Tuesday, August 29, 2006

అర్థాంగి

పోకిరిగా ఉన్న నాకు ఊపిరి నువ్వైయ్యావు
ఎడారి వంటి జీవితానికి దారి నువ్వైయ్యావు
కామంతొ కన్ను మిన్ను కనని నన్నుప్రేమతొ జయించావు
కర్కశహృదయాన్ని కరిగించి కన్నీటికి భాష్యం చెప్పావు

మనసుల బాషను వివరించగ నువ్వుపరవశుడనై పులకించాను
ఎడారి యదలొ అనురాగపు జల్లులునీపై ప్రేమ చిగురించేను

జీవించాలని నీతొ కలకాలం పయనించాలని
ఆనందంలొ ఆరాటంతొ ఆలొచనలతొ నేను
అవనే హద్దుగ అంతులేని ఆశల వెల్లువ సత్తువతొ
జీవనసాగరమీదగ ప్రేమ జపంలొ జపంతొ నేను

నాదై నాకై తొణకని కుండలా నిలకడగా నా వెన్నంటి నిలువగ నీవు
కొండలనైనా బండలనైనా పిండి చేయగలననివిజ్ఞానంతొ విశ్వాసంతొ నేను

తోడు నీవై నీడ నీవై జీవనబాటకు వెలుగు నీవై

ప్రతి కదానికి కాంతిని తరచిప్రతి పదానిని పాటగ విరచి
మనసుల పలకలపై చెరగని ముద్రను వేసావు నువ్వు

ఆశ నీవై అమ్మ నీవై అనురాగపు అలవు నీవై
లౌక్యాన్ని వివరించి సౌఖ్యాన్ని నేర్పించి
హృదయపు తలుపుల విలాసంలొ నిత్య నివాసం నాకిచ్చావు

నాలొ సగమై సమమై స్వరమై సర్వమై స్థిరమై
చెరగని నవ్వుతొ తరగని ప్రేమతొ
సదా నీ తోడని నువ్వె నా సరి జోడని
పురుగువంటి నన్ను స్మరించి వరించి తరింపజేసావు!

1 comment:

తెలు'గోడు' unique speck said...
This comment has been removed by the author.