ముసురు
చూరు క్రిందకు చేరిన పిల్లల కోడి
రెక్కల మాటున పిల్లల అల్లరి
నీటి చినుకులకు పోటీగా..
మరణం
చదరంగపు గడులనుంచి తీసివేయబడ్డాక
అన్ని పావులూ సమానమే!
పట్టు
గడ్డిపరక చివరన వాలేందుకు ఒక తుమ్మెద నిర్విరామ ప్రయత్నం
దాని అగచాట్లు చూడలేకఅస్తమించిన సూర్యుడు!
తుఫానుకి ముందు
కొండ అంచున ఒంటరి వృక్షం
దానిపై బద్దకంగా తేలుతూనల్లని మేఘాలు!
నా శ్వాసలు వినపడేంత నిశ్శబ్దం!
శీతాకాలం
రాత్రి కురిసిన మంచు నా అద్దపు కిటికీపై చేరి
ఉదయభానుని కిరణాలను అడ్డుకునే ప్రయత్నంలో
నీరుగారుతుంది!
చెదరిన కలలు
ఎండాకాలంలోని గడ్డిపరకల్లా
పసిపాప నవ్వులో తెలియని అర్థంలా...
3 comments:
మీ ' నానిలు ' బాగున్నాయి. ముఖ్యంగా ...చదరంగపు గడులనుంచి తీసివేయబడ్డాకఅన్ని పావులూ సమానమే... అన్నది చాలా బాగుంది. ఇలానే, ఇంకా మంచివి మరికోన్ని వ్రాయండి.
-- valluri
ఒక దానిని మించి ఇంకొకటి వుందు.
అన్నీ చాలా బావున్నయి.
విహారి
http://vihaari.blogspot.com
"రాత్రి కురిసిన మంచు నా అద్దపు కిటికీపై చేరి
ఉదయభానుని కిరణాలను అడ్డుకునే ప్రయత్నంలో
నీరుగారుతుంది"....adbhutam.అన్నీ చాలా బావున్నయి
Post a Comment