Friday, October 27, 2006

మనిషి


వెన్నెలకి చీకటికి ఏంటి సంబంధం?
రవికి వేకువకి ఎందుకీ ఎనలేని బంధం?

బురదలోని కలువకి ఎందుకా స్థానం?
మురిపించే గులాబికి ముళ్ళతో సంస్థానం
కమ్మని పాటల కోయిలకెమో వికారరవిందం
కక్కుని తినే కుక్కలెమో మనిషి నేస్తాలైన చందం

నా కంట్లో నలకే లోకమలినమని తోచే నీకు నేస్తం
నీ కంట్లో దూలం కనపడదాయె...అంతా నా చాదస్తం!

మిత్రమా! మనిషంటే మంచీచెడుల సంగమం
ఎవరూకూడా దీనికి అతీతులుకారు ఇది నిజం!

అందుకే,
మనిషిని కాదు కాని వాడిలోని, నీలోని
మలినపు ఆహాన్ని సిలువెసే ప్రయత్నంచేయి నిరంతరం!
PS: It is a response to an anonymous scrap in my Orkut profile about my past deeds and my writings. The content of the scrap is that how can I advocate goodness, peace, love, hope, faith, self-confidence and strive for a personality when my past was evil and thuggish....

3 comments:

Naveen Garla said...

చాలా లోతుగా అలోచించి ఈ కవిత రాసినట్టున్నారు..శభాష్. మనసులో చెలరేగే భావాలను అక్షర రూపం ఇస్తే..మనసుకు కొంచెం శాంతి.

spandana said...

చాలా బాగా రాశారు.
సిరివెన్నెల పాట "బూడిదిచ్చేవాని నేమి అడిగేది" గుర్తుకొచ్చింది.

--ప్రసాద్
http://blog.charasala.com

తెలు'గోడు' unique speck said...

@ naveen- మీరన్నది నిజమే...ఆలోచనలు లోతుగానే సాగాయి కాని ఆవేశం వలన కాబోలు అర గంటలో ఆలోచనలకి అక్షరరూపమిచ్చాను. మనసు రగిలితే మాటల ఉప్పెన ఎవరిలోనైనా ఉప్పొగుతుందనుకోండి.

@prasad- నేను ఎక్కువగా సినిమాలు చూడను...ఈ మధ్య internetlo తెలుగు తేజరిల్లడం చూసి తెలుగు సాహిత్యంపై మక్కువ పెరిగింది. మీరు చెప్పిన సిరివెన్నెల పాట చూసాను(చదివాను), simply matchless! చాలా బాగుంది.