Wednesday, March 21, 2007

సెంచరీ-వంద తెలుగు టపాలు పూర్తి

క్రికెట్టైనా,టపాలైనా సెంచరీ అయితై ఎవరికానందముండదు చెప్పండి!సరదాగా మొదలెట్టిన బ్లాగు తెలుగులో వంద టపాలు పూర్తి చేసుకొంటుందని అనుకోలేదు.మీ విమర్శలు,అభినందనలే నన్ను రాయడానికి ప్రొత్సహించాయనటంలో సందేహం లేదు.ఇంతకాలం ఓపిగ్గా నా బ్లాగు వాగుడ్ని భరించినందుకు కృతజ్ఞతలు.చిన్నప్పటినుండీ ఆంగ్లమాధ్యమంలోనే విద్యాభ్యాసం చేసినా(అలా అని ఇంగ్లీషులో పెద్ద తోపును కాదులేండి!) తెలుగు భాషపై నాకున్న ఆశ నన్ను తెలుగులో వ్రాసేలా చేసింది.మున్ముందు ఇంత విరివిగా వ్రాస్తానో లేదో తెలియదు కాని వ్రాయడమైతే మానను గాక మానను.బ్రతుకు తెరువు బాకు గుచ్చుకొని భావుకత గాయపడుతూనే ఉంటుంది, అయినా ఆశ చావదు అని ఒక అనామక కవి ఎందుకన్నాడో ఇప్పుడిప్పుడే అర్థమవుతొంది.అవును తెలుగు భాష తీయదనం అలాంటిదే మరి.తెలుగు మత్తు పట్టుకొంటే ఒక పట్టాన వదలదు...ఇదొక తియ్యని వ్యసనం,తీరని దాహం!మరోసారి మీ అందరికీ "వంద"నములు!

7 comments:

Sudhakar said...

అభినందనలు ... వంద టపాలు అంటే అషామాషేమి కాదు..

"బ్రతుకు తెరువు బాకు గుచ్చుకొని భావుకత గాయపడుతూనే ఉంటుంది, అయినా ఆశ చావదు "

అద్బుతం

రాధిక said...

ilaanea duusukupoamdi.

జ్యోతి said...

అభినందనలు..ఎప్పటికి ఇలానే రాస్తుండండి. తెలుగుతీయదనం ఎలాంటిదంటే మనకు తెలీకుండానే మనలో దాగిఉన్న భావాలెన్నో,బయటకు వస్తాయి. ఇది చాలా మంచి వ్యసనం.

Chari Dingari said...

"బ్రతుకు తెరువు బాకు గుచ్చుకొని భావుకత గాయపడుతూనే ఉంటుంది, అయినా ఆశ చావదు "

chaala bagundi.....100% nijam

Chari Dingari said...

"బ్రతుకు తెరువు బాకు గుచ్చుకొని భావుకత గాయపడుతూనే ఉంటుంది, అయినా ఆశ చావదు "


baagundi...100% nijam

spandana said...

"ఇదొక తియ్యని వ్యసనం,తీరని దాహం" బాగా చెప్పారు.

--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

అభినందనలు ...