Tuesday, August 29, 2006

కాలేజీలో కాకు "లేజీ", క్రేజీ"


ఆశలతో, ఆలొచనలతో,ఆవేశంతో , ప్రణాలికలతో మొదటిరోజు కాలేజీలో అడుగిడటం ప్రతి విద్యార్థికి మామూలే. అలాంటి ఒక సగటు విద్యార్థికి కొన్నాళ్ళకు స్నేహితులు, స్నెహితురాల్ళు....ఇలా అందరితో అందరిలో కలిశాడు.
ఇక ఏముంది?.....ప్రతిరొజు జోరుగా, హుషారుగా కాలేజికి వెల్లటం......సరదాగా గడపడం.............
"ఎక్కడెక్కడో చిట్టి గువ్వలు

ఏడనుంచో గొరువంకలు
కాలేజీ క్యాంపస్ లో...."

అనే"ప్రేమ దేశం" పాటనుండి ఇన్స్పిరేషన్ పొంది మన విద్యార్థి కూడా మనసు పారేసుకున్నాడు......షరా మాములే కదండీ."దయ్యాలు వేదాలు వల్లిస్తాయని" నమ్మాలి మరి మనవాడు కలం పట్టి కవితలు వ్రాయడం మొదలుపెడతాడు కదా.
పాపం ఆ అభాగిని మనవాడి కవితలకు ప్రేరణ, మన తలనొప్పికి కారణం. ప్రేమించిన మొదటి రోజుల్లో.... డా సి.నా.రె. అన్నట్లు,


"ఆలొచనలు ఆలాపనల్లా,
అకుంఠిత శ్వాసల్లా
ధారాలంగా సాగుతూ
జీవితం వికసిస్తుంది పొద్దు పువ్వులా"

మన విద్యార్ధి జీవితం అంతే.......ఊహకందని "ఆనందం"లో వాడు, ప్రేమ పిచ్చిలో ఉన్నాడని వాడి మిత్రులు.....
తన కవితల ఒరవడిలో ఆమెనే స్పురిస్తూ, ప్రతిభింబిస్తూ...... ఇలా.....


"కలకల రవముల
కులుకుల పలుకుల
మురిపెపు పిలుపులు,
మనసుల దోచే అందం నీది
గలగల పారే సెలయేరు
నీ చిరు మందహాసం
అలలా నన్ను కమ్మేసి
నీ ప్రేమానురాగాలతో
నన్ను తడిపేయవా!".....

అని సరసపు జల్లులు తన తెల్ల పేజీలపై జల్లి వాటిని వెలలేని వజ్రాలనుకొంటూ ఒకరకమైన ట్రాన్స్ లో ఉంటాడు మన విద్యార్థి. తన ప్రేమకథనెంతో ఇంట్రెస్టుతో తోటివారితో చెప్తుంటాడు. చెప్పినదంతా విని వాడి స్నేహితులేమో....

మన వాడి ప్రేమ జోరు
వాడి వెఱ్ఱి కవితల హోరు
మనకేమో చచ్చేంత బోరు
మన కర్మ వినడానికి ఇంకెవరూ లేరు.
ఇలా అనుకొంటూ మన విద్యార్థినుండి తప్పించుకు తిరుగుతుంటారు.

ఫిబ్రవరి 14th, తన ప్రేమను తెలియజేయడానికి సరైన రోజు.Ofcourse ఆ రోజు కోసం preparation ఖర్చులు.....dress,greeting cards,gifts వగైరా వగైరా....పాపం బాగానే ఖర్చయ్యింది.
కాని మనవాడి స్వప్న సుందరి వేరొకరిచ్చిన greeting cards accept చేయడం చూసి మనవాడికి కాసెపు ఆవెశం, నిర్వేదం,దుఃఖ్ఖం.....కొంతసేపటికి ఆవేదన.....నిర్లిప్తత......ఇంకొంతసేపటికి ఉపశమనంతో.......

నిప్పుకి చెద అంటనట్టు
సౌందర్యానికి ఎంగిలి అంటదు
సౌదర్యం ఎప్పుడూ నవనవోన్మేషమే
సౌందర్యం ఎప్పుడూ ఆస్వాదనీయమే

అని మనసులో అనుకొంటూ, తన కంటికి మాత్రం అందంగా కనిపించే తన ప్రియురాలు (ప్రేమ గుడ్డిది కదా) ఇతర విద్యార్థులతో కొంచెం close గా మాట్లాడినప్పుడు సమర్థించుకొంటుంటాడు.
ఎలాగైతేనేమి ఆమెను 'excuse me' అని పిలిచి తన చేతిలోని cover దానితో పాటువున్న red roseను ఆమెకు అందించి వెనుదిరిగి వెళతాడు. ఇదంతా చాటున మాటువేసి ఆమె feelings ను observe చేయడానికి తన కొంటె మిత్రులను appoint చేస్తాడు లెండి. ఆమె కవర్లో greetings చూసి నిర్ఘాంతపోయినట్టు ఒక expression పెట్టి ఆ greeting card మధ్యలో మనవాడి proposal letter (purely self-written అండి) చదువుతూ మొఖం ఎర్రగా కందిపోతుంది.
Tension తో వున్న మన విద్యార్థి దగ్గరకు వాడి కొంటెమిత్రులు చావు కబురు చల్లగా మోసుకొచ్చి....ఆమె ఫీలింగ్స్ rejection కి చాల సమీపంగా వున్నాయని వర్ణిస్తారు. ఇక మనవాడి పరిస్తితి.....

భల్లున తెల్లారి తారకలు భస్మమైనట్లు
కళ్ళు తెరవగానే కలలు పెల్లుమని పగిలిపోయిన ట్లు
ఇరాని హోటల్ చాయ్ ఇలా తనను పెనవేసి
ఇదే లోకం అనిపింపజేస్తుంది ఆ సాయం సమయంలో,
ఆ నిశీదిరాత్రిలో చీలిన గాజు గ్లాసులో విస్కీ
"పెదవి గాయపడితే ప్రియురాలు గురుతుకు రాదా!"
అన్నట్లుగా అధరం రుధిరం చిందిస్తుంది.
తన ప్రియురాలి వికటాట్టహాసం,
" ఆశల అందలాన్ని sarcastic నవ్వుతో
నీటి బుగ్గ పగిలినంత తేలిగ్గా కూల్చినట్లు"
తన గుండెను పిండేస్తుంది.....

ఈ విధంగా మనవాడి పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది.
క్లాస్ లో attendence ఆమెదేమో full వీడిదేమో nil. వీడి పరిస్థితి చూసి తోటి మిత్రుడొకడు వీడితో....


ఒరే బ్రదరూ....
తాగకురా రోజు బీరు
అవుతున్నావు నువ్వు బేజారు
మరచిపోరా ఆమె పేరు
కావాలి నీ మైండుకు రిపేరు
అవ్వరా exams కి ప్రిపేరు

అని ఒక ఉచిత సలహా ఇచ్చి వెళ్తాడు. కాని మనవాడు దేవదాసుకు ప్రతిభింబంలా కలం కాగితం వదలక (ఇక నుండి విషాదంతో) వ్రాయటం మాత్రం మానదు.

"ఎప్పుడూ స్వప్నాల రహదారుల్లొనే నయనం పయనం
ఫలితం మాత్రం విరళం గరళం
అన్నీ కరువులు అల్లుకున్న బ్రతుకులో
కన్నొక్కటే కురిసే మేఘం"

అని అనుకొంటూ exams సంగతి, తల్లిదండ్రుల సంగతి, తన స్నేహితుల సంగతి మరచిపోతాడు.
Final exams అవ్వడమూ, result రావడమూ, మనవాడు fail అవ్వడమూ, తను ప్రేమించిన అమ్మాయి తన గురిచి ఏమీ ఎరగనట్లుగా చివరిగా పలుకరించి వెళ్ళడమూ, తన మిత్రులు వివిదస్థాయిల్లో ఉద్యోగాలు సంపాదించడం, కొందరు విదేశాలకు వెళ్ళదం అన్నీ రెప్ప పాటులో జరిగిపోతాయి.

Realisation!... హమ్మయ్య! మనవాడికి ఇప్పుడర్థమయ్యింది. కాని కలం కాగితం వదల్లేదు.....

"అలజడితో నా జీవితం
ఆందోళనతో నా మనసు
అది గతం అది గతం
ముళ్ళు రాళ్ళూ అవాంతరాలు ఎన్ని వున్నా
ముందు దారి నాది గురివైపు పరుగు నాది
అనవసరంగా చదువనే ప్రశస్తమైన నీ వ్యయం
కానివ్వకు దేనికి సమర్పణం"
అంటూ తన మిత్రులను అందుకొంటాదు....కానీ, కొంత కాలం తరువాత.....


1 comment:

Ramanadha Reddy said...

చాలా Quote చేశారు, భలే రాశారు. ఇంతకీ ఈ కధలోని హీరో లక్షణాలు మీగ్గానీవుండేవా ఏమిటి :)