కట్టెలు కొట్టువాడు కట్టెలు కొట్టుచుండగా వాని గొడ్డలి జారి ప్రక్కనే వున్న నదిలో పడిపోయెను. తన జీవనాధారమైన గొడ్డలి పోయినదని అతడు వల వల ఏడ్చుచూ నది ఒడ్డున కూర్చుండెను.
అతని దు:ఖమును చూచి ఆ నది దేవత ప్రత్యక్షమై ఏమి జరిగినదని అడిగి తెలుసుకొని నది దేవత వెంటనే నదిలోకి మునిగి, ఒక బంగారు గొడ్డలి తెచ్చిచూపెను. ఇది నాదికాదనెను. దేవత తిరిగి వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చెను. వాడు అది చూచి అదియు నాదికాదనెను. దేవత మరల వెళ్ళి ఇనుప గొడ్డలి తెచ్చెను. ఆ అదియే నాది అని కట్టెలవాడు దానిని సంతోషంతో తీసుకొనెను. నది దేవత వాని నిజాయితీకి మెచ్చుకొని ఇనుప గొడ్దలితో పాటు బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా బహుమతిగా ఇచ్చెను.
ఒకరోజు వాడు అదే నది ఒడ్డున తన భార్యతో నడుస్తూంటే,ఆమె అనుకోకుండా కాలుజారి ఆ నదిలో పడిపోయింది.తన భార్య కోసం విలపిస్తున్న అతని చూసి మళ్ళీ నది దేవత ప్రత్యక్షమై నీటిలోనుండి సినితార స్నేహను తెచ్చి ఈమె నీ భార్యా? అని అడగగానే అతడు వెంటనే అవునననగా,నది దేవతకు ఒళ్ళుమండి,దూర్తుడా...మంచివాడివనుకొంటే ఇంత సంకుచిత బుద్ధా నీకు? ఎందుకు అబద్ధమాడావో చెప్పు అంది.దానికి వాడు,నేను నిజం చెబితే తరువాత మీరు,ఏ శ్రియనో,హన్సికనో తీసుకొస్తారు.నేను మళ్ళీ నిజం చెబితే చివరకు నా భార్యతో పాటు వీరిని బహుమానంగా ఇస్తావు.నీవిచ్చిన ధనరాశులతో ఒక్క భార్యను పోషించడమే కష్టమవుతుంటే ఇక ఇద్దరితో వేగేదెట్లా అని ఆలోచించి, మీరు ముందు స్నేహను చూపించగానే కమిటైపోయాను అని సమాధానమిచ్చాడు!
నీతి:మగవాడు ఎన్నబద్ధాలాడినా దానికి ఎదో ఒక మంచి కారణం ఉంటుంది :)
5 comments:
గొప్ప సూత్రం.
గొప్ప సూత్రం.
హ హ హ.,.,చాలా బావుంది.,.,చిన్నప్పుడు చదివిన కధ ని భలే మార్చారే...బావుంది..
ఆ నదీదేవత అతడి నిష్కల్మష మనస్సుకు మెచ్చి, అతనికి స్నేహ, శ్రియ, హన్సిక, అతని అసలు భార్య లతో పాటు, వారినందరినీ పోషించడానికి తగిన శక్తిసంపదలను, బుద్దికుశలతనూ కూడా ఇచ్చి పంపించెను - అని ముగించి ఉంటే మనవాళ్లంతా ఊహల్లో తేలుకుంటూ నదీతీరవిహారాలకు బయలుదేరి ఉండేవాళ్లుకదూ!?
వారెవ్వా ఏమి post! భలే బాగుంది మీ కథ!
Post a Comment