కరుగుతున్న కాలం చెరగని ముద్ర వేసింది
కదులుతున్న కలం కొందరిని నిద్ర లేపింది
కదులుతున్న కలం కొందరిని నిద్ర లేపింది
కట్టుకున్న చుట్టుకున్న జీవపు డంబాన్ని కాల్చి చీల్చి
నలుదిక్కులు నింగి నేల నన్ను చూసేలా నగ్నను చేసింది...
చాటునున్న మాటునున్న జీవితాల్ని ముందుంచి చూపించి
కనని కళ్ళకి కాంతినిచ్చి కఠిన హృదయాన్ని మార్చి వేసింది...
నలుదిక్కులు నింగి నేల నన్ను చూసేలా నగ్నను చేసింది...
చాటునున్న మాటునున్న జీవితాల్ని ముందుంచి చూపించి
కనని కళ్ళకి కాంతినిచ్చి కఠిన హృదయాన్ని మార్చి వేసింది...
మరుగుతున్న రుధిరానికి సమ్యమనం నేర్పింది
రగులుతున్న మనసుకు మంచి మార్గం చూపింది
రగులుతున్న మనసుకు మంచి మార్గం చూపింది
చింతాక్రాంతుడనై గురిలేని నన్ను నిలదీసి నిందించి
నాలోని స్వార్థపు చీకటులని చెరిపేసి చరమగీతం పాడింది...
ఆశల వ్యసనుడనై అలమటించగ నాకు ఎదురుపడి
జీవితపు పరమార్థాన్ని ప్రేమైశ్వర్యంలో చూపించింది...
నాలోని స్వార్థపు చీకటులని చెరిపేసి చరమగీతం పాడింది...
ఆశల వ్యసనుడనై అలమటించగ నాకు ఎదురుపడి
జీవితపు పరమార్థాన్ని ప్రేమైశ్వర్యంలో చూపించింది...
నాలో మంచి వికసించగ లోకం వింతగ చూసింది
అయినా మనసు ముందుకు చూస్తూ స్వాంతన చెందింది
అయినా మనసు ముందుకు చూస్తూ స్వాంతన చెందింది
PS: ప్రతివొక్కరిని వారి వారి అంతరాత్మలు ప్రశ్నిస్తూనే ఉంటాయి. కొందరు ధైర్యంగా స్పందించి మార్పుకు సుముఖులవుతారు ఇంకొందరు జీవితంతో, జీవితంలో రాజీ పడతారు. ఇక్కడ "నేను" అనేది స్వీయమార్పును స్వీకరించే ప్రతిఒక్కరికీ అన్వయించబడుతుంది.
1 comment:
chaalaabaagundi.manci samdesam amdimcaaru
Post a Comment