కడలి అందం పడతి చందం
ఊరకుండి ఉల్లసించును
ఉప్పొంగి ఉరికించును
ఇంతిసైతం సంద్రవైనం
వెన్నెలాటకు ఒళ్ళంతా కన్నులై
అలల తెరలతో అందమంతా ఒలకబోసె
విరహవేటుకు రేరాణిని చేరగ
ఆరాటంతో అలలహస్తాలతో ఉవ్వెత్తున ఎగసిపడె
వెండిమంటల వింత వెలుగులకు
కన్య కన్నులు కలువ కాంతులన్ విరజిమ్మె
తన ఒంటరితాపం జంటను కోరగ
కునుకే రాక అసహనంతో కోడెనాగై కస్సుమనె
కడలి అందం పడతి చందం
ఊరకుండి ఉల్లసించును
ఉప్పొంగి ఉరికించును
ఇంతిసైతం సంద్రవైనం
4 comments:
caalaa baagundandi polika.ilaa neneppaiki raastano?
కవిత - ప్రసిద్ధ కవిది ఐతే తప్ప- చదివే ఓపిక,
చదివినా దానిగొప్పతనం గ్రహించే శక్తి నాకు తక్కువ.
అతాంటి నాకు కొత్తూరివారి ఈ కవిత నచ్చింది.
@ radhika and Ramanadha Reddy-thank you for your precious comments
చాలా బాగుంది:)
Post a Comment