Thursday, August 31, 2006

చూపుల ప్రేమ

సులోహిత కాంతుల సాయం సమయాన
పక్షుల కిల కిల రావముల ఆలాపాన
ఆవుల మందలు తిరిగొచ్చె వేళ
రేగిన గోధూళిలో అలసిన పాలికాపు ఆగమాన
ఆశతో ఎదుచూస్తున్న నయనం అలిసింది
అయినా ఆశ చావలెదు...

రవి తొలి కిరణాలు పెరటిచెట్టాకులగుండా
అరకొరగా తెరిచివున్న నా గది
కిటికి కవాటాల్లొంచి చొచ్చుకొనివచ్చి
నార చాపపై కలలలొకంలో విహారిస్తూ
నిద్రిస్తున్న నా మోమును గుచ్చి
చెలి రాకను చెప్పకనె చెప్పి మేలుకొలిపాయి....

లేడికి లేచిందె పరుగుగా
ఒక్క ఉదుటున పెరట్లోకి చేరి
నిక్కి నిక్కి చుట్టుగోడ ఆవలనున్న
మట్టి బాటవైపు ఆశగా అసహనంగా
అవే ఎదురుచూపులు!

రోజూ కనపడే "రంభ"కు మారు
ఆమె అన్న మరియు కన్నవారు
మా ఇంటివైపే వెంచేస్తున్నారు!!
వారి రాక చూసి గుండె గొంతులోకి జారిపోయింది
బిక్క చచ్చి గోడ చాటున నక్కి
"ఈ రోజుతో నా ఈ చూపులప్రేమకు
చరమగీతం పాడతారు
అమ్మ నాన్నల ముందు అన్న వదినల ముందు
పరువు తీస్తారు", అని అనుకొంటూ
నిర్జీవంగా నిస్తేజంగా పడివున్న నాతో,
"బాబాయ్! బామ్మ త్వరగా రమ్మంటోంది"
అని బాంబు పేల్చి వెళ్ళాడు బుజ్జిగాడు....

ఇంకేముంది?...."మీ అమ్మాయి రోజు
మా ఇంటి ముందునుంచి వస్తూ పోతూంటే
చూపులతో అల్లరి చేసాను.
ఒట్టు! పన్నెత్తి ఎప్పుడూ ఒక్కమాటా అనలేదు"
అని ముందుగానే మదిలో మాటలల్లుకొని
వారిని క్షమాపణ వేడుకొందామని నిర్ణయించుకొని
గబాలున వారి ముందుకు వచ్చి,
"క్షమించండి......." అంటూ వివరించేలోపు...
"ఎంత మాట బాబు! చెప్పకుండా
వచ్చినందుకు మమ్మల్నే క్షమించండి"
అంటు అసలు విషయం చెప్పారు-
వియ్యానికి వచ్చారని
వయ్యారికి నె సరిజోడని.....

Tuesday, August 29, 2006

కాలేజీలో కాకు "లేజీ", క్రేజీ"


ఆశలతో, ఆలొచనలతో,ఆవేశంతో , ప్రణాలికలతో మొదటిరోజు కాలేజీలో అడుగిడటం ప్రతి విద్యార్థికి మామూలే. అలాంటి ఒక సగటు విద్యార్థికి కొన్నాళ్ళకు స్నేహితులు, స్నెహితురాల్ళు....ఇలా అందరితో అందరిలో కలిశాడు.
ఇక ఏముంది?.....ప్రతిరొజు జోరుగా, హుషారుగా కాలేజికి వెల్లటం......సరదాగా గడపడం.............
"ఎక్కడెక్కడో చిట్టి గువ్వలు

ఏడనుంచో గొరువంకలు
కాలేజీ క్యాంపస్ లో...."

అనే"ప్రేమ దేశం" పాటనుండి ఇన్స్పిరేషన్ పొంది మన విద్యార్థి కూడా మనసు పారేసుకున్నాడు......షరా మాములే కదండీ."దయ్యాలు వేదాలు వల్లిస్తాయని" నమ్మాలి మరి మనవాడు కలం పట్టి కవితలు వ్రాయడం మొదలుపెడతాడు కదా.
పాపం ఆ అభాగిని మనవాడి కవితలకు ప్రేరణ, మన తలనొప్పికి కారణం. ప్రేమించిన మొదటి రోజుల్లో.... డా సి.నా.రె. అన్నట్లు,


"ఆలొచనలు ఆలాపనల్లా,
అకుంఠిత శ్వాసల్లా
ధారాలంగా సాగుతూ
జీవితం వికసిస్తుంది పొద్దు పువ్వులా"

మన విద్యార్ధి జీవితం అంతే.......ఊహకందని "ఆనందం"లో వాడు, ప్రేమ పిచ్చిలో ఉన్నాడని వాడి మిత్రులు.....
తన కవితల ఒరవడిలో ఆమెనే స్పురిస్తూ, ప్రతిభింబిస్తూ...... ఇలా.....


"కలకల రవముల
కులుకుల పలుకుల
మురిపెపు పిలుపులు,
మనసుల దోచే అందం నీది
గలగల పారే సెలయేరు
నీ చిరు మందహాసం
అలలా నన్ను కమ్మేసి
నీ ప్రేమానురాగాలతో
నన్ను తడిపేయవా!".....

అని సరసపు జల్లులు తన తెల్ల పేజీలపై జల్లి వాటిని వెలలేని వజ్రాలనుకొంటూ ఒకరకమైన ట్రాన్స్ లో ఉంటాడు మన విద్యార్థి. తన ప్రేమకథనెంతో ఇంట్రెస్టుతో తోటివారితో చెప్తుంటాడు. చెప్పినదంతా విని వాడి స్నేహితులేమో....

మన వాడి ప్రేమ జోరు
వాడి వెఱ్ఱి కవితల హోరు
మనకేమో చచ్చేంత బోరు
మన కర్మ వినడానికి ఇంకెవరూ లేరు.
ఇలా అనుకొంటూ మన విద్యార్థినుండి తప్పించుకు తిరుగుతుంటారు.

ఫిబ్రవరి 14th, తన ప్రేమను తెలియజేయడానికి సరైన రోజు.Ofcourse ఆ రోజు కోసం preparation ఖర్చులు.....dress,greeting cards,gifts వగైరా వగైరా....పాపం బాగానే ఖర్చయ్యింది.
కాని మనవాడి స్వప్న సుందరి వేరొకరిచ్చిన greeting cards accept చేయడం చూసి మనవాడికి కాసెపు ఆవెశం, నిర్వేదం,దుఃఖ్ఖం.....కొంతసేపటికి ఆవేదన.....నిర్లిప్తత......ఇంకొంతసేపటికి ఉపశమనంతో.......

నిప్పుకి చెద అంటనట్టు
సౌందర్యానికి ఎంగిలి అంటదు
సౌదర్యం ఎప్పుడూ నవనవోన్మేషమే
సౌందర్యం ఎప్పుడూ ఆస్వాదనీయమే

అని మనసులో అనుకొంటూ, తన కంటికి మాత్రం అందంగా కనిపించే తన ప్రియురాలు (ప్రేమ గుడ్డిది కదా) ఇతర విద్యార్థులతో కొంచెం close గా మాట్లాడినప్పుడు సమర్థించుకొంటుంటాడు.
ఎలాగైతేనేమి ఆమెను 'excuse me' అని పిలిచి తన చేతిలోని cover దానితో పాటువున్న red roseను ఆమెకు అందించి వెనుదిరిగి వెళతాడు. ఇదంతా చాటున మాటువేసి ఆమె feelings ను observe చేయడానికి తన కొంటె మిత్రులను appoint చేస్తాడు లెండి. ఆమె కవర్లో greetings చూసి నిర్ఘాంతపోయినట్టు ఒక expression పెట్టి ఆ greeting card మధ్యలో మనవాడి proposal letter (purely self-written అండి) చదువుతూ మొఖం ఎర్రగా కందిపోతుంది.
Tension తో వున్న మన విద్యార్థి దగ్గరకు వాడి కొంటెమిత్రులు చావు కబురు చల్లగా మోసుకొచ్చి....ఆమె ఫీలింగ్స్ rejection కి చాల సమీపంగా వున్నాయని వర్ణిస్తారు. ఇక మనవాడి పరిస్తితి.....

భల్లున తెల్లారి తారకలు భస్మమైనట్లు
కళ్ళు తెరవగానే కలలు పెల్లుమని పగిలిపోయిన ట్లు
ఇరాని హోటల్ చాయ్ ఇలా తనను పెనవేసి
ఇదే లోకం అనిపింపజేస్తుంది ఆ సాయం సమయంలో,
ఆ నిశీదిరాత్రిలో చీలిన గాజు గ్లాసులో విస్కీ
"పెదవి గాయపడితే ప్రియురాలు గురుతుకు రాదా!"
అన్నట్లుగా అధరం రుధిరం చిందిస్తుంది.
తన ప్రియురాలి వికటాట్టహాసం,
" ఆశల అందలాన్ని sarcastic నవ్వుతో
నీటి బుగ్గ పగిలినంత తేలిగ్గా కూల్చినట్లు"
తన గుండెను పిండేస్తుంది.....

ఈ విధంగా మనవాడి పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది.
క్లాస్ లో attendence ఆమెదేమో full వీడిదేమో nil. వీడి పరిస్థితి చూసి తోటి మిత్రుడొకడు వీడితో....


ఒరే బ్రదరూ....
తాగకురా రోజు బీరు
అవుతున్నావు నువ్వు బేజారు
మరచిపోరా ఆమె పేరు
కావాలి నీ మైండుకు రిపేరు
అవ్వరా exams కి ప్రిపేరు

అని ఒక ఉచిత సలహా ఇచ్చి వెళ్తాడు. కాని మనవాడు దేవదాసుకు ప్రతిభింబంలా కలం కాగితం వదలక (ఇక నుండి విషాదంతో) వ్రాయటం మాత్రం మానదు.

"ఎప్పుడూ స్వప్నాల రహదారుల్లొనే నయనం పయనం
ఫలితం మాత్రం విరళం గరళం
అన్నీ కరువులు అల్లుకున్న బ్రతుకులో
కన్నొక్కటే కురిసే మేఘం"

అని అనుకొంటూ exams సంగతి, తల్లిదండ్రుల సంగతి, తన స్నేహితుల సంగతి మరచిపోతాడు.
Final exams అవ్వడమూ, result రావడమూ, మనవాడు fail అవ్వడమూ, తను ప్రేమించిన అమ్మాయి తన గురిచి ఏమీ ఎరగనట్లుగా చివరిగా పలుకరించి వెళ్ళడమూ, తన మిత్రులు వివిదస్థాయిల్లో ఉద్యోగాలు సంపాదించడం, కొందరు విదేశాలకు వెళ్ళదం అన్నీ రెప్ప పాటులో జరిగిపోతాయి.

Realisation!... హమ్మయ్య! మనవాడికి ఇప్పుడర్థమయ్యింది. కాని కలం కాగితం వదల్లేదు.....

"అలజడితో నా జీవితం
ఆందోళనతో నా మనసు
అది గతం అది గతం
ముళ్ళు రాళ్ళూ అవాంతరాలు ఎన్ని వున్నా
ముందు దారి నాది గురివైపు పరుగు నాది
అనవసరంగా చదువనే ప్రశస్తమైన నీ వ్యయం
కానివ్వకు దేనికి సమర్పణం"
అంటూ తన మిత్రులను అందుకొంటాదు....కానీ, కొంత కాలం తరువాత.....


ప్రేమ పంతం

మనుషులు వేరైనా మనసులు మరువవు
దూరాలు పెరిగినా జ్ఞాపకాలు తరగవు
కలసిన మనసుల్ని వెంటాడే జ్ఞాపకాల్ని
నీ పంతం తెంచగలదా త్యజింపగలదా?

జీవన దశలు

బాల్యం-బేలతనం
యవ్వనం-నందనవనం
వృద్ధాప్యం-అలసిన పయనం
--------------
బాల్యం-అమ్మ వడి బడిలో పర్యవేక్షణ
యవ్వనం-కనిపించనిదానికై అన్వేక్షణ
వౄద్ధాప్యం-మరణానికై అసహన నిరీక్షణ

విఫల ప్రేమ- on the lighter side

ఓ నారీ!
నిను కోరి
సర్వం చేజారి
బ్రతుకు వేసారి
అయ్యాను బికారి
ఇక నా దారి గోదారి!!

ఆక్రోశం (సూడొ స్వాతంత్రంపై)

గుండె పగిలి
మనసు విరిగి
బడబాగ్నిలా రగులుతున్న
సలసల మసులుతున్న
రుధిరావేశాన్ని ఎక్కుపెట్టి అడుగుతున్న.....

దమ్ముంటే స్పందించండి
రొమ్ము విరిచి నిందించండి

pseudo-freedom ని జరుపుకునె
మేకవన్నె మృగాల్లారా
కులం అనే వ్యాకులంతొ
కంపుకొట్టె రోగులారా

దగాపడ్డ పేదోడి చితి మీద
చిందులేసె రాజకీయరాబంధులారా
రక్తమే చెమటగ మార్చిన కార్మిక శ్రమతొ
కుభేరులైన పారిశ్రామికజలగలారా

వచ్చిందా స్వాతంత్రం?
నిజంగా వచ్చిందా స్వాతంత్రం??


Thought for Transformation: 60 ఏళ్ళ పాలనలొ ఎందరో పాలకులు మారినా పాలన మారలేదు
ఇది మన పాలకుల చతురత చరిత్ర...జీవన పోరాటంలొ మన మనసులు ద్రవ్యమే సర్వస్వంగా దాస్యాంధకారంలొ ఉన్నాయి ఎప్పుడైతే కోరికల్ని జయిస్తామో అప్పుడే మనం పాలకుల్ని, పాలనని మార్చగలుగుతాం....

సమాజం

చిత్తుగ తాగి చిందులు వేయగ చీత్కారంగా వీరు
చక్కని ప్రతిభతో అందలమెక్కగ ముఖస్తుతి చేయగ వీరే

స్నేహం

Friendship day సందర్భంగా..... ఎందరో స్నేహితులు గమ్యాలు నిర్దేశించుకొని తీరాలు దాటి భౌతికంగా విడిపోతారు.....జీవనపోరాటంలో కాలంతో గెలువలేక మనసులూ దూరమౌతాయి...కాలాన్ని కారణంగా చూపి విదిపొయేవారెందరో...ఇది కొందరి నైజం...నిజం! అటువంటి స్నేహాలపై నా 'నిస్పృహ నిట్టూర్పూ..............(ఎవరినీ ఉద్దెశించినది కాదు కాని కొందరి హృదయాలను సంధించటానికే....."సీతాలు నువ్వు లేక నేను లేను" ప్రేరేపణతో......)

"నేస్తమా! ..... ఉన్నాను తోడుగా నీ స్నేహమే శ్వాసగా"
అని కళ్ళలోకి కళ్ళు పెట్టి
గుండెల్ని గెలిచి మనస్సుని తట్టి
కాలమే సాక్షిగా స్నేహమే బాసగా
నిరంతరం నీ తోడు నే వీడనని....
బతుకు తెరువు భౌతికంగా దూరం చేసినా
మాటల జరి అభిమాన సందేశాల ఒరవడి
మాధ్యమాల ద్వారా యదను తాకి
"నేస్తమా!! నువ్వే నా ప్రాణం!!"
అని వెఱ్ఱి ఆనందపు పులకరింపులలో నేనూ!!!
"hello!" అంటే "busy" అని
"ఏంటి సంగతులు?" అంటే "తరువాత మట్లాడుదాం"
అనే సమాదానాలు విని, దూరమౌతున్నామేమో
అనే సంశయంలో కొట్టుమిట్టడుతూవుంటే.....
తేరుకొనేలోగా కాలం కత్తిగట్టి
ఙ్ఞాపకాల వూసులని చేసిన బాసలనీ
నిర్దాక్షిణ్యంగా నరికి పారేస్తుంది!!
మిత్రమా! ఐనా ఆశ చావదు...

అలుపెరుగని పోరాటం

"మిత్రమా! ఈ లోకాన్ని చూసి ఆవేశం కట్టెలు తెంచుకొంటుంది......"
కట్టెలే కాదు,
ఇనుప పాశాలైనా పెళ పెళ మంటు నేల రాలాలి
రొమ్ము విరిచి లొకమనె కదనరంగంలొకి కాలు దువ్వాలి
యుద్ధనాదంతొ కుల్లిన సమాజాన్ని నిదురలేపాలి
వాక్ఖడ్గంతొ భ్రష్టుపట్టిన విలువల్ని తెగనరకాలి
దొరతనం దుష్ట రాజకీయం నెత్తుటి ఏరులై పారాలి
నిజమనే నగ్నత్వం విజయబావుట ఎగురవేయాలి
మత్తెక్కిన లోకానికి కనువిప్పు కలగాలి
నవయుగ సైనికుడవై పోరాటంలొ కొనసాగాలి
నవభారత నిర్మాతగ నిరంతరం చెలరేగాలి
బావితరాలు నిర్భయంగ నిర్మలంగా జీవించాలి!!
(స్పందనకు నా ప్రతిస్పందన:నిశాంత్ తొ సంభాషణలొ ఒక భాగం)

నిర్ణయం!

నీ నవ్వే సెలయేరైతే
అందులో కమలమై
నీ చూపే వెన్నెలైతే
ఆ వెన్నెల్లో బాటసారినై
నీ మనస్సే సంద్రమైతే
అందులో ఒక బిందువునై
నీ హృదయం వినీలాకాశమైతే
అందులో ఓ మేఘాన్నై
ఎప్పటికీ ఉండాలని పరితపిస్తున్నా...

మనస్సు లయ తప్పిందేమో,
హృదయంలో ఈ కలవరం!
ఎందుకో నీ రూపే ప్రతిక్షణం
నా కళ్ళలో కదలాడే!

నా మదిలో అలజడి
తొలగిస్తావని ఆశిస్తూ
మనస్సుని మాటలుగా అందిస్తున్నా
కరుణిస్తావో కదదేరుస్తావో
ఈ నా ఆశల అందలాన్ని
నీదే తుది నిర్ణయం!!!

క్రాంతి

నా నిగ్రహ విగ్రహంలొ విప్లవ కాంతులు విరజిమ్మగ
తిరుబాటు స్వరంతొ నిప్పులు కక్కుతు ప్రజ్వలించగ
కుల్లు కుతంత్రాలతొ నెటి సమాజం తుల్లగ
తిన్నని దారికి నే తెచ్చుటకు ముందడుగేయగ
నా క్రాంతిని కాంతిని భ్రాంతి అంటూ ఆపగలరా మీరు?
తస్కరులార! నన్నాపగలరా మీరు??

అర్థాంగి

పోకిరిగా ఉన్న నాకు ఊపిరి నువ్వైయ్యావు
ఎడారి వంటి జీవితానికి దారి నువ్వైయ్యావు
కామంతొ కన్ను మిన్ను కనని నన్నుప్రేమతొ జయించావు
కర్కశహృదయాన్ని కరిగించి కన్నీటికి భాష్యం చెప్పావు

మనసుల బాషను వివరించగ నువ్వుపరవశుడనై పులకించాను
ఎడారి యదలొ అనురాగపు జల్లులునీపై ప్రేమ చిగురించేను

జీవించాలని నీతొ కలకాలం పయనించాలని
ఆనందంలొ ఆరాటంతొ ఆలొచనలతొ నేను
అవనే హద్దుగ అంతులేని ఆశల వెల్లువ సత్తువతొ
జీవనసాగరమీదగ ప్రేమ జపంలొ జపంతొ నేను

నాదై నాకై తొణకని కుండలా నిలకడగా నా వెన్నంటి నిలువగ నీవు
కొండలనైనా బండలనైనా పిండి చేయగలననివిజ్ఞానంతొ విశ్వాసంతొ నేను

తోడు నీవై నీడ నీవై జీవనబాటకు వెలుగు నీవై

ప్రతి కదానికి కాంతిని తరచిప్రతి పదానిని పాటగ విరచి
మనసుల పలకలపై చెరగని ముద్రను వేసావు నువ్వు

ఆశ నీవై అమ్మ నీవై అనురాగపు అలవు నీవై
లౌక్యాన్ని వివరించి సౌఖ్యాన్ని నేర్పించి
హృదయపు తలుపుల విలాసంలొ నిత్య నివాసం నాకిచ్చావు

నాలొ సగమై సమమై స్వరమై సర్వమై స్థిరమై
చెరగని నవ్వుతొ తరగని ప్రేమతొ
సదా నీ తోడని నువ్వె నా సరి జోడని
పురుగువంటి నన్ను స్మరించి వరించి తరింపజేసావు!