Friday, February 02, 2007

సాయంత్రం

ఆకులు రాలిన చెట్టుపై
ఒంటరి కాకి కదలక కూర్చొంది
అలసిపోయిన సూర్యుడు
కొండల చాటున చేరుతుండగ
ముసురుతున్న మసక చీకటికి
చోటివ్వడానికనుకొంటా...
తన నిరీక్షణ నిశి రాకకోసమేనని
కావు కావు మంటూ కలవకనే
ఎటో ఎగిరిపోయింది!

2 comments:

రాధిక said...

అద్భుతమయిన ఆలోచన.అంతాన్నా అద్భుతమైన వర్ణన

రానారె said...

దేన్ని కవిత అంటారో నాకు తెలీదుగానీ, ఇది మాత్రం చాలా నచ్చింది.