Tuesday, March 13, 2007

కరిగిన కలలే బీజంగా
చిగురించిన కోరికలు...
పొద్దు పొడుపు!
---------------------------------
 
తల ఎప్పుడు నెరిసిందో తెలియలేదు
తన్మయత్వంగా తననే చూస్తూ...
ప్రేమా?
---------------------------------
ఆకులు రాలిన చెట్టు కొమ్మకు
చిక్కుకొన్న గాలిపటం
చల్లని గాలిగి రెపరెపలాడిది...
బద్దకపు నిశ్శబ్ద నిశిపై విసుగ్గా!
హేమంతం!
----------------------------------
ఒంటరితనపు వెన్నెలమంటల్లో
నడిరేయిలో నిదురరాక
చంద్రుణ్ని, చెలి ఛాయాచిత్రాన్ని
మార్చి మార్చి చూస్తూ...
కార్తీక మాసం!  
--------------------------------- 
 

2 comments:

రాధిక said...

చదువుతుంటే సరళం గా బాగున్నాయనిపిస్తుంది.కానీ ఇంకా ఏదో లోతుగా నాకర్ధం కాని భావం కూడా వుందనిపిస్తుంది.చివరి రెండింటికి కనపడే భావం కాకుండా ఇంకా ఎమన్న భావం వుందా?వుంటే వివరించండి.

కొత్త పాళీ said...

చివరి పద్యం చాలా బాగుంది.