల
వడగాల్పులను తరమగ బీటలువారిన
ఏటి గట్టుపై ఎండిన నిరవంజి చెట్టు కొమ్మ
విరిగిపడి దుమ్ము రేపింది!
ఆవుల అరుపులకన్నా బిగ్గరగా నవ్వాడు కాపరి...
రేగిన దుమ్ముని చూసో,మోసపు ఎండమావులను చూసో...
లేక తాపాన్ని ఎగతాళి చేస్తూ నవ్వాడో?

భారమైన రేయి!


నెలరాజు నను చూసి
కొబ్బరాకుల చాటున దాగొనగా...
తను వస్తాడు తప్పక చూడగ నన్ను
అనుకొంటూ మదిలో మురిపెంగా నవ్వాను
కొబ్బరాకుల రెపపెపలు నీటిపై చిరు అలలు
నాకేదో తెలిపాయి నాలో కలవరం రెపాయి

యాడనుంచో వొచ్చింది చల్లని పిల్ల తెమ్మెర
కబురొకటి తెచ్చింది నా గుండెలవిసేలా

కారు మబ్బులు కమ్మునని
కుంభవృష్టి కురుయునని
నా శశిని అవి మరుగుచేయునని
ఈ రాతిరి తననిక నే చూడనని తెలిసి...
యదను బాధ రగిలెను!

సాయంత్రం

ఆకులు రాలిన చెట్టుపై
ఒంటరి కాకి కదలక కూర్చొంది
అలసిపోయిన సూర్యుడు
కొండల చాటున చేరుతుండగ
ముసురుతున్న మసక చీకటికి
చోటివ్వడానికనుకొంటా...
తన నిరీక్షణ నిశి రాకకోసమేనని
కావు కావు మంటూ కలవకనే
ఎటో ఎగిరిపోయింది!

వానజల్లు

నీటి చుక్కల దాటికి నేల రాలిన పువ్వొకటి
వాన నీటి కాలువ ప్రవాహంలో
తోడులేక ఒంటరిగా నసివారెనె!

సౌరభాల సొంపులు ఇంపైన రంగులు
కలగలిసిన పువ్వది నీటి సుడుల్లో చిక్కినది
వానజల్లులో ఒళ్ళంతా తడిసి ముద్దైయ్యింది!

విప్పారిన అందంతో నిత్యం నిలవాలనుకొంది
తడిసిన ఆనందానా తల్లి కొమ్మను వీడింది
నీటిలో తేలుతూ తలలో ఒక పూట శోభిస్తే చాలనుకొంది!

నీటి చుక్కల దాటికి నేల రాలిన పువ్వొకటి
వాన నీటి కాలువ ప్రవాహంలో
తోడులేక ఒంటరిగా నసివారెనె!

నీ నవ్వు

నీ ఒక్క నవ్వులో ఎన్ని భావాలో...
ఇంద్రధనుస్సు రంగుల్లా
ఆరు ఋతువుల్లా
సెలయేటి ప్రవాహంలా!

అనంతమైన ఆలోచనలతో నేను...
నీ నవ్వుల రంగుల్లో తడుస్తూ
ఋతువులంటి నీ నవ్వుల గమనంలో చరిస్తూ
ప్రవాహమంటి నీ నవ్వుల తెరల అడుగున
గులకరాళ్ళలా నిశ్చలంగా నిన్నే చూస్తూ
క్షణాలు యుగాలుగా నా వీక్షణం నీపై
యుగాలు క్షణాలుగా నా హృదయం నీకై
నిరీక్షిస్తాను!... నీ నవ్వు కోసం!!

Monday, January 29, 2007

కలవరం

చావైనా బ్రతుకైనా నీ జత వీడనని, శ్వాసల బాసలు మూగవోయేదాకా స్వార్థపు మలినం అంటించుకోనని, నా వారని నీవారని వ్యత్యాసమెరుగక సాదరముగనుండెదనని, మరణం మనలను ఎడబాపినా మరో మగువకు నాతో నాలో స్థానం లేదని, మరు జన్మకు సహితం నీ మొగుడుగనుంటానని…యవల చేల్లో ఆనాడు చేసిన బాసలు యద మందిరం దద్ధరిల్లేలా ప్రతిధ్వనిస్తున్నాయి- దిగ్గున లేచాడు శ్రీధర్! యముకలు కొరికే చలిలో సైతం చెమటలో తడిసి ముద్దైనాడు…”వేడి వేడి కాఫీ తీసుకోండి, మళ్ళీ ఏమైనా కలగన్నారా? ఈ రోజు మన ప్రోగ్రాం గుర్తుందికదా? వేన్నీళ్ళు పెట్టాను కాఫీ తాగి స్నానంచేసిరండి, టిఫిన్ చేద్దురుగాని.. .ఊ త్వరగా! నేనీలోపు వ్యాక్యూం చేసి బట్టలు వాషింగ్ మెషిన్ లో పడేసివొస్తాను సరేనా?” గల గలా మాట్లాడుతున్న మహాలక్ష్మిని చూస్తూ కలల ప్రభావంనుంచి ఇంకా పూర్తిగా కోలుకోని శ్రీధర్ సరే అన్నట్లు కాఫీ తాగుతూ మెల్లగా తలాడించాడు.ఈ మధ్య శ్రీధర్‌కి టెన్షనెక్కువైపోయింది.

ఏడెనిమిదేళ్ళక్రితం టీనేజి శ్రీధర్ వేరు ఇప్పటి శ్రీధర్ వేరు. డిగ్రీ చదివేరోజుల్లో శ్రీధర్ అంటే ఎందరికో క్రేజ్ ఉండేది. చదువులో, ఆటపాటల్లోనే కాదు గొడవల్లోను ముందుండేవాడు.
కెమిస్ట్రీ లెక్చరర్ సస్పెండ్ అవడానికి, తన సీనియర్ ఒకడు కాలేజ్ విడిచి వెళ్ళడానికి కారణం శ్రీధరే. ఇంకా ఎందరికో కొరకరాని కొయ్యలా ఉండేవాడు. డబ్బులు తీసుకొని ల్యాబ్ ఎగ్జాంస్ పాస్ చేస్తున్నాడని కెమిస్ట్రీ లెక్చరర్‌ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాడు, తన సీనియర్ ఒకడు ర్యాగింగ్ చేస్తున్నాడని రిపోర్ట్ చేసి వాడ్ని సస్పెండ్ చేయించాడు…దానికి ఇగో దెబ్బతిని వాడు కాలేజే మానేసి శ్రీధర్ అంతుచూస్తానని ముక్కుపగలగొట్టించుకొని బ్రతుకుజీవుడా అనుకొంటూ పారిపోయాడు. కాలేజిలోనే కాదు ఊర్లోను అంతే. ఒకసారి దిగాలుగా కూర్చున్న అమ్మని అడిగాడు ‘ఏంటి సంగతి?’ అని. “నీకెందుకురా? గమ్మున చదువుకో, లేపోతే నీ పని చూసుకో. అన్నీ వివరాలు కావాలి.” అని కసురుకున్న అమ్మకి విసుగుపుట్టి విషయంచెప్పేవరకు అడుగుతూనేవున్నాడు. చివరికి చెప్పింది ఆఫీస్‌లో నాన్నని కొందరు విసిగిస్తున్నారని. ఎవరో కాంట్రాక్టర్ ఫైల్ మీద సంతకం పెట్టమని లంచమిచ్చి బెదిరిస్తూ వొత్తిడి తెస్తున్నారట. తోటి ఉద్యోగస్తులు కూడా సంతకం పెట్టొచ్చుకదా, నువ్వేం లంచమడగట్లేదు వాడే ఇష్టపూర్వకంగా ఇస్తానంటుంటే సత్యహరిశ్చంద్రుడిలా ఈ చాదస్తమేంటి రాజారావ్ అని ఆకాంట్రాక్టర్కే వత్తాసు పలుకుతున్నారట.ఏంచెయ్యాలో పాలుపోవట్లేదు, వేరే సెక్షన్‌కి మారడానికి నాన్న ప్రయత్నిస్తున్నారు అని చెప్పింది.శ్రీధర్ అంతావిని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
ఆ మరుసటి రోజు ఆఫీస్‌నుండొస్తున్న రాజారావ్ గడపలో కాలు పెట్టకముందే మొఖం చాటంత చేసుకొని భార్య సరోజతో,”ఆ కాంట్రాక్టరు ఈ రోజు నా దగ్గరకొచ్చి క్షమాపణ కోరాడు.నువ్వు కూడ అప్పుడప్పుడు ఏంటండీ మరి చాదస్తం అని దెప్పిపొడిచేదానివి, నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా సమస్యలను అధిగమిస్తాము. అంతే కాదు ఆ కాంట్రాక్టరి కొడుకు హైదరాబాదులోనే చదువుతున్నాడట.ఏమైనా సమస్యుంటే మన శ్రీధర్ సహాయం తీసుకోవొచ్చా అని అడిగాడు.మంచితనంతో ఎవరినైనా మార్చవొచ్చు.మొన్నటివరకు బెదిరించిన కాంట్రాక్టర్ని చూడు నేడు తప్పు తెలుసుకోవడమే కాదు తన కొడుక్కోసం మన సహాయం కూడా కోరుతున్నాడు…” అని ఏకబిగిన లెక్చరిస్తున్న రాజారావ్ మాటల్లో కాంట్రాక్టర్ కొడుక్కి శ్రీధర్ సహయం కావాలన్న మాట సరోజనాకర్షించింది.
ఈలవేసుకొంటూ రాజారావ్ స్నానానికెళ్ళాక సరోజ కొడుకు శ్రీధర్తో,”ఆ కాంట్రాక్టర్ కొడుకునేంచేసావ్? వాడుకాని నాన్నతో నీ పేరు చెప్పుంటే ఈ రోజు మనింట్లో ఇంకో సత్యాగ్రహం జరిగుండేది” అని అంది.”అమ్మా! నేనిక్కడే వున్నాకదా! ఆ కాంట్రాక్టర్ కొడుకు వాడి సీనియర్లతో గొడవపడ్డాడట. అందులో ఒకడు డిప్యూటీ కమీషనర్ కొడుకు, ఇంకొకడు ఎంపి మనవడు.యాదృచ్చికంగా వాళ్ళిద్దరూ నా స్నేహితులు. ఇక కాలేజిలో కంటిన్యూ అవ్వాలంటే వాళ్ళతో రాజీపడాల్సిందే. ఇది తెలిసి కాంట్రాక్టర్ నాకు ఫోన్ చేసాడు, నేను వాళ్ళకి సర్దిచెప్పాను. మాటల్లో మాటగా నాన్నని విసిగించొద్దని చెప్పాను.ఇందులో తప్పేముంది?” అని సమాధానమిచ్చాడు శ్రీధర్. “ప్రతిదానికి భలే తెలివిగా, నీ తప్పేమీలేదన్నట్లు సమాధానం చెప్పి నోరు మూయిస్తావురా నువ్వు. ఈ తెలివితేటలు మంచి దారిలో పెట్టు” అని సరోజ చెప్పగానే, ” the cruel kindness of a doctor’s knife saved the poor man’ life!” అనే oxymoranic expression గుర్తుతెచ్చుకొని, “పొట్టలు చీల్చే కౄరమైన కత్తి కూడా ఒక డాక్టర్ చేతిలోపడితే ప్రాణాలు కాపాడుతుందమ్మా! నా నైజం అంతే! నువ్వేం దిగులుపడకు” అని సంజాయిషీ నుండి ఉపదేశపు లెవెల్లో వివరిస్తున్న శ్రీధర్ని, “ఇక చాల్లేరా సకల కళా పోషకా, నీతో వాదించడం కష్టం” అని వ్యంగ్యంగా అంటున్నా సరోజ మనసులో కొడుకుని చూసి మురిసిపోయింది.అయినా మళ్ళింకెప్పుడూ ఇలా బెదిరింపులు, రాజకీయాలు చెయ్యొద్దని కొడుకుని హెచ్చరించింది.
ఇలా శ్రీధర్ గురించి చెప్పుకొంటూపోతే ఎన్నో విషయాలున్నాయి- సకల కళా పోషకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి,చిరు, డాన్,తోపు,అన్న, బాసు ఇలా నానా రకాల టైటిల్సు అందుకొన్నాడు.
ఎన్ని కళలున్నా అమ్మాయిల విషయంలో మాత్రం శ్రీధర్ జీరో. తను 8వ తరగతిలో ఉన్నపుడు ఒకమ్మాయిని ఇష్టపడ్డాడు.యూనివర్సిటీలో స్నేహితులతో ఏ బర్త్‌డే పార్టీకో, కాలేజ్‌డేకో మందుకొట్టినప్పుడు వాళ్ళకు తన లవ్ స్టోరీ చెప్పేవాడు.ఆ అమ్మాయితో హైస్కూల్లో ఉన్నపుడు శ్రీధర్ మూడు సార్లు మాట్లాడాడట.చివరిసారిగా 10th క్లాస్‌లో తను స్లాం బుక్ ఇచ్చేటప్పుడు చేతులొణికి పెన్ను కింద పడేస్తే ఆ అమ్మాయి గలగల నవ్వుతూ “ఏంటి అమ్మాయిల్తో ఎప్పుడూ మాట్లాడలేదా? నేనేమీ భూతాన్ని కాదు.స్లాం బుక్ ఇప్పుడు వ్రాయలేకపోతే సాయంత్రం స్కూల్ అయిపోయాక వ్రాసివ్వండి” అంటూ అదే చెరగని నవ్వుతో వెళ్ళిపోయింది.ఆమెను చివరిసారిగా చూసింది 10th క్లాస్ ఫేర్‌వెల్ పార్టీలో!ఆ రోజు తను గులాబీ రంగు చీరెలో దేవ కన్యలా మెరిసిపోతూ అదే చెరగని నవ్వుతో చేసిన మాయ ఇంకా తనపై పనిచేస్తూనేవున్నాయి, తన జ్ఞాపకాలు గుండెలో గూడుకట్టుకొని అలానే నిలిచిపోయాయి, తన ప్రేమను చెప్పే ధైర్యంలేక, తెలిసీ తెలియని ఆ వయసులో తన మనసుదోచిన వన్నెలాడి ఊసులని వెలలేని వజ్రాలుగా మనసుపొరల్లో దాచుకొన్నాడు. ఒకరోజు కాలేజ్ canteenలో కూర్చొని స్నేహితులతో మాట్లాడుతున్న శ్రీధర్ ఎదురుగా నిలిచిన ఒక అమ్మాయిని చూసి అవాక్కయ్యాడు. అది గమనించిన స్నేహితుడొకడు, ‘అన్న మనసు దోచిన కన్నె పిట్టరో’ అని అనగానే, శ్రీధర్ నవ్వుతున్న ఆ పిల్లను చూసి ఎప్పుడో చూసిన అదే నవ్వు, నను మాయచేసిన మంత్ర ముగ్ధ మందహాసం….తన మనసు దోచిన మగువ తనో కాదో తెలుసుకోమని వాళ్ళతో చెప్పాడు.అందమైన అమ్మాయిల చిట్టా మెయిన్‌టైన్‌చేసే సీనుగాడు చిట్టా విప్పాడు- పేరు సునయన, 2nd year electronics, ఊరు ఒంగోలు,1st year ఎక్కడో చదివాక కాలేజ్ transferలో ఇక్కడ చేరింది. క్లాస్‌లో చాలా calm. ఇప్పటికే ఒక నలుగురైదుగురు ఆషిక్‌లు వెంటపడుతున్నారు.అమ్మాయి చాలా స్ట్రిక్ట్. ఒకడి చెంప పగలడం చూసి ఇంకొకడు already డ్రాప్ అయ్యాడు. కానీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సురేష్ అనేవాడు మాత్రం ఎలాగైనా నిన్నే పెళ్ళి చేసుకొంటా అని బెదిరిస్తూ వెంటపడుతున్నాడు. Unfortunately ఊరవతల స్మశానంలా ఉండే electronics డిపార్ట్మెంట్ అవడంవల్ల ఆర్నెల్లైనా అన్న మనసు దోచిన ఈ అందం బయటపడలేదు.అన్న గ్రీన్ సిగ్నలిస్తే సురేష్ కాదు వాడి బాబు కూడ ఒప్పుకొంటాడు. సీనుగాడు excitementపై తను స్కూల్లో చూసిన అమ్మాయికాదు ఈ సునయన అని నీళ్ళు చల్లాడు శ్రీధర్. అయినా వాడు,”బాసు ఎప్పుడో చిన్నపుడు చూసిన అమ్మాయి మళ్ళీ దక్కటం దేవుడెరుగు కనపడటమే గగనం. అట్లాంటిది ఆ పైవాడే నీ బాధనర్థం చేసుకొని అచ్చు వొదినమ్మలాంటి ఇంకొ అమ్మాయిని నీ కోసం పంపాడు. ఈసారి మిస్ అవ్వకు బాసు!”
అని గీతోపదేశం చేసాడు.శ్రీధర్ ఏమీ మాట్లాడలేదు- మౌనం అర్థాంగీకారమన్నట్లుగా!సునయన శ్రీధర్ల మధ్య స్నేహమేర్పడటానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఎప్పుడూ ముభావంగా ఉండే శ్రీధర్ తను ఇష్టపడే ఆ నవ్వుకోసం కష్టపడి జోకులు, చలోక్తులతో సునయనను నవ్వించేవాడు.శ్రీధర్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటే సురేష్ లాంటి వాళ్ళ పీడ కూడా సునయనను వొదిలిపోయింది.రోజులు గడిచే కొద్దీ శ్రీధర్ తను సునయనను కాదు గాని ఆమె నవ్వును ప్రేమిస్తున్నాడని అర్థంచేసుకొన్నాడు. సునయన కూడ శ్రీధర్తో ఎప్పుడూ హద్దుమీరి ప్రవర్తించలేదు.కాలేజ్ చివరిరోజు అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు- శ్రీధర్ సునయనలు పెళ్ళి ప్రకటన చేస్తారేమొనని! కాని అటువంటిదేమీ జరుగలేదు.సునయన శ్రీధర్తో, “సారీ! నేనసలు మిమ్మల్ని ప్రేమించడానికి మీతో స్నేహం చేయలేదు. మీగురించి విని నా వెంట పడుతున్న ఆకతాయిల అల్లరి భరించలేక వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మీలాంటి బాయ్‌ఫ్రెండ్ ఉంటే మంచిదనుకొని మిమ్మల్ని ప్రేమించినట్లు నటిద్దామనుకొన్నాను, అయినా మీరు మంచి స్నేహితులయ్యారు.మీరు నన్ను ప్రేమించట్లేదని గ్రహించి హమ్మయ్యా అనుకొన్నాను.మీ ఫ్రెండ్ మీ లవ్ స్టోరీ చెప్పాడు. నేనచ్చు ఆ అమ్మాయిలానే వుంటానని….” అని మాట్లాడుతుంటే శ్రీధర్ అన్నాడు,” నువ్వు కాదు తల్లీ! నీ నవ్వు! నేను నీ నవ్వుని ప్రేమించాను నిన్ను కాదు! ఇంకొకరిని ప్రేమించడం నా వల్ల కాదేమో!” “అయినా ఎప్పుడో చిన్నప్పుడు చూసిన అమ్మాయి కోసం మీరిలా నిరీక్షించడం అవివేకం మంచమ్మాయిని చూసి పెళ్ళి చేసుకొండి” అని ఒక ఉచిత సలహా ఇచ్చిన సునయినను, “అయితే నిన్నే చేసుకొంటా రా” అని అసహనంగా అన్న శ్రీధర్ మాటలకి సునయన నోరుమూసుకొని వెళ్ళిపోయింది.
కాలేజ్ అయిపోవడం శ్రీధర్ సునయనల స్టోరీకి తెరపడటం ఒకేసారి జరిగిపోయాయి!
MS చేయడానికి డల్లాస్ వొచ్చిన శ్రీధర్‌కి మొదటి రోజే అనుకోని షాక్! “హేయ్! శ్రీధర్! absolutely unbelievable! ఇది కలా నిజమా…” అంటూ చేతులు చాచి full excitement తో శ్రీధర్ని కౌగలించుకొంది ఆ స్కూల్ పిల్ల! శ్రీధరింకా షాక్‌నుండి కోలుకోలేదు…”మ..మ…మహాలక్ష్మీ! నువ్విక్కడ?” అని మాటలురాక తడబడుతున్న శ్రీధర్ని చూసి అదే గమ్మత్తైన నవ్వుతో,”ఏంటి? నువ్వే MS చెయ్యాలా? మేము చేయకూడదా? నీ చేతులింకా వొణుకుతున్నాయా అమ్మాయిల్తో మాట్లాడేటప్పుడు? చేతులేమో కాని మాటలైతే తడబడుతున్నాయి! ఆ సీన్ ఇంకా మరిచిపోలేదు శ్రీధర్…పెద్ద angry young man లా ఫోజు, అమ్మాయిని చూడగానే తడబాటు….” అంటున్న మహాలక్ష్మిని చూస్తూ, “నేనూ నిన్ను మరిచిపోలేదు మహాలక్ష్మీ! तुम ने एक मुस्कुराहट से ज्यादु कर्के मुझे पागल बना के गायब होगयि (తూనేతో ఏక్ ముస్కురాహట్‌సె జ్యాదు కర్కె ముఝె పాగల్ బనాకె గాయబ్ హోగయి)…” అని మనసులో అనుకొన్నాడు.”నేనిక్కడికి వొచ్చేముందు మీ ఇంటికి వెళ్ళాను.నా 10th క్లాస్ సర్టిఫికేట్ పోతే తిరిగి అప్లై చేయడానికి మన స్కూల్ కి వెళ్ళాల్సొచ్చింది.ఎందుకో నువ్వు గుర్తొచ్చి నవ్వొచ్చింది.నువ్వేంచేస్తున్నావో, ఎలావున్నావో చూడాలని ఒక thrilling idea వొచ్చింది. స్కూల్ నుండి అడ్రస్ తీసుకొని మీ ఇంటికి వెళ్తే చెప్పారు నువ్వు America వెళ్ళే ప్రయత్నాల్లో వున్నావని. నీ ఫోన్ నంబర్ తీసుకొన్నాను. మా ఊరెళ్ళాక రింగ్ చేస్తే ఎప్పుడూ switched off అనే వొస్తుంది. మీ ఇంటి నంబర్ తీసుకోవడం మరిచిపోయా! నిన్ను contact చేయలేకపోయినందుకు చాలా disappoint అయ్యాను” అని గలగలా చెబుతున్న మహాలక్ష్మి మాటలు నోరెళ్ళబెట్టి చూస్తున్న శ్రీధర్‌కేమీ వినపడలేదు….అయినా అనేసాడు యాధృచ్చికంగా..నన్నెందుకు కాంటాక్ట్ చెయ్యాలనుకొన్నావ్ అని.”బహుశా నిన్ను ప్రేమిస్తున్నానేమో శ్రీధర్! అవును! మనం చివరిసారి కలిసిన ఆ సీన్- స్లాం బుక్ వ్రాయమంటే చేతులొణుకుతూ పెన్ను కింద పడేసినప్పుడు నీ మొహంలో tension, తొందర, ఆ అమాయకపు భావాలు తలచుకొన్నప్పుడెల్లా నవ్వొస్తుంది, నువ్విప్పుడెలావున్నావో చూడాలనిపించేది. కాంటాక్ట్ చెయ్యాలనుకొన్నా కుదరని పరిస్థితి. అంతే కాక చూపులతోనే చంపేసేలా వుండే నీ సీరియస్ ఫేస్ గుర్తొచ్చి ధైర్యం చాలేది కాదు. ఏదేమైనా మనం కలిశాము..” అని అంటున్న మహాలక్ష్మితో ఇక ఎన్నడూ విడిపోవద్దు అన్నాడు శ్రీధర్! “అబ్బో మాటలు బాగానే నేర్చావే, ఈ 2 years మనం ఒకరినొకరం అర్థం చేసుకోవొచ్చు శ్రీధర్! నువ్వంటే నాకిష్టం. అందులో ఎటువంటి అనుమానంలేదు. మన చదువయిపోయేవరకు మనమిలానే ప్రేమ పక్షుల్లా వుందాం. ఒకరినొకరు అర్థంచేసుకొని పెళ్ళిచేసుకొంటే ఏ సమస్యా ఉండదు, ఏమంటావ్?” అంటూ నవ్వింది మహాలక్ష్మి.
సరే అన్నట్లు తలూపాడు శ్రీధర్! రెండేళ్ళు ఇట్టే గడిచిపోయాయి.ఒక రోజు శ్రీధర్తో,”కాలేజ్‌లో ఎవరైనా అమ్మాయి నిన్నాకట్టుకోలేదా? I mean నువ్వెవరినైనా ప్రేమించడం గాని జరిగిందా?” అన్న మహాలక్ష్మి ప్రశ్నకు,” అబ్బే కాలేజ్‌లో కూడా నేను సీరియస్‌గానే వుండేవాడిని. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో మందుకొట్టడం, సినిమాలు,షికారులు ఇదే లోకం” అంటూ సునయన గురించి చెప్పడం అంత అవసరంలేదు అనుకొన్నాడు శ్రీధర్.”నేనూ మా బావతో సినిమాలు షికార్లకి వెళ్ళేదాన్ని. మాఇంట్లో వాళ్ళు బావే నా మొగుడు అని ఎప్పుడో నిర్ణయించేసారు. మొదట్లో నాకతన్ని చూస్తే చిరాకేసేది.కాని పాపం చాలా మంచివాడు.బావంటే నాకిష్టమే కాని నేనెప్పుడూ అలాంటి దృష్టితో ఆయన్ని చూడలేదు. ఒక మంచి స్నేహితుడిలా ఫీలయ్యాను. అదే బావతో చెప్పాను.వెంటనే బావ కూడా నా కిష్టమైన వాడ్ని పెళ్ళి చేసుకోమని చెప్పాడు. He is a very good friend of mine indeed!” అంది మహాలక్ష్మి. ఇలా యవల చేల్లో కూర్చొని గతాలు అవగతం చేసుకొన్నారొకరికొకరు. శ్రీధర్-మహాలక్ష్మిల పెళ్ళి నిరాడంబరంగా జరిగింది.సంతోషంగా సాగుతున్న కాపురంలో సుడిగాలి తుఫానులా ఒకనాడు సునయన తలుపు తట్టింది.
ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన శ్రీధర్ డ్రాయింగ్‌రూంలో నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకొంటున్న సునయనా మహాలక్ష్మిలను చూసి అవాక్కయ్యాడు. “శ్రీధర్! ఇది సునయన! మా బాబాయ్ కూతురు. పరీక్షలుండటం వల్ల మన పెళ్ళికి రాలేదు. మన పెళ్ళైన ఏడాదికిగాని దీనికి తీరిక కుదరలేదు” అంటూ పరిచయం చేస్తుంటే సునయన ఏమీ తెలియనట్లే,”బావగారూ! బాగున్నారా?” అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది.ఆనాటి నుండి మొదలయ్యాయి శ్రీధర్‌కి పీడకలలు!-”ప్రియా! నన్ను విడిచి ఎందుకు వెళ్ళిపోయావు? ఒంటరితనపు చీకటి మంటల్లో మగ్గి మగ్గి మరణానికై నిరీక్షిస్తున్నా. గతం గుర్తుచేసుకొని గుండెపగిలేలా రోదిస్తున్నాను! అవని అంచులు దాటి అంబరమే హద్దుగా కన్నీరు కాలువలై పారగ, తప్పుచేసిన ఆ ఒక్క క్షణం కాలగమనంలో కలిసిపోకుండా నా దరిచేరితే సవరించుకోవాలని అసాధ్యమని తెలిసి కూడా అనునిత్యం ఎదురుచూస్తున్నాను, ఎదురుచూస్తున్నాను, ఎదురుచూస్తున్నాను…”అని గొణుగుతున్న శ్రీధర్ మహాలక్ష్మి కుదుపుకి ఉలిక్కిపడి దిగ్గున నిదురలేచాడు! “ఏంటి శ్రీధర్? ఈ మధ్య చాలా టెన్షన్‌లో వున్నట్లున్నావు? ఆఫీస్‌లో ఏమైనా వత్తిడా? ఎందుకు నా దగ్గర దాస్తావు?” అని అడిగిన మహాలక్ష్మితో,” ప్లీజ్ మహీ! నీకో విషయం చెప్పలేదు. చెబితే నువ్వెక్కడ నన్ను పెళ్ళిచేసుకోవేమో అని. నాకు సునయన ముందే తెలుసు. కాలేజ్‌లో ఇద్దరం కలిసి తిరిగాము. అందరూ మేము ప్రేమించుకొంటున్నామని అనుకొనేవారు కాని అది నిజం కాదు. సునయన నీ కజిన్ అని తెలిసి, తనని మనింట్లో చూసినప్పటినుండి నాకు ఒకటే టెన్షన్, నువ్వెక్కడ నన్ను విడిచి వెళతావేమోనని! సునయనతో తిరిగినందుకు కాదు, నీకు అసలు విషయం చెప్పనందుకు నేను నలిగిపోతున్నాను. క్షమించు” అన్నాడు.అంతా విన్న మహాలక్ష్మి, సునయనలు ఒక్కసారిగా గొల్లున నవ్వారు.”బావా! కాలేజ్‌లో మకుటంలేని మహరాజంటే ఏమో అనుకొన్నాను. ఇంత సెన్సిటివా? అక్కకు అంతా తెలుసు ” అని అంటున్న సునయనను వారించి బయటకి పంపింది మహాలక్ష్మి…”ప్రేమ సర్వ దోషములను కప్పును. ప్రేమ ఇచ్చుటయేగాని ఆశించుట ఎరుగదు” అని బైబిల్లోనుంచి,ఇంకా నాకు తెలియని ఎన్నో పుస్తకాల్లోనుంచి, అన్నిటికీ మించి నీ మంచితనం,నా పట్ల నీకున్న అంతులేని ప్రేమనుంచి ఎంతో తెలిపావు శ్రీధర్! అలాంటిది ఈ చిన్న విషయం చెపితే నిన్నెలా వొదిలేస్తాననుకొన్నావ్? నీకు తెలివితేటలతోపాటు వెలక్కాయంత వెఱ్ఱి కూడా వుందనుకొంటా!” అంటూ శ్రీధర్‌ని అక్కున చేర్చుకొని కౌగలించుకొంది మహాలక్ష్మి…నవ్వుతున్నా ఆ కలువ కళ్ళలో పలుచని నీటిపొర…తన మొగుడు తననెంతో ప్రేమిస్తున్నాడని గర్వంతో అనుకొంటా!


తొలి ప్రచురణ "పొద్దు" లో http://poddu.net/?cat=12&paged=2

Sunday, January 21, 2007

పుష్ప విలాపం



వర్ణాలు వేరైనా చెలిమితో కలిసున్నాము
మన మూలమొకటేయనెరిగి మురిసాము
పలు రంగుల్లో పుష్పించి కనువిందు చేశాము
మనలను నాటిన మనిషిని మెప్పించాము!

కానీ... మాలాగే విభిన్నవర్ణాల వాడు
ఏనాడు అంతాఒకటేనని ఐకమత్యం పాటించడు!
మనుష్యజాతి ఒకటే అయినా వివక్షలు శతకోటి
భూసురుడొకడట బురదవంటి వాడొకడట!
తెల్లవాడు దొరట నల్లోడు బానిసట!

నా భాష మిన్నంటే మా సంస్కృతికి లేదు సాటని
తన మతం శ్రేష్టమని మరొకరి అభిమతం నికృష్టమని
నిందలెన్నో చేసుకొంటూ కయ్యానికి చిందులేస్తూ
విజ్ఞానము సాధించామంటూ వినాశనమునకు చేరువైరి!

my cell phone snap