కొంతసేపటి క్రితం (సుమారు రాత్రి 8 గం.లకు) స్నేహితుల ఆహ్వానంపై భోజనానికి వెళ్ళాను...నా ఫ్రెండ్ రూబేన్ బైలీ-కుక్ అతని భార్య రేచల్ పోటీ పడి వండారనుకొంటా.నన్నెప్పుడు పిలిచినా అలానే చేస్తారు-నా మీద వాళ్ళ వంటల ప్రయోగాల పుణ్యమా అని తెల్లోళ్ళ తిండి వేరైటీలన్నీ రుచిచూసాను.అదృష్టంకొద్ది ఇద్దరూ మంచి వొంటగాళ్ళే ఇంటి పేరుకి తగ్గట్టుగా!ఇక ఈ రాత్రి మెను-vichyssoise,roast chicken and veges,french lamb steaks,chops in parcel,salzburger nockerlin.....
ఇంక అసలు విషయం నేను తినే ప్లేట్లో నుంచి ఫోర్క్ కిందపడిది. వెంటనే రూబేన్ నవ్వుతూ మా వంటలు తినడమే కాదు ఎలా తినాలో కూడా నేర్చుకోవాలి అని వెటకారంగా అన్నాడు(మా మధ్య ఎప్పుడూ సరదాగా వాదాలు జరుగుతూనే ఉంటాయి).నా టైం రాకపోతుందా అని అలోచిస్తున్నంతలో మనోడి చేతిలోనుండి ప్లేటే పడిపోయింది...అందరం నవ్వెంతలో ఇల్లంతా ఒక రెండు మూడు క్షణాలు కుదిపేసినట్లయింది(9pm)...ముగ్గురం షాక్ తిన్నాం! ఏమయిందో అర్థమయ్యిది. తేరుకొని tv లో న్యూస్ చూసి చిన్న tremor అని confirm చేసుకొని పిచ్చాపాటి మాటల్లో మునిగిపోయాం! కష్టం మీద ముచ్చట్లు ముగించి ఇంటిదారి పట్టాను.ఒకవేళ పెద్ద భూకంపం వస్తే ఎం చేస్తామని రేచల్ వేసిన ప్రశ్న drive చేస్తున్న నన్ను అలోచనలో పడేసింది..మళ్ళీ కారు ఒకవైపు బలంగా గుంజినట్లనిపించి ఈ లోకంలోకొచ్చాను...ఇంటికొచ్చాక తెలిసింది కారు పక్కకి గుంజటంకాదు,11.25pm కి ఇంకోసారి కంపించిందని!ఎందుకైనా మంచిదని పడక గది మార్చాను ఎందుకంటే నేనున్న రూం అటకపైన చాలా బరువైన సామాన్లునాయి,ఒకవేళ పెద్ద భూకంపమేవొచ్చి ఇల్లు కూలి మీద పడితే ఎక్కడ చస్తానో అని ఒక క్షణం భయం వేసింది.భూకంపం అంటే ఎలా ఉంటుందా అని ఎప్పుడూ అనుకొనేవాడిని...చిన్నదో పెద్దదో ఈ రోజు ఆ అనుభవం కూడా అయ్యింది!బ్రతికుంటే మళ్ళీ రేపు బ్లాగుతాను...
4 comments:
మీరు భయపడి అందరినీ భయపెట్టకండి.చిన్ని చిన్ని భూకంపాలకి ఏమి అవ్వదులెండి....ఇలా చెప్పడం సులువే కానీ అనుభవించేవాళ్ళకి తెలుస్తుంది కదా బాధ.
" బ్రతికుంటే మళ్ళీ రేపు బ్లాగుతాను... "
ఇది హైలైటు .....
రేపు మీరు మళ్ళీ బ్లాగాలని ఆశిస్తూ ;)
సరే మరి భూకంపం నుండి బయట పడ్డారో లేదో రేపు చెప్పండి :)
అరుదైన అనుభవం. చావుదేముందిలెండి భూకంపమే చంపాలా మనల్ని!?
Post a Comment