Wednesday, February 07, 2007
ఇది నిజమైతే...
తేది: మార్చ్ 2015
భాగ్యనగరంలో ఒక కిరాణా సరుకుల షాపు యజమాని ఇంట్లో జరిగిన చిన్న సంభాషణ
"ఎంట్రా గోల? త్వరగా రెడీ అవ్వు,ఏడు గంట్ల కల్ల షాపు తెరవాలి" అని విసురుగా అరుస్తున్న వెంకట రావ్కి, "నాన్న! నా ఫ్రెండ్ చాలా కష్టాల్లో ఉన్నాడు. పదిహేనేళ్ళనుండి వారి సొంత పెట్రోల్ పంప్లో ఎకౌంట్స్ చూసుకొంటున్నాడు.చాలా తెలివైనవాడు. కాని ఈ మధ్యే వాళ్ళ నాన్న అప్పుల్లో కూరుకుపోయి, పెట్రోలు పంపుకి కూడా కనీస భేరం రాక ఆత్మహత్య చేసుకొన్నారు. అదే! సుమారు ఒక పది పన్నెండేళ్ళ క్రితం చంద్రబాబు, వైయస్ల పాలనలో దిక్కులేక ఆత్మహత్యలు చేసుకొన్న రైతులు, గీత కార్మికుల్లాంటి పరిస్థితి. మన దెగ్గర ఎదైనా చిన్న గుమస్తా ఉద్యోగం ఇవ్వమని ప్రాధేయపడుతున్నాడు" వినయంగా వివరించాడు కొడుకు. సరే తప్పుతుందా అని,"ఈ ప్రభుత్వాలు ఎప్పుడూ అంతే, కష్టాల్లో ఉన్న ఏ పరిశ్రమనీ ఆదుకోవు. కాని ఎన్నికలముందు మాత్రం ఆల్లాద్దిన్ భూతంలా అన్నీ సమకూరుస్తామని వాగ్దానాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తారు.కుంచించిన గాలి ఇంధనంవొచ్చాక ఈ పెట్రోల్బంకుల యజమానుల పరిస్థితి దయనీయంగా తయారయ్యింది. పదేళ్ళక్రితం కుభేరులు నేడు వీరి గోడు వినేవాడు లేడు. ఓడలు బళ్ళవుతాయి బళ్ళు ఓడలవుతాయంటే ఇదేనేమో!" తనలో తను గొణుకొన్నాడు.
(రైతుల ఆత్మహత్యలను, మరింకెవరినైనాకాని కించపరిచే ఉద్దేశము ఏమాత్రం లేదు. కేవలం ఈనాడులో వొచ్చిన వార్తతో కలిగిన ఆలోచన-http://www.eenadu.net/story.asp?qry1=3&reccount=28)
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
సుధీర్ గారూ అలా కాదు కానీ ఇలా మాట్లాడుకుందాం.
"ఒరేయ్ వెళ్ళి ఆ పక్కింటి ఓడి పోయిన రాజకీయ నాయుకుడిని తీసుకురా మన కార్లో "గాలి" అయిపోయింది. వాడిని వచ్చి కాసేపు మన కారుకు కబుర్లు చెప్పమను. మనకు "గాలి" ఇంధనం ఖర్చు మిగులుతుంది"
విహారి
http://vihaari.blogspot.com
Post a Comment