ఆకాశ హర్మ్యాల అంచుల అరణ్య రోదనలు
తాటాకు గుడిసెల ముంగిట కారుణ్య వితరనలు
అచ్చటా ఇచ్చటా ఎచ్చటైనా వాడే
ఏమిలేని చేతగాని పేదవాడే
కలిలో ఆకలి రగులుతున్నా కలిని పంచేవాడు
నిండుకున్నా వండుకున్నదిచ్చేవాడు
తరచిచూడ యిల ఇటువంటి నరుడొక్కడులేడు
విరుల పాదమ్మోపి గరుకనే సుకుమారులు
ద్రవ్యాన్ని ద్రవ్యంగ్రోల ద్రవ్యంలా పారించే మత్తులు
ఎప్పుడూ ఎందుకూ ఎన్నడూ వాడే
అన్నీవున్న అంధుడైన కుభేరుడే
కలిమిలో లేమంటూ దిగులుపడే డబ్బున్న దరిద్రుడు
వెక్కసమైనా సిరి చాలదు చాలదనేవాడు
నలుదిక్కుల తారసపడేను ఈ మనుష్యుడు
ఈ లోతెరుగని అగాదం
మన లోకపు విషాదం
కసిని నింగినంటించే ఈ వీక్షణం
కొలిమి నిప్పుతో కడగాలని, ఈ క్షణం
ఆశయమాగదు ఆగినా నా ప్రయాణం
వచ్చేవరకూ ఆ మజిలీ... మరణం
కలం ఖడ్గంతో నే పోరాడే ఈ రణం
సమాంతరం దృష్టించేవరకు సాగాలి నిరంతరం!
తాటాకు గుడిసెల ముంగిట కారుణ్య వితరనలు
అచ్చటా ఇచ్చటా ఎచ్చటైనా వాడే
ఏమిలేని చేతగాని పేదవాడే
కలిలో ఆకలి రగులుతున్నా కలిని పంచేవాడు
నిండుకున్నా వండుకున్నదిచ్చేవాడు
తరచిచూడ యిల ఇటువంటి నరుడొక్కడులేడు
విరుల పాదమ్మోపి గరుకనే సుకుమారులు
ద్రవ్యాన్ని ద్రవ్యంగ్రోల ద్రవ్యంలా పారించే మత్తులు
ఎప్పుడూ ఎందుకూ ఎన్నడూ వాడే
అన్నీవున్న అంధుడైన కుభేరుడే
కలిమిలో లేమంటూ దిగులుపడే డబ్బున్న దరిద్రుడు
వెక్కసమైనా సిరి చాలదు చాలదనేవాడు
నలుదిక్కుల తారసపడేను ఈ మనుష్యుడు
ఈ లోతెరుగని అగాదం
మన లోకపు విషాదం
కసిని నింగినంటించే ఈ వీక్షణం
కొలిమి నిప్పుతో కడగాలని, ఈ క్షణం
ఆశయమాగదు ఆగినా నా ప్రయాణం
వచ్చేవరకూ ఆ మజిలీ... మరణం
కలం ఖడ్గంతో నే పోరాడే ఈ రణం
సమాంతరం దృష్టించేవరకు సాగాలి నిరంతరం!
వివరణ: ఎత్తైన భవంతులు కట్టినా పేదోడి బాధలు పట్టించుకొనేవారు లేరుపేదొడికి పేదోడి మాటల ఓదార్పే అండ అదే వారొకరికొకరిచ్చుకొనే వితరన. ఎక్కడ చూసిన ఇటువంటి నిరుపేదలు లెక్కకు మించి వున్నారు.
ఈ కలియుగంలో ఆకలితో రగులుతుంటే కనీసం గంజిని పంచుకొనేవాడు,ఇంట్లో ఏమీలేకపోయినా ఒక్క పూటకి వండుకున్నది అడిగినవాడికిచ్చే ఉత్తమ ఉదారతగలిగినోడు, ఈ ప్రపంచంలో ఒక్కడు కూదా లేడు.
పూలపై నడుస్తూకూడా పాదాలు కందుతున్నాయనేవారువిపరీతంగా తిని తాగుతూ పార్టీలకని పబ్బులకని నీళ్ళలా డబ్బు కర్చుచేసేవారు ఈ కాలంలో ఎంతోమంది ఉన్నారు.
డబ్బున్నా సంతృప్తి లేక జీవించేవారు, దాహం తీరక ఇంకా ఇంకా సంపాదించేవారు చాలామందుంటారు.
ధనిక పేద వర్గాల మధ్య పూడ్చలేని పెద్ద అగాదం వుంది, ఎంతో వ్యత్యాసం వుంది. ఇది చాలా చింతించవలసిన విషయం. ఈ వ్యత్యాసాన్ని రూపుమాపాలని సమానత్వం తేవాలని, సమాజాన్ని ప్రక్షాళన చెయ్యాలని అవేశంతో కవితలు రాసి ఒక్కరినైనిన ఆలోచింపచేయాలని ఎప్పుడూ రగిలిపోతుంటాను. నేను మరణించినా నా రాతలు యువతలో స్పూర్తిని నింపి సమానపు నవ సమాజం నిర్మించబడేవరకు కొనసాగాలి!
1 comment:
మీ ఆసయం చాల మచిదే.కాని ఒక్క కవితలతో మనం మార్పు సాధించలేము.ముందు ఒక్కరన్న ఆచరన చూపాలి.నేను కూడా పార్టీ లకి కర్చుచేయకూడదు అనుకుంటాను.తిండి అవసరం లేని వాడికి ఎందుకు పిలిచిపెట్టడం ఆ డబ్బులని ఏదన్న శరణాలయానికి ఇద్దాము అనుకుంటాను.మళ్ళ వున్నది ఒక్కడే పిల్లాడు వాడి కి ఏమి చేయకుండా ఎలా అని అనుకుని ఈసారికి చెసేద్దాము ఎంతోకొంత శరణాలయానికి ఇద్దాములే వాళ్ళకి ఇవ్వడం కోసం మన పిల్లాడికి ఏ సరదాలు లేకుండా చెయ్యలా అని ఆలోచించి భారీగా పార్టీ చేసేస్తాము.ఆనక ఖర్చు చూసుకుని అమ్మో బోలెడు అయింది శరణాలయం సంగతి తరువాత అని వదిలేస్తాను.చూసారుగా నాకు ఎన్నో ఆదర్శ భావాలు వున్నాయి.కానీ అవి ఆలోచనలవరకే.ఆచరన దగ్గరకి వచేసరికి ఎన్నొ ఆటంకాలు.మన మనసే మన మాట వినదు.
Post a Comment