రాజు: ఏరా సుబ్బు! ఏంటి చైనా విశేషాలు?
సుబ్బు: nothing much...what 'bout you?
రాజు: బోడి నాలుగేళ్ళు చైనాలో ఉండి ఎదవింగ్లీషొకటి.తిన్నగా తెలుగులో మాట్లాడు. ఇంక నయం ఏ USAనో, UKనో వెళ్ళుంటే తెలుగుని కూడా సినిమా హీరోయిన్లలా వచ్చి రానట్లు కులుకుతూ మాట్లాడేవాడివేమో!
సుబ్బు: సారీరా మామా! చైనావోళ్ళమీద ఎమైనా కొంచెం చలాయించాలంటే ఇదొక్కటే ఆయుధం. ఇంకెందులోనూ వాళ్ళతో సరితూగలేము.
రాజు: అదేంట్రా? "India shining" అని ఆ రోజుల్లో NDA ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసింది. అంతే కాదు మన దేశం ప్రగతి పధంలో దూసుకుపోతుందనడానికి ఎన్నో ఋజువులూ చూపింది- పెరిగిన GDP, ఉరకలేస్తున్న share market, వందల బిలియన్లలో విదేశీ మారక నిలువలు ఇలా ఇంకెన్నో! భారతదేశం ఒక ఆర్థిక, రాజకీయ, సైనిక శక్తిగా ప్రపంచంలో తన ప్రాభల్యాన్ని పెంచుకొనే రోజు ఎంతో దూరంలో లేదు అని ఎందరో మేధావులు వక్కానించి చెబుతున్నారు. చైనాతో దీటుగా పరుగు తీస్తున్నాం. చైనా కమ్యూనిస్టు దేశమవడం వల్ల మున్ముందు మనకే ఎక్కువవకాశాలున్నట్లు చెబుతున్నారు. నువ్వేంట్రా మనం వాళ్ళతో సాటిరామంటున్నావ్?
సుబ్బు: నువ్వన్నవి నిజాలే కాని పూర్తిగా కాదు. అభివృద్ది ఉంది కాని ఢంకా భజాయించినంత కాదు. అలాగే చైనాతో పోటి సంగతి దేవుడెరుగు, వారు సాధించిన సాధిస్తున్న అభివృద్దిలో నాలుగోవంతు కూడా లేదు. మన ఆర్థిక విశ్లేషకులందరు (economic pundits) సరిగానే విశ్లేషిస్తున్నారంటే పొరబాటు. "అంతా బావుంది" అదే "feel good factor" అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి- విశ్లేషించువాడు రాజకీయవేత్త, కేవలం అది తెలిపెడివాడు మాత్రమే ఈ ఆర్థిక విశ్లేషకుడు. ఇలా అని అందరినీ blame చెయ్యట్లేదు.అంతా బావుంది అనేవారు ప్రభుత్వ రంగాల్లోనుండి ప్రైవేటు రంగాలవరకు అన్నీట్లో పేరుకుపోయిన అవినీతి, high inflation, infirm infrastructure, బలహీనమైన చట్టాలు,మనుషుల మధ్య తరగని అగాదంలా పెరిగిపోతున్న ఆర్థిక స్థితిగతులు ఇవ్వన్నీ పరిగణలోకి తీసుకోరు.ఇంకొన్నాళ్ళైతే "గరీబి హటావో" కాదు "గరీబొంకొ హటావో" అని నినాదం పుట్టుకొచ్చినా పుట్టుకురావొచ్చు.
రాజు: గరీబి అంటే గుర్తొచ్చింది. నువ్వన్నట్లు భారతదేశం కాదు రా, భారతదేశాలు అనాలి- ఒకటి "భారత్ వెలుగుతోంది" అనే దేశం, ఇంకొకటి-ఈ వెలుగు నినాదం పుట్టిన ఏడాదే ఉన్న పరిస్థితులు- 12.5 లక్షల ముక్కుపచ్చలారని సంవత్సరం వయసులోపు పిల్లలు నిండు నూరేళ్ళూ ముగించారు, 5 కోట్లమంది పిల్లలు బడి మానేసారు, సుమారు సగం మంది భావి భారత పౌరులు పౌష్టికాహారలోపం ఉన్నవారే- అని తేలిపే ఆకలి,నిస్పృహ,నిరాశల భారతావని.
సుబ్బు: కాని స్వతంత్రంలో కుతంత్రం ఏమిటంటే, ప్రచారం వెలిగిపోయే భారత దేశానికి, గ్రహచారం పేద భారత దేశానికి.
రాజు: దీనికి పరిష్కారమెలా రా?
సుబ్బు:సమస్యకి పరిష్కారం ఎమంత కష్టతరమైంది కాదు.ఒక ఇంగ్లీష్ వాక్యంతో సుళువు గా చెబుతా!"the problem should be addressed at the grassroots",grassroots అంటే literalగా grassrootsయే- అట్టడుగు స్థాయి సమస్యలు పరిష్కరించాలి.అంటే పేదల కొరకు ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి ప్రణాళిక వారికి 100శాతం చేరేటట్లు చూడాలి. దీనికి కావల్సింది fancy captions కాదు, చిత్తశుద్ధి! సంస్కృతి గురించి గొప్పలు చెప్పడం కాదు, ఎదుటి మనిషికి చేయూతనిచ్చే సంస్కారాన్ని అలవర్చుకోవాలి.
రాజు: ఇంగ్లీషులో చెప్పినా బాగా చెప్పావురా!
4 comments:
అది వెలుగా? మంటా?
భారత్ వెలుగు తోంది..
కాకపోతే కొంతమంది కాలి పోతున్నారు.
విహారి
http://vihaari.blogspot.com
భారత్ వెలిగిపోతోంది.
అది పేదవారు కాలిపోతోంటే వస్తున్న వెలుగు కాబోలు.
(మన్మధుడు సినిమాలోని "ఆకాశం ఎర్రగా ఉంది" స్టైల్లో...)
జోకులు వదిలేస్తే, నా అభిప్రాయం ప్రకారం పేదల జీవితాలలో కూడా, ధనవంతుల జీవితాలలో అంత కాకపోయినా, కొంత మెరుగుదల కనిపిస్తోంది.
పేదలకుద్దేశించిన ప్రభుత్వ ప్రణాళిక ఒక్కటి సరిగా అనలైనా చాలు, grassroots బలపడతాయి. అంటే దేశమే బలపడుతుంది. అడుగడుగునా మామూళ్లు, పర్సెంటేజీలు, వాటాలు, జలగలు - ఇన్ని దాటాలి పేదలకేదైనా చేరేముందు.
Post a Comment