సంయుక్త రాష్ట్రాలు(యునైటెడ్ స్టేట్స్): బుష్షాయనమః-ఐ గెట్ వాట్ ఐ వాంట్ వెన్ ఐ వాంట్(నా గొంతెమ్మ కోర్కెలు తీర్చుకోవడానికి ఎమైనా చేస్తాను)
రష్యా:ప్రచ్ఛన్న యుద్ధం పునఃప్రారంభమా?
బ్రిటన్:చేతులు కాలాక ఆకులు పట్టుకొంటే ఏం లాభం?(ఇరాక్ నుంచి సైన్యం ఉపసంహరించే మీమాంసలో...)
ఇ.యు:గోతి కాడ నక్క
సౌదీ,ఈజిప్ట్,కువైట్:కడుపులో మంట
ఇరాక్,ఆఫ్గాన్:మంటలు ఆరేది ఎప్పుడంటా?
ఇరాన్:దమ్ముంటే కాస్కో!(మేకపోతు గాంభీర్యం)
ఇశ్రాయేల్:ఎవడి మాటా వినను (ఎవడైతే నాకేంటి?)
భారత్:కాశ్మీర్ "తల"నొప్పి-ఒంట్లో కులమత నొప్పి!
పాకిస్తాన్: "ఉగ్ర"వాదమా?-అన్నీ "ఉగ్ర"చేతలే (పెద్దన్నతో చెట్టాపట్టాల్ లేకపోతే పడాలి తంటాల్)
ఆస్ట్రేలియా: "బుష్"మానియా
చైనా:చూసి ఆనందించడంలో ఉన్న తృప్తే వేరు!(పాక్‌తో భారత్‌కు చెక్)
2 comments:
హమ్మయ్య మిమ్మల్ని భూకంపం ఏమీ చెయ్యలేదన్నమాట
విహారి
ఎవడైతే నాకేంటి? -- ఇది సూపరు.
Post a Comment