Friday, February 02, 2007

భారమైన రేయి!


నెలరాజు నను చూసి
కొబ్బరాకుల చాటున దాగొనగా...
తను వస్తాడు తప్పక చూడగ నన్ను
అనుకొంటూ మదిలో మురిపెంగా నవ్వాను
కొబ్బరాకుల రెపపెపలు నీటిపై చిరు అలలు
నాకేదో తెలిపాయి నాలో కలవరం రెపాయి

యాడనుంచో వొచ్చింది చల్లని పిల్ల తెమ్మెర
కబురొకటి తెచ్చింది నా గుండెలవిసేలా

కారు మబ్బులు కమ్మునని
కుంభవృష్టి కురుయునని
నా శశిని అవి మరుగుచేయునని
ఈ రాతిరి తననిక నే చూడనని తెలిసి...
యదను బాధ రగిలెను!

7 comments:

రాధిక said...

చాలా బాగుందండి.చివరి లైన్ లు చాలా బాగా రాసారు.

రానారె said...

కొబ్బరి మట్ట అనడం విన్నాంగానీ కొబ్బరి ఆకు అనడం ...

రానారె said...

ఎదురుచూస్తున్నది నెలరాజుకోసం (మొదటి పంక్తులు)
నా 'రవి'ని అవి మరుగు చేయునని (చివరి పంక్తులు)
నెలరాజు అంటే చంద్రుడు, రవి అంటే సూర్యుడు కదా!?

అలాగే పిల్ల'తెమ్మెర' అనుకుంటాను. తిమ్మెర కాదు.

తెలు'గోడు' unique speck said...

thanks for corrections

తెలు'గోడు' unique speck said...

రానారె! థాంక్స్ అండి! "రవి" తప్పు రాసాను, "శశి" గా మార్పు చేసాను

రాధిక said...

ravi ani raasaaraa?nenasalu cuudanea ledu sasi anea caduvukumtuu vellipoya.

Anonymous said...

అద్భుతం..దృశ్యం...కావ్యం

విహారి
http://vihaari.blogspot.com