Tuesday, March 06, 2007

హెయిర్-కట్

ఒకతను పిల్లాడితో హెయిర్-కట్ సెలూన్‌లోకి ప్రవేశించాడు.తను హెయిర్ కట్,ఫేస్ వాష్,మసాజ్,షేవింగ్ అన్నీ చేయించుకొన్న తరువాత పిల్లాడ్ని కూడా కటింగ్ చేయించుకోమని చెప్పి,నీ స్కూల్ డ్రెస్ టై చిరిగిపోయిందన్నావ్ కదా, నీ హెయిర్ కట్ పూర్తయ్యేలోగా నేనెళ్లి కొత్తది కొనుకొస్తాను అని చెప్పి బయటకెళ్లాడు.పిల్లాడి కటింగ్ పూర్తైనా కూడా ఎంతసేపటికి అతను రాకపోయేసరికి,షాపువాడు, మీ నాన్న నీ సంగతి మర్చిపోయినట్లున్నాడు అని పిల్లాడితో అనగానే,పిల్లాడు,వాడు మా నాన్నేంటి...ఎదో ఫ్రీ హెయిర్ కట్ చేయిస్తాను,నా స్కూల్ టై కొనిపెడతాను అంటే సరే అని వాడితో వొచ్చా, అన్నాడు! 

2 comments:

రాధిక said...

good idea.

చదువరి said...

హహ్హహ్హహ్హ.. పిల్లాడు ఆమాట అన్నాక, ఆ మంగలి మొహం ఎలా అయిపోయిందో ఊహించుకుంటేనే..