అలచందలచేని పక్కనున్న యేటిలో కొంగ వాలిందట
చూడబోయిన చిన్నోడిని అమ్మ వారించిందట
అలిగేడుస్తున్న వాడికి అంతులేని కథ చెప్పిందట
చూడబోయిన చిన్నోడిని అమ్మ వారించిందట
అలిగేడుస్తున్న వాడికి అంతులేని కథ చెప్పిందట
ప్రజాస్వామ్యమంటే పకపకలని
ప్రజలరాజ్యంకాదు పెద్దలదే రాజ్యమని
ఓటుకి నోటుతో విలువ కట్టొచ్చని
నోటికి నాటుసారాతో తాళంవేయొచ్చని
రౌడీలతో రిగ్గింగు చేయొచ్చని
నేతల మాయ మాటలు నీటిమూటలని
ప్రతి ఎన్నికల తరువాత తెలుసుకొంటాడు ఓటరు!
అయినా ఓటరు మారుతుంది తన తలరాతని
ఆశపడి ఎన్నికలకు ఆయత్తమవుతాడు

ఓటుకోసం ఇంటింటికి తిరిగుతాడు టోపివోడు
తాటికాయ కబుర్లు చేంతాడంత వాగ్దానాలు విని
కలల లోకంలో తేలుతూ ఇంటిల్లిపాది
అందలమెక్కిస్తారు ఆ ఖరీదైన బిచ్చగాడ్ని
తంతంతా ముగిసాక ఎంతెతికినా కనపడడు
అవసరానికి వెళ్తే ఆకాశమవతల తన విలాసమని
గడపనుండే గెంటేస్తడు ఈ వింత బిచ్చగాడు!
జీవనచక్రంలో ఎన్నడు మారని ఎన్నికల చక్రమిది
ఓటరు ఓటు విలువో నేతల గారడీ చలవో
అంతుబట్టదు ఈ ఎన్నికల చిత్రం
వింతగుంటది భలారే విచిత్రం!!

1 comment:
చాలా బాగా చెప్పారు వింత బిక్షగాడి కథ.
ఓటరు ఇప్పుడు తనకేమో చేస్తారని గాక ఓటేస్తే నోటిస్తారని మాత్రమే ఆశపడుతున్నాడు ఆ తర్వాత తనను మరిచిపోతారని వాళ్ళకూ తెలిసిపోయింది. (ఇనాడులో వార్త చూడండి.. తమకు ఏ నాయకుడూ ఓటుకు డబ్బివ్వలేదని అలిగారట మహిళా ఓటర్లు!)
--ప్రసాద్
http://blog.charasala.com
Post a Comment