ఎవడి గోళ వాడిది. వరదల పుణ్యమా అని దండుకొనే దళారులు...రాజకీయ ఎత్తుగడల రాబందులు...ఏదో కొంత చేజిక్కించుకొనే బలమైన బాధితులు... కొందరికి ప్రమాదం విషాదమైతే, ఇంకొందరికి ప్రమాదం ప్రసాదంలాంటిది. వరదలైనా, వార్ లైన వ్యత్యాసమొక్కటే...బాధితుల సంఖ్య, బలిసినోల్ల సంఖ్య...ఇదంతా ఏదో రాయాలని కాదు, రాయడానికి నాకిష్టం కూడా లేదు...ఒక్కటి మాత్రం నిజం నా జీవిత కాలంలో ఒక్క యదవనాకొడుక్కైనా బుద్ధి చెప్తాను, అది గాందిగిరితో కాని గాడ్సేగిరితో కాని...పని చేయలేని చేయించలేని పనికిరాని మాటలు కావొద్దు మన మాటలు!
(" నీటి బొట్టు పెరిగిపోతె సంద్రమే!" అనే "చదువరి" గారి వ్యాసామందించిన ప్రేరణతో... http://chaduvari.blogspot.com/2006/11/blog-post_04.html)
4 comments:
ఎంత ఆవేశం!
ఆవేశాన్ని సరైన దారిలోకి మళ్ళించి బుద్ది చెప్పడమెలాగో ఆలోచించి చేయండి.
--ప్రసాద్
http://blog.charasala.com
@ ప్రసాద్- తప్పకుండా
సాధారణంగా ఇలాంటి విపత్తుల సమయంలో యంత్రాంగం యావత్తునూ ఒకే యంత్రంగా నడిపించడమనేది ఒక సాము లాంటిది. కాస్త అటూ ఇటూ అవుతూ ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా సహనంతో ఉండాలి, బాధితులకు సాయం అందే మార్గాలు చూడాలి. కానీ మన రాష్ట్రంలో ప్రతీ పక్షమూ విమర్శించడమే పనిగా పెట్టుకోవడంతో ప్రభుత్వం కూడా ఆత్మరక్షణ ధోరణిలో పడుతోంది. తప్పు దిద్దుకుందామనే పద్ధతి పోయి, ఎదురు తిరిగి అరవడం, కరవడమే పనిగా పెట్టుకుంటోంది. చివరికి బలవుతున్నది మాత్రం మనమే!
మీతో పూర్తిగా ఏకీభవిస్తాను.... సార్థకమైన విమర్శ చెయ్యాలి. వెయ్యి మంచి మాటలకంటే ఒక్క మంచి పని మెరుగు! అందుకే నాకు ఈ విషయం మీద వ్రాయడం ఇష్టం లేదు అని చెప్పాను.యంత్రాంగంలో అవకతవకలనేవి ఒక సముద్రంలాంటి సమస్య...మూలాలు ఎక్కడికో తీసుకెల్తాయి...నాకు తోచిన ఒక్క మాట చెబుతాను, వ్యవస్థ మార్పుకన్నా వ్యక్తి మార్పు ముఖ్యం! ఇది ప్రజలకి పాలకులకి ఎప్పుడర్థమవుతుందో! లేక తెలిసికూడా ఒకరాశతో మరొకరు దురాశతో జరిగిననాళ్ళు జరగనివ్వండి అని అనుకుంటున్నారో! ఇక ఈ topic పై నా నోరు మూసుకొంటాను, కొంచెం ఎక్కువగా వాగుతున్నాను...
Post a Comment